ఫోటో స్టోరి: మెగా ప్రిన్సెస్ శ‌క్తి స్వ‌రూపం

తాజాగా నిహారిక చిలుకాకుప‌చ్చ చీర‌లో ఎంతో అందంగా ముస్తాబై క‌నిపించిన ఫోటోషూట్ ఇంట‌ర్నెట్ లో వైర‌ల్ గా మారింది. దుర్గా దేవి ఆరవ స్వరూపమైన కాత్యాయని రూప‌మిద‌ని నిహారిక సూచించింది.

Update: 2023-10-20 16:20 GMT

మెగా బ్ర‌ద‌ర్ నాగేంద్ర బాబు కుమార్తె నిహారిక కొణిదెల వ‌రుస ఫోటోషూట్లు అంత‌ర్జాలంలో సెన్సేష‌న్ గా మారుతున్నాయి. నిహారిక బ్రేక‌ప్ అనంతర జీవితం స్వేచ్ఛ అభిమానుల్లో హాట్ టాపిక్ గా మారాయి. ఇంత‌లోనే నిహారిక తిరిగి న‌ట‌నలోకి ప్ర‌వేశిస్తున్నారని ప్ర‌చారం సాగుతోంది. దీనికి తోడు సోష‌ల్ మీడియాల్లో నిరంత‌ర ఫోటోషూట్ల‌తో డైన‌మిక్ లేడీ త‌న‌ అభిమానుల‌ను ఆశ్చ‌ర్య‌ప‌రుస్తున్నారు. యువ‌న‌టి నిహారిక‌ అసాధారణమైన ఎంపికలు, స్వేచ్ఛా జీవ‌నం ఆశ్చర్యపరుస్తోంది.


అయితే ఈ గ్లిట్జ్ అండ్ గ్లామ్ న‌డుమ‌ అభిమానులను ఆశ్చర్యపరిచిన ఒక ప్ర‌త్యేక‌ విష‌యం ఉంది. అదే నిహారిక ఇటీవలి ఆధ్యాత్మిక ప్రయాణం. మెగా ప్రిన్సెస్ ఇటీవ‌ల ఆలయాల‌ సందర్శనలు, పూజా కార్యక్రమాలు.. భక్తి ప్రపత్తులతో క‌నిపిస్తున్నారు. నిహారిక షేర్ చేసిన ఇటీవ‌లి ఫోటోలలో పరివర్తన స్పష్టంగా కనిపిస్తుంది. ఈ ఫోటోల్లో దేవతలను భక్తితో పూజిస్తూ ప్ర‌త్యేకంగా క‌నిపిస్తోంది. యువ‌న‌టి మునుపటి జీవనశైలి ఎంపికలతో పోలిస్తే ఈ ప్రధాన మార్పు.. ఆధ్యాత్మిక కార్యకలాపాల వెనుక గల కారణాల గురించి చాలా మంది అభిమానుల్లో ఆసక్తిక‌ర చ‌ర్చ సాగుతోంది.

పెళ్లి బ్రేక‌ప్ త‌ర్వాత‌ నిహారిక సాహసోపేతమైన స్ఫూర్తితో జీవితాన్ని స్వీకరించింది. ఒంటరిగా విదేశాలకు వెళ్లింది. సోషల్ మీడియాలో షేర్ చేసిన ఫోటోలను ప‌రిశోధిస్తే త‌న డేరింగ్ డెసిష‌న్స్ ఉత్సుకతను రేకెత్తించాయి. నిహారిక ఇటీవల తన ఉత్తమ జీవితాన్ని లీడ్ చేయ‌డం మాత్రమే కాదు.. ఈ ప్రపంచానికి దానిని ప్ర‌ద‌ర్శించేందుకు వెన‌కాడ‌డం లేదు. రెస్టారెంట్లలో తీరికగా బ్రంచ్‌లు.. స్వెట్ తో తడిసిన జిమ్ సెషన్‌ల నుండి లైవ్లీ బీచ్ ఔటింగ్‌ల వరకు నిహారిక ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్‌లు యువ‌త‌రంలో వైరల్ అయ్యాయి.

ముఖ్యంగా నిహారిక ఆధ్యాత్మిక ట‌ర్న్ ఊహించ‌నిది. ఇప్పుడు న‌వ‌రాత్రుల సీజ‌న్. అందుకే ఇటీవ‌ల శక్తికి ప్ర‌తిరూప‌మైన‌ ఎరుపు రంగు చీరలో చంద్రఘంటా దేవిని పూజిస్తూ నిహారిక‌ తన భక్తిని చాటుకుంది. నిహారిక ఈ ఫోటోలను సోష‌ల్ మీడియాల్లో షేర్ చేయ‌గా.. దేవతా సుంద‌రి రూపం, ఆ ధైర్యసాహసాలకు అభిమానులు మురిసిపోయారు. నిహారిక‌లోని ప‌రివ‌ర్త‌న మ‌రోసారి చ‌ర్చ‌కు తెర తీసింది.

తాజాగా నిహారిక చిలుకాకుప‌చ్చ చీర‌లో ఎంతో అందంగా ముస్తాబై క‌నిపించిన ఫోటోషూట్ ఇంట‌ర్నెట్ లో వైర‌ల్ గా మారింది. దుర్గా దేవి ఆరవ స్వరూపమైన కాత్యాయని రూప‌మిద‌ని నిహారిక సూచించింది. ఆకుపచ్చ రంగు ధైర్యం - విజయాన్ని సూచిస్తుంది.. అని ఇన్ స్టాలో ఈ ఫోటోకి వ్యాఖ్య‌ను జోడించింది. మొత్తానికి నిహారిక ర‌కర‌కాల చీర‌ల్లో వ‌రుస ఫోటోషూట్ల‌తో న‌వ‌రాత్రుల వేళ‌ శ‌క్తి స్వ‌రూపాల‌ను ప్ర‌ద‌ర్శిస్తోంది. అందుకు సంబంధించిన ఫోటోషూట్లు అంత‌ర్జాలంలో వైర‌ల్ గా మారుతున్నాయి.

కెరీర్ వ‌ర్సెస్ వ్య‌క్తిగ‌త జీవితం:

నిహారిక క్రియేటివ్ థాట్స్ అభిమానుల్లో ఉత్సుక‌త‌ను పెంచుతున్నాయి. ఆమె కెరీర్, వ్యక్తిగత జీవితం గురించి సోష‌ల్ మీడియాల్లో డిబేట్లు పెడుతున్నారు. త‌న‌ రెండవ వివాహం గురించి ఊహాగానాలు సాగుతున్న సంగ‌తి తెలిసిందే. వీట‌న్నిటికీ స‌మాధానంగా ప‌లుమార్లు నిహారిక‌ సోషల్ మీడియాల్లో త‌న భ‌విష్య‌త్ ప్ర‌యాణం గురించి హింట్లు ఇస్తూనే ఉన్నారు. ఎప్పటికప్పుడు మారుతున్న తన లుక్స్ తో తన ఫాలోవర్స్ ని అబ్బురపరుస్తోంది. నిహారిక తన శక్తిని ప్ర‌ద‌ర్శించాల‌ని నిర్ణ‌యించుకున్నార‌ని కొంద‌రు నెటిజ‌నులు కామెంట్లు చేసారు. నిహారిక పూర్తిగా తన కెరీర్‌పై దృష్టి పెడుతుందని సూచిస్తున్నారు.

నిహారిక కొణిదెల కూడా న‌ట‌ వృత్తిలో రాణించాల‌ని ప‌ట్టుద‌ల‌గా ఉన్న‌ట్టు అర్థ‌మ‌వుతోంది. ఇటీవలే డెడ్ పిక్సెల్స్ అనే వెబ్ సిరీస్‌లో ప్రధాన పాత్రలో నటించింది. ఇది ఇప్పుడు డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ OTT ప్లాట్‌ఫారమ్‌లో ప్రసారం అవుతోంది. త‌దుప‌రి పెద్ద తెర‌పైనా న‌టించేందుకు స‌న్నాహ‌కాల్లో ఉన్న‌ట్టు తెలిసింది.


Tags:    

Similar News