ఫోటో స్టోరి: అంబానీ సంగీత్‌లో మెరుపు తీగ‌

న‌వ్య‌ సహజ సౌందర్యాన్ని మ‌రింత‌గా పెంచుతూ ఐషాడో న్యూడ్ లిప్స్ అద‌న‌పు హంగును స‌మ‌కూర్చాయి. సంగీత్ వేడుక‌లో న‌వ్య యూనిక్ లుక్ గురించి బోలెడంత చర్చ సాగింది.

Update: 2024-07-07 06:18 GMT

ముకేశ్ అంబానీ -నీతా అంబానీ దంప‌తుల‌ కుమారుడు అనంత్ అంబానీ తన ప్రియమైన రాధికా మర్చంట్ ని పెళ్లాడేందుకు సిద్ధ‌మైన సంగ‌తి తెలిసిందే. 12 జూలై గ్రాండ్ వెడ్డింగ్‌కు ఇరు కుటుంబాలు అన్ని ఏర్పాట్లు చేయ‌గా, జియో వ‌ర‌ల్డ్ సెంట‌ర్ దీనికి వేదిక ముస్తాబైంది. ఇప్ప‌టికే పెళ్లి సంబ‌రాలు మొద‌ల‌య్యాయి. వివాహానికి ముందు వరుస వేడుకలు జరుగుతున్నాయి. ఈ ఈవెంట్‌లలో ముంబైలోని నీతా ముఖేష్ అంబానీ కల్చరల్ సెంటర్ (NMACC)లో సంగీత్ వేడుక‌తో అస‌లైన సంబ‌రాలు ఆకాశాన్నంటాయి. ఇప్పటికే పలువురు అతిథులు ఈ వేదిక వ‌ద్ద ప్ర‌ద‌ర్శ‌న‌లు ఇచ్చారు.

 

అమితాబ్ బచ్చన్ - జయా బచ్చన్‌ల మనవరాలు నవ్య నవేళి నందా స్టైలిష్ అండ్ బోల్డ్ లుక్ తో అందరి దృష్టిని ఆకర్షించింది. యువ వ్యాపారవేత్త అబూ జానీ సందీప్ ఖోస్లా రూపొందించిన మోడ్ర‌న్ లెహంగా సాంప్రదాయ సొబగులు అంద‌రి క‌ళ్ల‌ను ఆక‌ర్షించాయి. స్లీవ్‌లెస్ బ్రాలెట్-స్టైల్డ్ చోళీ ప్రత్యేకమైన లెహంగా స్కర్ట్‌తో జోడించ‌డంతో న‌వ్య ఎంతో ప్ర‌త్యేకంగా క‌నిపించింది. నవ్య మిరుమిట్లు గొలిపే డైమండ్ ప‌చ్చ‌ల‌తో పొదిగిన నెక్లెస్‌తో అందంగా క‌నిపించింది. ఈ బోల్డ్ వస్త్రధారణకు అధునాతనతను జోడించింది. న‌వ్య‌ సహజ సౌందర్యాన్ని మ‌రింత‌గా పెంచుతూ ఐషాడో న్యూడ్ లిప్స్ అద‌న‌పు హంగును స‌మ‌కూర్చాయి. సంగీత్ వేడుక‌లో న‌వ్య యూనిక్ లుక్ గురించి బోలెడంత చర్చ సాగింది.

 

ఈ గ్రాండ్ వెడ్డింగ్‌కు త‌గ్గ‌ట్టుగానే సెల‌బ్రిటీలంతా విలాసవంతమైన అలంకరణలు, ప్రదర్శనలతో అద్భుత దృశ్యాన్ని ఆవిష్క‌రించారు. సల్మాన్ ఖాన్, రణవీర్ సింగ్, దీపికా పదుకొణె, కియారా అద్వానీ, సిద్ధార్థ్ మల్హోత్రా, జాన్వీ కపూర్, విక్కీ కౌశల్, అలియా భట్, రణబీర్ కపూర్ వంటి ప్రముఖులు ఈ వేడుక‌ల‌కు హాజరయ్యారు. ఈవెంట్ కు గ్లిట్జ్ అండ్ గ్లామర్‌ను జోడించారు. ఈవెంట్ లోపల నుండి వీడియోలు ఇప్పటికే సోషల్ మీడియాల్లో వైర‌ల్ గా మారాయి. సంగీత్‌లో నవ్య నవేలీ నందా ఫ్యాషన్-ఫార్వర్డ్ సెన్సిబిలిటీ .. సాంప్రదాయిక అంశాలను సమకాలీన శైలితో మిళితం చేసిన తీరు ఇత‌ర‌ ఫ్యాషనబుల్ అతిథులలో త‌న‌ను ప్రత్యేకంగా నిలిచేలా చేసింది. సంగీత్ లో అంత‌ర్జాతీయ పాప్ స్టార్ జ‌స్టిన్ బీబ‌ర్ గానాలాప‌న‌, ప్ర‌ద‌ర్శ‌న‌లు వేడుక‌లో హైలైట్ గా నిలిచాయి. ర‌ణ్ వీర్ సింగ్ ప్ర‌త్యేక ప్ర‌ద‌ర్శ‌న ఎంత‌గానో ఆక‌ట్టుకుంది.

Tags:    

Similar News