అల్లు అర్జున్ - శిల్పా రవి.. నిహారిక ఏం చెప్పిందంటే..

ఏపీలో జరిగిన అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికలలో పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ అఖండ విజయాన్ని అందుకుంది.

Update: 2024-07-31 05:42 GMT

ఏపీలో జరిగిన అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికలలో పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ అఖండ విజయాన్ని అందుకుంది. 100 శాతం స్ట్రైక్ రేట్ తో పోటీ చేసిన అన్ని స్థానాలలో జనసేన పార్టీ గెలుపొందింది. ఇదిలా ఉంటే ఎన్నికల ప్రచారం చివరి రోజున అల్లు అర్జున్ నంద్యాలలో వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి శిల్ప రవిచంద్ర కిషోర్ రెడ్డిని గెలిపించాలని క్యాంపైన్ చేశారు. ఆ క్యాంపైన్ జనసేన అభిమానులకి, మెగా ఫ్యాన్స్ కి కోపం తెప్పించింది.

కావాలనే అల్లు అర్జున్ వైసీపీ అభ్యర్థి కోసం ప్రచారం చేశారనే విమర్శలు మొదలు పెట్టారు. ఈ వ్యవహారంపై సోషల్ మీడియాలో విపరీతమైన చర్చ నడిచింది. ఎన్నికల తర్వాత నాగబాబు పెట్టిన ఒక ట్వీట్ కూడా ఈ కాంట్రవర్సీని మరింత పైకి తీసుకెళ్లింది. ట్వీట్ చేసిన కొన్ని గంటల తర్వాత మరల దానిని డిలేట్ చేశారు. అయిన ఈ వివాదం మాత్రం ఆగలేదు.

మెగా ఫ్యాన్స్, బన్నీ ఆర్మీ మధ్య సోషల్ మీడియాలో ఫైట్ నడుస్తూనే ఉంది. అల్లు అర్జున్ వైసీపీ తరుపున క్యాంపైన్ చేయడంతో మెగా హీరోల మధ్య దూరం పెరిగిందనే ప్రచారం తెరపైకి వచ్చింది. దీనిని కొద్దిరోజుల క్రితం బన్నీ వాస్ ఖండించారు. ఇదిలా ఉంటే తాజాగా నాగబాబు కూతురు నిహారిక ఓ ఇంటర్వ్యూలో ఈ వివాదంపై రియాక్ట్ అయ్యింది. అల్లు అర్జున్ వేరేవారికి క్యాంపైన్ చేయడంపై కుటుంబంలో ఏమైనా డిజప్పాయింట్ ఉందా అని జర్నలిస్ట్ ప్రశ్నించారు.

కుటుంబంలో ఇలాంటి విషయాలు గురించి ఎక్కువగా మాట్లాడుకోమని నిహారిక తెలిపింది. అలాగే మా డాడీ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటారు. ఏవో ఒక పోస్టులు పెడుతూ ఉంటారు. అలాగే ఫ్యామిలీ వాట్సాప్ గ్రూప్ లో కూడా ప్రతి రోజు రకరకాల సూక్తులు పోస్ట్ చేస్తూ ఉంటారు. అలాగే ఆ రోజు ట్విట్టర్ ఆయన ఎందుకు అలా పోస్ట్ చేశారో అనేదానికి సరైన కారణాలు ఏంటనేది నాకు కూడా తెలియదు.

ఇంట్లో మాత్రం ఆ అంశం మీద ఎలాంటి డిస్కషన్స్ రాలేదు. అలాగే ఇంట్లో ఎవరైనా ఒక పని చేశారంటే దానికి వారికంటూ సొంతం రీజన్స్ ఉంటాయి. ఏ విషయాన్ని అయిన వ్యక్తం చేయడానికి అలాగే నచ్చిన పని చేయడానికి ఎవరి ఛాయస్ వారికుంటుంది. వాటిని జడ్జ్ చేసే రైట్స్ ఎవరికి ఉండవు అని నిహారిక ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది. ఆమె మాటల బట్టి మెగా ఫ్యామిలీలో ఎవరి నిర్ణయాలు వారికుంటాయని, అయితే వాటిని ఇంకొకరి మీద రుద్దే ప్రయత్నం ఉండదని స్పష్టం అవుతోంది. అలాగే ఆ విషయాల గురించి ఫ్యామిలీ గెట్ టు గెదర్ సమయాలలో అస్సలు చర్చించుకోరని కూడా తెలుస్తోంది.

Tags:    

Similar News