లేడీ సూపర్ స్టార్‌ - స్టార్‌ డైరెక్టర్ కాంబో ఫిక్స్‌

వెట్రిమారన్ ఒక వైపు వరుసగా సినిమాలను రూపొందిస్తూ మరో వైపు తన శిష్యులతో సినిమాలను నిర్మిస్తున్నారు.

Update: 2024-02-17 06:36 GMT
లేడీ సూపర్ స్టార్‌ - స్టార్‌ డైరెక్టర్ కాంబో ఫిక్స్‌
  • whatsapp icon

లేడీ సూపర్‌ స్టార్‌ నయనతార పెళ్లి మరియు పిల్లల తర్వాత కూడా ఏ మాత్రం తగ్గడం లేదు. సినిమాల విషయంలో ఆమె ఇంకాస్త ఎక్కువ దూకుడు కొనసాగిస్తున్నట్లు ఆమె సినిమాల ఎంపిక ను చూస్తే అర్థం అవుతుంది. ఇప్పటికే రెండు లేడీ ఓరియంటెడ్‌ సినిమాలు చేస్తున్న నయనతార తాజాగా ప్రముఖ దర్శకుడి నిర్మాణంలో సినిమాకు గ్నీన్ సిగ్నల్‌ ఇచ్చింది.

వెట్రిమారన్ ఒక వైపు వరుసగా సినిమాలను రూపొందిస్తూ మరో వైపు తన శిష్యులతో సినిమాలను నిర్మిస్తున్నారు. అందులో భాగంగానే తన శిష్యుడు విక్రమన్ అశోకన్‌ దర్శకత్వంలో నయనతార హీరోయిన్ గా ఒక సినిమాను రూపొందించేందుకు గాను ఏర్పాట్లు జరుగుతున్నట్లుగా తమిళ సినీ వర్గాల ద్వారా సమాచారం అందుతోంది.

ఈ లేడీ ఓరియంటెడ్‌ సినిమాలో కవిన్‌ కీలక పాత్రలో కనిపించబోతున్నట్లుగా తెలుస్తోంది. నయనతార ను గతంలో ఎప్పుడు చూడని విధంగా ఈ సినిమాలో విక్రమన్‌ అశోకన్ చూపించబోతున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. విభిన్న చిత్రాలను ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చే దర్శకుడు వెట్రిమారన్ ఈ సినిమాను కూడా అంతే విభిన్నంగా ప్రేక్షకుల ముందుకు తీసుకు వస్తాడని అంతా నమ్ముతున్నారు.

నయనతార ఒక వైపు తన భర్త విఘ్నేష్‌ శివన్ దర్శకత్వంలో సినిమాను చేయబోతుందనే వార్తలు వస్తున్నాయి. మరో వైపు తన సొంత నిర్మాణ సంస్థ అయిన రౌడీ పిక్చర్స్ బ్యానర్ లో కూడా సినిమాను చేసేందుకు రెడీ అవుతోంది. ఇలాంటి సమయంలో వెట్రిమారన్‌ నిర్మాణంలో సినిమాకు ఓకే చెప్పింది.

లేడీ ఓరియంటెడ్‌ సినిమాలో పాటు కమర్షియల్‌ హీరోయిన్‌ గా స్టార్‌ హీరోలకు జోడీగా కూడా ఈ అమ్మడు వరుసగా సినిమాలు చేస్తున్న నేపథ్యంలో సౌత్‌ లోనే అత్యధిక పారితోషికం తీసుకుంటున్న హీరోయిన్స్‌ జాబితాలో ఈ అమ్మడు ముందు వరుసలో ఉంది అనడంలో సందేహం లేదు.

Tags:    

Similar News