నేషనల్ అవార్డుల ఎంపిక.. ఫ్యాన్స్ సీరియస్

దేశవ్యాప్తంగా సినీ రంగంలో ప్రతిభ కనబరిచిన వారికి జాతీయ స్థాయి అవార్డులు ఇవ్వడం అనేది జరుగుతుంది

Update: 2023-08-25 04:03 GMT

దేశవ్యాప్తంగా సినీ రంగంలో ప్రతిభ కనబరిచిన వారికి జాతీయ స్థాయి అవార్డులు ఇవ్వడం అనేది జరుగుతుంది. అయితే ఈ అవార్డులని సౌత్ ఇండియాలో తమిళ్ ఇండస్ట్రీ నుంచి చాలా మంది అందుకున్నారు. వివిధ విభాగాలలో తమిళ్ సినిమాలకి అవార్డులు వచ్చాయి. సురరై పోట్రు సినిమాకి జాతీయ అవార్డులు వచ్చాయి. అయితే 2021లో విడుదలైన చిత్రాలకి గాను ప్రకటించిన నేషనల్ అవార్డుల జాబితాలో అస్సలు తమిళ్ సినిమాలకి చోటు లభించలేదు.

కోలీవుడ్ నుంచి ఆ ఏడాది మంచి చిత్రాలు చాలా వచ్చాయి. జై భీమ్, ఆర్య సర్పట్ట పరంపర, ధనుష్ కర్ణన్, వెంకట్ ప్రభు మానాడు సినిమాలు వచ్చాయి. ఈ సినిమాలన్నీ విమర్శకుల ప్రశంసలు కూడా సొంతం చేసుకున్నాయి. జై భీమ్ సినిమాలో సూర్య పెర్ఫార్మెన్స్ కి బెస్ట్ యాక్టర్ అవార్డు వస్తుందని తమిళ్ సినీ ఫ్యాన్స్ ఆశించారు. అయితే వారి అంచనాలు తలక్రిందులు చేస్తూ ఈ సారి నేషనల్ అవార్డులలో తెలుగు సినిమాలు సత్తా చాటాయి.

ఆర్ఆర్ఆర్, పుష్ప, ఉప్పెన, కొండపొలం సినిమాలకి వివిధ విభాగాలలో అవార్డులు వచ్చాయి. నిజంగా ఇది తెలుగు సినిమాకి గర్వకారణం అని చెప్పాలి. తెలుగు సినీ చరిత్రలో అల్లు అర్జున్ కి మొదటిసారి బెస్ట్ యాక్టర్ అవార్డు వచ్చింది. దీనిని బట్టి మనకి నేషనల్ అవార్డుల ఎంపికలో ఎంత తక్కువ ప్రాధాన్యత ఉందో గుర్తించవచ్చు. అయితే తమిళ్ సినిమాలకి ప్రతిసారి అవార్డులు వచ్చిన ఈ సారి రాలేదని అవార్డుల ఎంపిక సభ్యులపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా జై భీమ్ సినిమాకి ఏదో ఒక కేటగిరీలో అవార్డు రావాలని ఆశించిన రాకపోవడం కూడా వారి కోపానికి కారణం అయ్యింది.

దీంతో ట్విట్టర్ లో ట్రోలింగ్ మొదలుపెట్టారు. కావాలని తమిళ్ సినిమాలని విస్మరించారని వారు తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం అవార్డులు అందుకున్న తెలుగు సినిమాల కంటే గొప్పగా కోలీవుడ్ సినిమాలు ఉంటాయని పోస్టులు పెడుతున్నారు. అలాగే జ్యూరీ అవార్డుల ఎంపికలో రాజకీయాలు జరిగాయని విమర్శలు చేస్తున్నారు. తెలుగు సినిమా మునుపెన్నడూ లేని విధంగా తన గుర్తింపు పెంచుకుంటూ వెళ్ళింది.

మన స్టార్ హీరోలు కూడా కమర్షియల్ హద్దులు చెరిపేసి కొత్త కథలతో సినిమాలు చేస్తున్నారు. అందుకే ఈ సారి నేషనల్ అవార్డులలో టాలీవుడ్ సినిమాలకి గౌరవ స్థానం లభించింది. నాటునాటు పాటకి ఆస్కార్ అవార్డు వచ్చినపుడు కూడా తమిళ్ సినీ అభిమానులు విమర్శలు చేశారు. అలాగే ఇప్పుడు నేషనల్ అవార్డుల ఎంపికలలో ఏదో రాజకీయం జరిగిందనే విధంగా సోషల్ మీడియాలో పోస్టులు పెడుతూ ఉండటం విశేషం.

Tags:    

Similar News