విడాకులు ర‌ద్దు చేసుకున్న ప్ర‌ముఖ న‌టుడు!

భార్య ప‌రువు తీసినా, గొడ‌వ‌ల‌తో కుటుంబాన్ని న‌డిరోడ్డుకీడ్చినా అత‌డు స‌హ‌నంగానే ఉన్నాడు. పిల్ల‌ల కోసం ఆమెను భ‌రించి ఇప్పుడు ఇంటికి చేర‌నిచ్చాడు

Update: 2024-03-26 05:01 GMT

భార్య ప‌రువు తీసినా, గొడ‌వ‌ల‌తో కుటుంబాన్ని న‌డిరోడ్డుకీడ్చినా అత‌డు స‌హ‌నంగానే ఉన్నాడు. పిల్ల‌ల కోసం ఆమెను భ‌రించి ఇప్పుడు ఇంటికి చేర‌నిచ్చాడు. దీంతో ఇప్పుడు ఆ భార్య అత‌డిపై ప్ర‌శంస‌లు కురిపిస్తోంది. ఇంత‌కీ ఈ ఎపిసోడ్ ఏ దంప‌తుల మ‌ధ్య అంటే.. ప్ర‌ముఖ బాలీవుడ్ న‌టుడు న‌వాజుద్దీన్ సిద్ధిఖీ, అత‌డి భార్య ఆలియా న‌డుమ స‌న్నివేశ‌మిది.

నవాజుద్దీన్ సిద్ధిఖీ - ఆలియా సిద్ధిఖీ దంప‌తుల మ‌ధ్య వివాదం, కుటుంబ క‌ల‌త‌ల గురించి తెలిసిందే. ఈ ఇద్ద‌రి గొడ‌వా ర‌చ్చ‌కెక్కింది. మీడియా ఈ గొడ‌వ‌ను చిలువ‌లు ప‌లువలు చేసింది. అదే క్ర‌మంలో విడాకుల‌కు ద‌ర‌ఖాస్తు చేసుకున్నారు. కానీ ఇప్పుడు సీన్ మారింది. తమ వివాహానికి మరో అవకాశం ఇవ్వాలని భావించారు. బాలీవుడ్‌లో సంబంధాలు పెళుసుగా విచిత్రంగా ఉంటాయి అని భావించేవారికి ఇది చెంప‌పెట్టుగానే మారింది.

విడిపోయే దశలో ఉన్న దంప‌తులు తమ మ‌ధ్య‌ ప్రేమను గ్రహించి రాజీపడటం అభినందనీయం అయినా కానీ, నవాజుద్దీన్ ప‌రువు మ‌ర్యాద‌ల‌ను ఆలియా ర‌చ్చ‌కీడ్చింద‌నేది స్ప‌ష్ఠంగా నిజం. ఆలియా వ‌ల్ల న‌టుడు న‌వాజుద్దీన్ ని సోషల్ మీడియా , పబ్లిక్ ప్లాట్‌ఫారమ్‌లలో నెటిజ‌నులు బహిరంగంగా తిట్టాడు. ఇప్పుడు ఆలియా మారింది. ఇటీవలి పోస్ట్‌తో ఆశ్చ‌ర్య‌ప‌రిచింది. ఈ జంట తమ వివాహబంధాన్ని కాపాడుకోవాల‌నుకుంటున్నారు. ముఖ్యంగా త‌న భార్య‌ ఆలియాను కాపాడుకోవడానికి న‌వాజుద్దీన్ ప్రయత్నిస్తున్నట్లు కనిపిస్తోంది. ఆస‌క్తిక‌రంగా ఆలియా వేరొక‌రితో ప్రేమ‌లో ఉందంటూ కూడా ప్ర‌చార‌మైంది. అయినా న‌వాజుద్దీన్ త‌న మంచి మ‌న‌సును చాటుకున్నాడు. బాలీవుడ్ లో చాలా దిగువ స్థాయి నుంచి ఎలాంటి సినీనేప‌థ్యం లేకుండా వచ్చి పెద్ద స్టార్ అయ్యాడు.

మారిన ఆలియా తన సోషల్ మీడియాల్లో ఒక‌ వీడియోను పోస్ట్ చేసింది. వీడియోలో నవాజుద్దీన్ సిద్ధిఖీ, ఆలియా సిద్ధిఖీ వారి పిల్లలతో కలిసి ఉన్నారు. 14 ఏళ్ల వైవాహిక బంధాన్ని సెల‌బ్రేట్ చేసుకుంటున్నట్లు ఈ వీడియోకు క్యాప్షన్ ఇచ్చారు. అవును.. అంతా పబ్లిక్ అయిపోయాక‌.. అవమానాలు భ‌రించాక భ‌ర్త‌పై ప్రేమ కురిపించింది. 14వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా విడిపోయిన భర్త నవాజుద్దీన్ సిద్ధిఖీకి శుభాకాంక్షలు తెలియజేసింది. నవాజ్ తన ఏకైక ప్రేమికుడు అని కూడా తెలిపింది.

ఇప్పటి వరకు, నవాజుద్దీన్ ఈ పోస్ట్‌పై వ్యాఖ్యానించలేదు లేదా మళ్లీ పోస్ట్ చేయలేదు. నవాజుద్దీన్ సిద్ధిఖీ - ఆలియా సిద్ధిఖీ 2010లో వివాహం చేసుకున్నారు. నవాజ్ 2007లో ఆలియాతో విడిపోయారని, ఆ తర్వాత చాలా మంది మహిళలతో డేటింగ్ చేశారని, ఆలియాపై తనకున్న ప్రేమను తెలుసుకునేందుకు మాత్రమే ఇలా చేసాడ‌ని క‌థ‌నాలొచ్చాయి. ఇద్దరూ కలిసి తిరిగి 2010లో వివాహం చేసుకున్నారు. ఇద్దరు అందమైన పిల్లలు వీరికి ఉన్నారు. ఒక అబ్బాయి ఒక అమ్మాయిని ఈ దంప‌తుల‌కు ఉన్నారు.

అయితే 2020లో ఇరువురి న‌డుమా గొడ‌వ మొద‌లైంది. ఆ త‌ర్వాత ఆలియా త‌న భ‌ర్త న‌వాజుద్దీన్ పై తీవ్రంగా ఆరోపించింది. నవాజ్ కి చెందిన‌ మగ మేనేజర్ తమ యుక్తవయసులో ఉన్న కుమార్తెను అనుచితంగా కౌగిలించుకున్నారని ఆలియా నవాజ్‌ను బహిరంగంగా నిందించింది. నవాజ్ తన జ్ఞాపకాలలో వ్య‌క్తిగ‌త‌ వ్యవహారాలను మీడియా ఎదుటే బహిరంగంగా చర్చించారని ఆలియా విమర్శించారు. త‌న‌ను ఇంట్లో ఉండ‌నివ్వ‌డం లేద‌ని న‌వాజుద్దీన్ కుటుంబీకుల‌ను విమ‌ర్శించారు.

Tags:    

Similar News