మూఢనమ్మకాలే స్టార్ హీరోని ముంచాయా?
తాము మొదటిసారి కలుసుకున్నప్పుడు గోవింద తన ప్రదర్శనతో అంతగా ఆకట్టుకోలేదు. మరుసటి రోజు ఒక అద్భుతమైన డ్యాన్సర్ అని చెప్పుకుంటూ గోవిందా షోరీల్‌తో తిరిగి వచ్చాడు.
90లతో పోలిస్తే ఇప్పుడు మూఢనమ్మకాలు అంత ఎక్కువ కాదు. కానీ పూర్తిగా సమసిపోలేదు. అయితే 80లు 90లలో అగ్ర కథానాయకుడిగా ఏలిన ప్రముఖ హీరో మూఢనమ్మకాల కారణంగా తన కెరీర్ ని నాశనం చేసుకున్నాడని ప్రముఖ నిర్మాత వ్యాఖ్యానించారు. ఈ ఎపిసోడ్ లో స్టార్ హీరో గోవిందా అయితే, నిర్మాత ప్రహ్లాజ్ నిహలానీ.
1990లలో గోవిందాతో కలిసి పనిచేసిన ప్రముఖ నిర్మాత పహ్లాజ్ నిహలానీ తమ మధ్య ఉన్న రిలేషన్ గురించి న్యూస్ 18 వెబ్ పోర్టల్‌తో చర్చించారు. తాము ఎందుకు సన్నిహిత మిత్రులు కాలేకపోయారో వివరించారు. నిహ్లానీ గోవిందా మూఢనమ్మకాల గురించి ప్రస్తావించారు. గోవిందా అనూహ్యమైన, పేలవమైన కెరీర్ నిర్ణయాల గురించి ప్రస్థావిస్తూ కాలక్రమంలో అతడిలో మూఢనమ్మకాలు ఘోరంగా పెరిగాయని మాట్లాడాడు. ఇది గోవిందాకు గొప్ప ఫాలోయింగ్ ఆదరణ ఉన్న సమయంలోనూ ప్రమాదకరంగా మారిందని అన్నారు.
గోవిందా నటనా ప్రతిభ, కుటుంబ నిబద్ధతను కొనియాడుతూనే అతడి కెరీర్ సవాళ్లలో ఈ అంశాలు ముఖ్య పాత్ర పోషించాయని నిహ్లానీ అన్నారు. గోవిందాలో క్రమంగా మూఢనమ్మకాలు ఎక్కువ అయ్యాయి. అతడు ఎప్పుడూ కొంచెం మోసపూరితంగా ఉండేవాడు. సెట్‌లో షాన్డిలియర్ పడబోతోందని.. అందరినీ పక్కకు వెళ్లమని కంగారు పెట్టారు ఓసారి. అప్పుడు అతడు ఖాదర్ ఖాన్ మునిగిపోతాడని అంచనా వేసాడు. తన మూఢనమ్మకాల ఆధారంగా బట్టలు మార్చుకోమని సెట్లో వారికి సూచించేవాడు. అతడు కొన్ని రోజుల(సెంటిమెంట్ వారం వర్జ్యం)లో కొన్ని పనులు చేయడానికి నిరాకరిస్తాడు. అతడి వల్ల కొన్ని పనులు ఆలస్యమయ్యేవి. దీనికి తోడు మోసపూరిత వ్యక్తిత్వం కూడా అతడి పతనానికి దారితీసింది! అని నిహ్లానీ అన్నారు.
తాము మొదటిసారి కలుసుకున్నప్పుడు గోవింద తన ప్రదర్శనతో అంతగా ఆకట్టుకోలేదు. మరుసటి రోజు ఒక అద్భుతమైన డ్యాన్సర్ అని చెప్పుకుంటూ గోవిందా షోరీల్‌తో తిరిగి వచ్చాడు. అయితే తాము ఎప్పుడూ స్నేహితులం కాలేదని నిహ్లానీ తెలిపారు. మాకు కనెక్షన్ ఉంది.. కానీ అతనితో పని చేయడం ఎల్లప్పుడూ అనిశ్చితి. అతడు రెండవ ఆలోచన లేకుండా డజన్ల కొద్దీ బి-గ్రేడ్ , సి-గ్రేడ్ సినిమాలకు సైన్ చేసేవాడు. అతడు ఒకే సమయంలో ఐదు లేదా ఆరు సినిమాలకు పని చేస్తాడు. అతడు ఎక్కడ ఉన్నాడో ఎవరికీ తెలియదు. అతడు నిరంతరం ఆలస్యంగా వచ్చేవాడు. అబద్ధం చెప్పేవాడు.. అని కూడా ప్రహ్లాజ్ నిహలానీ తెలిపారు. ''డబ్బు కోసమే ఇలా చేస్తున్నావని.. ఇది ప్రమాదకరమైన ఆలోచన అని చెప్పాను'' అని నిహలానీ గుర్తు చేసుకున్నారు.
తాము ఎప్పుడూ స్నేహితులు కాలేదని నిహ్లానీ స్పష్టం చేశారు. కెరీర్ సవాళ్లను ఎదుర్కొన్నప్పుడు మాత్రమే గోవింద తనను సంప్రదిస్తారు.. విజయవంతమైన సమయాల్లో కాదు. ఈ పరిశ్రమ నమ్మకంతో పనిచేస్తుంది. నమ్మకం విచ్ఛిన్నమైనప్పుడు ముందుకు సాగలేం. నమ్మకం ఉంటేనే నటుడు- నిర్మాత మధ్య సంబంధం కొనసాగుతుంది. అతడు ఎవరితోనూ సంబంధాలు కొనసాగించలేదు! అని నిహలానీ చెప్పారు.