రావు రమేష్ కోసం రామ్ మిరియాల పాడిన పాట!

ఈ నేపథ్యంలో తాజాగా 'నేనే సుబ్రహ్మణ్యం' అనే టైటిల్ సాంగ్ ను ఆవిష్కరించడం ద్వారా మ్యూజికల్ ప్రమోషన్స్ ప్రారంభించారు.

Update: 2024-03-22 13:35 GMT

విలక్షణ నటుడు రావు రమేష్ టైటిల్ రోల్‌ పోషించిన లేటెస్ట్ కామెడీ ఎంటర్టైనర్ 'మారుతీ నగర్ సుబ్రమణ్యం'. లక్ష్మణ్ కార్య దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమ రావు రమేష్ సరసన ఇంద్రజ నటించారు. ఇటీవలే ఈ చిత్రాన్ని అధికారికంగా అధికారికంగా ప్రకటించిన మేకర్స్.. ఫస్ట్ లుక్ ను లాంచ్ చేసారు. సినీ ఇండస్ట్రీలో గతంలో ఎవరూ విధంగా ప్రేక్షకుల చేత క్యూఆర్ కోడ్ స్కాన్ చేయించి విడుదల చేసిన ఈ పోస్టర్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ నేపథ్యంలో తాజాగా 'నేనే సుబ్రహ్మణ్యం' అనే టైటిల్ సాంగ్ ను ఆవిష్కరించడం ద్వారా మ్యూజికల్ ప్రమోషన్స్ ప్రారంభించారు.

''మారుతీ నగర్ లో ఫేమస్ అంటే నేనేలే..అందరూ ఇదే మాట అంటారులే... మహారాజా యోగమే ఆన్ ద వేలో ఉందిలే.. నన్ను పట్టుకోవడానికే వస్తుందిలే...'' అంటూ సాగిన ఈ పాట సంగీత ప్రియులను అలరిస్తోంది. సెన్సేషనల్ సింగర్ రామ్ మిరియాల ఈ గీతాన్ని ఎంతో హుషారుగా ఆలపించారు. మ్యూజిక్ డైరెక్టర్ కళ్యాణ్ నాయక్ మంచి క్యాచీ ట్యూన్ కంపోజ్ చెయ్యగా.. గీత రచయిత భాస్కరభట్ల అందరూ పాడుకునేలా చక్కటి సాహిత్యం అందించారు.

'నేనే సుబ్రమణ్యం.. మై నేమ్ ఈజ్ సుబ్రమణ్యం.. నాకు నేనే ఇష్టం.. మీకేంటంట కష్టం' అంటూ సినిమాలో రావు రమేష్ క్యారెక్టరైజేషన్ ను 'మారుతీ నగర్ సుబ్రమణ్యం' టైటిల్ సాంగ్ ద్వారా వివరించారు. చుట్టుపక్కల జనాలు సలహాలు ఇచ్చినా తాను పట్టించుకోనని, తన జీవితాన్ని తనకు నచ్చిన విధంగా జీవించడానికి ఇష్టపడతాడని సుబ్రమణ్యం పాత్ర స్వభావాన్ని ఈ పాటలో తెలియజేసారు. 'నాక్కొంచెం తిక్కుంది పవర్ స్టార్ చెప్పినట్లు.. దానికో లెక్కుందిలే మరీ' అంటూ 'గబ్బర్ సింగ్' డైలాగ్ ను కూడా ఈ సాంగ్ లో పెట్టారు.

'మారుతీ నగర్ సుబ్రమణ్యం' టైటిల్ సాంగ్ ఇన్స్టెంట్ చార్ట్ బస్టర్ గా మారింది. ఇప్పుడు సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా 'నేనే సుబ్రమణ్యం' ప్రోమోకు నెటిజన్స్ వేసిన స్టెప్పులే కనిపిస్తున్నాయి. ఇన్‌స్టాగ్రామ్ ఫేమస్ 'కచ్చా బాదాం' గర్ల్ అంజలి అరోరా ఈ ఎనర్జిటిక్ డ్యాన్స్ నంబర్ కు స్టెప్పులు వేయడం నెట్టింట వైరల్ గా మారింది. అనేకమంది ఇతర సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్‌లు కూడా తమదైన శైలిలో డ్యాన్స్ చేసి రీల్స్ షేర్ చేస్తుండటంతో రావు రమేష్ పాట నెట్టింట సెన్సేషన్ గా మారుతోంది.

'మారుతీనగర్ సుబ్రమణ్యం' చిత్రంలో రావు రమేష్, ఇంద్రజలతో పాటుగా అంకిత్ కొయ్య, రమ్య పసుపులేటి, హర్షవర్ధన్, అజయ్, అన్నపూర్ణమ్మ, ప్రవీణ్ తదితరులు ఇతర ప్రధాన పాత్రలు పోషించారు. పీబీఆర్ సినిమాస్, లోకమాత్రే సినిమాటిక్స్ బ్యానర్స్ పై బుజ్జి రాయుడు పెంట్యాల, మోహన్ కార్య ఈ సినిమాని నిర్మించారు. రుషి మర్ల, శివప్రసాద్ మర్ల సహ నిర్మాతలుగా వ్యవహరించారు. ఎంఎన్ బాల్ రెడ్డి సినిమాటోగ్రఫీ నిర్వహించిన ఈ సినిమాకి సురేష్ భీమంగని ఆర్ట్ డైరెక్టర్ గా వర్క్ చేసారు. బొంతల నాగేశ్వర్ రెడ్డి ఎడిటింగ్ బాధ్యతలు చేపట్టారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ మూవీ రిలీజ్ డేట్ ను మేకర్స్ త్వరలోనే అనౌన్స్ చేస్తారు.

Full View
Tags:    

Similar News