NBK109: అందరి ఫోకస్ దానిపైనే..

నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం బాబీ దర్శకత్వంలో హై వోల్టేజ్ యాక్షన్ మూవీ చేస్తోన్న సంగతి తెలిసిందే.

Update: 2024-09-27 04:24 GMT

నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం బాబీ దర్శకత్వంలో హై వోల్టేజ్ యాక్షన్ మూవీ చేస్తోన్న సంగతి తెలిసిందే. సరికొత్త యాక్షన్ డ్రామాగా ఈ చిత్రం కథ ఉండబోతోందట. ఇప్పటికే మెజారిటీ షూటింగ్ పూర్తయ్యిందని సమాచారం. 2025 సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకి ఈ సినిమాని తీసుకొస్తారనే ప్రచారం నడుస్తోంది. మేకర్స్ అయితే అఫీషియల్ గా రిలీజ్ డేట్ ఎనౌన్స్ చేయలేదు. కచ్చితంగా బాలయ్య ఖాతాలో మరో బ్లాక్ బస్టర్ మూవీగా ‘NBK109’ నిలుస్తుందని ఫ్యాన్స్ బలంగా నమ్ముతున్నారు.

ఇదిలా ఉంటే ఈ సినిమా మేజర్ షూటింగ్ షెడ్యూల్ ని రీసెంట్ గా కంప్లీట్ చేసిన చిత్ర యూనిట్ త్వరలో టైటిల్ ని ఎనౌన్స్ చేస్తామని తెలిపారు. దీంతో నందమూరి అభిమానులు టైటిల్ టీజర్ కోసం వెయిట్ చేస్తున్నారు. మేకర్స్ నుంచి ఇప్పటి వరకు ఈ టైటిల్ పోస్టర్ లేదా టీజర్ పై ఎలాంటి అప్డేట్ ఇవ్వలేదు. ఈ సినిమా కథ ఎలా ఉంటుందనేది కూడా ఎవరికి తెలియదు. ఫ్యాన్స్ మూవీ అప్డేట్ కోసం వేయికళ్లతో ఎదురుచూస్తున్నారు.

ఇదిలా ఉంటే ఇండస్ట్రీ వర్గాలలో వినిపిస్తోన్న టాక్ బట్టి ‘NBK109’ మూవీ టైటిల్ మోషన్ పోస్టర్ లేదంటే టీజర్ ని దసరా కానుకగా ప్రేక్షకుల ముందుకి తీసుకొచ్చే ఆలోచనలో మేకర్స్ ఉన్నారంట. డైరెక్టర్ బాబీ కూడా దసరాకి మించిన స్పెషల్ అకేషన్ ఉండదని భావించి అప్పుడే టైటిల్ అప్డేట్ ఇవ్వాలని భావిస్తున్నారని సమాచారం. అక్టోబర్ మొదటి వారంలో దీనిపై పూర్తిస్థాయిలో స్పష్టత వచ్చే అవకాశం ఉందనే మాట వినిపిస్తోంది.

‘NBK109’ చిత్రంలో శ్రద్ధా శ్రీనాథ్, ప్రగ్యా జైశ్వాల్, ఊర్వశీ రౌతేలా హీరోయిన్స్ గా నటించారు. అలాగే బాబీ డియోల్ పవర్ ఫుల్ ప్రతినాయకుడిగా కనిపిస్తున్నాడు. ఈ సినిమా కంప్లీట్ చేసిన తర్వాత బాలకృష్ణ బోయపాటి దర్శకత్వంలో చేయనున్న ‘అఖండ 2’ పైన పూర్తిగా ఫోకస్ చేయనున్నాడు. పాన్ ఇండియా రేంజ్ లో 150 కోట్ల బడ్జెట్ తో ‘అఖండ 2’ ని బోయపాటి తెరకెక్కించబోతున్నారు. ఆ సినిమాపై ఫ్యాన్స్ లో భారీ అంచనాలు ఉన్నాయి.

వరుస హిట్స్ తో జోరు మీదున్న బాలయ్య ‘NBK109’ తో సూపర్ హిట్ కొడితే మార్కెట్ రేంజ్ కూడా అమాంతం పెరుగుతుంది. ఆ తరువాత బోయపాటితో రాబోయే ‘అఖండ 2’ చిత్రంతో పాన్ ఇండియా స్టార్ గా మారిపోవడం గ్యారెంటీ అనే మాట వినిపిస్తోంది. మరి ఆ సినిమాపై అప్డేట్ ఎప్పుడు ఇస్తారో చూడాలి.

Tags:    

Similar News