నారా రోహిత్ లవ్ స్టొరీ.. మ్యాటరేంటంటే..

ఈ నెల 13వ నారా రోహిత్ నిశ్చితార్ధం హైదరాబాద్ లో జరగబోతోందనే మాట వినిపిస్తోంది.

Update: 2024-10-11 05:16 GMT

యంగ్ హీరో నారా రోహిత్ త్వరలో పెళ్లి పీటలు ఎక్కబోతున్నాడనే విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ‘బాణం’ సినిమాతో హీరోగా పరిచయం అయిన నారా రోహిత్ వరుస సినిమాలు చేస్తూ తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ క్రియేట్ చేసుకున్నాడు. విభిన్న కథలతో మూవీస్ చేసిన నారా రోహిత్ ఈ ఏడాది ‘ప్రతినిధి 2’ మూవీతో ప్రేక్షకుల ముందుకొచ్చారు. అయితే తనతో ఒక సినిమాలో హీరోయిన్ గా నటించిన అమ్మాయిని నారా రోహిత్ పెళ్లి చేసుకోబోతున్నాడనే ప్రచారం నడుస్తోంది.

ఆ అమ్మాయి పల్నాడుకు చెందిన అచ్చమైన తెలుగమ్మాయని తెలుస్తోంది. అయితే నారా ఫ్యామిలీ నుంచి దీనిపై అఫీషియల్ ప్రకటన రాలేదు. ఈ నెల 13వ నారా రోహిత్ నిశ్చితార్ధం హైదరాబాద్ లో జరగబోతోందనే మాట వినిపిస్తోంది. నారా భువనేశ్వరి ఈ నిశ్చితార్ధ వేడుక ఏర్పాట్లు దగ్గరుండి చూసుకుంటున్నారంట.

ఇదిలా ఉంటే నారా రోహిత్ చేసుకోబోయే అమ్మాయి, వారిద్దరి ప్రయాణం గురించి ఇంటరెస్టింగ్ విషయాలు తెరపైకి వచ్చాయి. నారా రోహిత్, ఆ అమ్మాయి గత 10 ఏళ్ళుగా రిలేషన్ షిప్ లో ఉన్నారంట. ఆమె ఆస్ట్రేలియా సిటిజన్ అని టాక్. ఆమె రోహిత్ సినిమాతోనే హీరోయిన్ గా పరిచయం అయ్యింది. తరువాత వీరి రిలేషన్ గురించి ఇంట్లో వాళ్ళకి చెప్పారని సమాచారం.

వీరిద్దరి పెళ్లి వ్యవహారం అంతా నారా భువనేశ్వరి దగ్గరుండి నడిపారని ప్రచారం జరుగుతోంది. నారా రోహిత్ కి పెద్దమ్మ అయిన భువనేశ్వరి అమ్మాయి కుటుంబ సభ్యులతో మాట్లాడినట్లు టాక్. పెళ్లి డిసెంబర్ లో జరిగే అవకాశం ఉందంట. ఇప్పటికే ముహూర్తాలు కూడా నిర్ణయించినట్లు ఇండస్ట్రీ వర్గాలలో చర్చ నడుస్తోంది.

ఇదిలా ఉంటే ఈ పెళ్లి వేడుకకి జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ కూడా హాజరవుతారని అంటున్నారు. అయితే అదెంత వరకు సాధ్యం అనేది తెలియదు. నిశ్చితార్ధ వేడుక కుటుంబ సభ్యులు, బంధుమిత్రుల మధ్యలో జరగబోతోందనే మాట వినిపిస్తోంది. ఆ రోజు పెళ్లి డేట్ కూడా ఎనౌన్స్ చేస్తారా అనేది తెలియాల్సి ఉంది.

ఇదిలా ఉంటే నారా రోహిత్ నటించిన ‘సుందరకాండ’ మూవీ రిలీజ్ కి రెడీ అవుతోంది. కామెడీ ఎంటర్టైనర్ గా ఈ చిత్రం తెరకెక్కింది. అలాగే తమిళ్ హిట్ మూవీ ‘గరుడన్’ రీమేక్ లో నారా రోహిత్ నటిస్తున్నారు. విజయ్ కుమార్ కనకమేడల దర్శకత్వంలో బెల్లంకొండ సాయి శ్రీనివాస్, మంచు మనోజ్, నారా రోహిత్ కాంబినేషన్ లో మల్టీ స్టారర్ గా మూవీ తెరకెక్కుతోంది.

Tags:    

Similar News