నవీన్ పొలిశెట్టి..ఇది కదా క్లారిటీ!
ఒక నార్మల్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ సినిమాకి వెళ్లాలంటే 2 వేల వరకు ఖర్చు పెడతారు. అది ఎంతో కష్టపడి వారు సంపాదిస్తారు. దాని వేల్యూ నాకు తెలుసు.
ప్రస్తుతం టాలీవుడ్ లో యంగ్ హీరోగా తనకంటూ యూనిక్ ఐడెంటిటీ క్రియేట్ చేసుకుంటూ దూసుకుపోతున్న నటుడు నవీన్ పొలిశెట్టి. ఎప్పుడో లైఫ్ ఈజ్ బ్యూటీఫుల్ మూవీలో నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో నటించిన నవీన్ తర్వాత మహేష్ బాబు వన్ మూవీలో ఓ చిన్న రోల్ చేశాడు. ఏజెంట్ సాయి శ్రీనివాస్ ఆత్రేయ మూవీతో హీరోగా టర్న్ తీసుకొని సక్సెస్ అందుకున్నాడు.
దాని తర్వాత చాలా గ్యాప్ తీసుకొని జాతిరత్నాలు సినిమాతో మరో బ్లాక్ బస్టర్ ని ఖాతాలో వేసుకున్నాడు. ఈ సినిమాతో వచ్చిన ఇమేజ్ కారణంగా నవీన్ కి కి చాలా మంది దర్శకులు కథలు చెప్పడం స్టార్ట్ చేశారు. అయితే మళ్ళీ రెండేళ్లు గ్యాప్ తీసుకొని మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి సినిమాతో ప్రేక్షకుల ముందుకి రావడానిక్ రెడీ అవుతున్నారు. ఇది కంప్లీట్ డిఫరెంట్ కాన్సెప్ట్ తోనే నవీన్ చేస్తున్నాడు.
స్టాండ్ అప్ కమెడియన్ పాత్రలో ఈ చిత్రంలో నవీన్ అలరించబోతున్నాడు. సెప్టెంబర్ 7న ఈ చిత్రం థియేటర్స్ లోకి రాబోతోంది. అనుష్క శెట్టి ఈ మూవీలో హీరోయిన్ గా నటిస్తోంది. తాజాగా ఈ మూవీ ట్రైలర్ రిలీజ్ అయ్యింది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్ లో నవీన్ చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మీరు సినిమా సినిమాకి ఎందుకు ఇంత గ్యాప్ తీసుకుంటున్నారు అని ఓ జర్నలిస్ట్ అడిగిన ప్రశ్నకి నవీన్ సమాధానం ఇచ్చారు.
ఒక నార్మల్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ సినిమాకి వెళ్లాలంటే 2 వేల వరకు ఖర్చు పెడతారు. అది ఎంతో కష్టపడి వారు సంపాదిస్తారు. దాని వేల్యూ నాకు తెలుసు. నేను కూడా సినిమాల కోసం డబ్బులు లేక ఫ్రెండ్స్ ని రిక్వస్ట్ చేసి వారిని పెట్టమని వెళ్లినవాడినే. అందుకే వారు పెట్టే పైసలకి సినిమాలో వేల్యూ మనం ఇవ్వాలని నేను గట్టిగా నమ్ముతా. ఆ వేల్యూ ఉండాలంటే బాగా రాసిన స్టోరీ, కొత్తదనం ఉండేలా చూసుకోవాలి.
తన ప్రతి సినిమాలో కూడా ఏదో కొత్తదనం తెలుగు ఆడియన్స్ కి ఇవ్వాలని ప్రయత్నం చేస్తున్న. ఈ ప్రాసెస్ లో రైటింగ్, కి కథని ప్రోపర్ గా ఎగ్జిక్యూట్ చేయడానికి టైం పడుతుందని నవీన్ చెప్పుకొచ్చాడు. ఆ కారణంగానే తన సినిమా సినిమాకి ఎక్కువ గ్యాప్ వస్తుందని క్లారిటీ ఇచ్చాడు. నవీన్ కి ఉన్న ఈ క్లారిటీ టాలీవుడ్ లో చాలా మంది హీరోలకి ఉంటే మంచి కంటెంట్ తో సినిమాలు ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుందనే మాట నెటిజన్లు నుంచి వినిపిస్తోంది.