యుద్ధ వీరుడి లుక్ కోసం 8 నెలల పాటూ అన్నీ మానేశా: నిఖిల్
కార్తికేయ2 సినిమాతో పాన్ ఇండియా లెవెల్ లో సూపర్ క్రేజ్ అందుకుని తన మార్కెట్ ను పెంచుకున్నాడు టాలీవుడ్ యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో నిఖిల్
కార్తికేయ2 సినిమాతో పాన్ ఇండియా లెవెల్ లో సూపర్ క్రేజ్ అందుకుని తన మార్కెట్ ను పెంచుకున్నాడు టాలీవుడ్ యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో నిఖిల్. కానీ కార్తికేయ2 తర్వాత అతన్నుంచి వచ్చిన స్పై, 18 పేజెస్ సినిమాలు ఆడియన్స్ ను ఆకట్టుకోలేకపోయాయి. దీంతో ఇప్పుడు నిఖిల్ మరో పాన్ ఇండియా సినిమాకు రెడీ అవుతున్నాడు.
భరత్ కృష్ణమాచారి దర్శకత్వంలో రూపొందనున్న స్వయంభు ఓ హిస్టారికల్ కథతో తెరకెక్కుతుంది. స్వయంభులో నిఖిల్ శత్రువులను చీల్చి చెండాడే యుద్ధ వీరుడిగా కనిపించనున్నాడు. ఈ పాత్ర కోసం నిఖిల్ స్పెషల్ ట్రైనింగ్ తీసుకుంటూ తనను తాను మేకోవర్ చేసుకుంటున్నాడు. ఈ సినిమా కోసమే తాను 45 రోజుల పాటూ గుర్రపు స్వామీ, ఆర్చరీ, మార్షల్ ఆర్ట్స్ తదితర విద్యల్లో కఠిన శిక్షణ తీసుకున్నట్టు రీసెంట్ గా ఓ ఇంటర్వ్యూలో తెలిపాడు.
స్వయంభు కోసం తన లుక్ ను మార్చుకోవడానికి ఎంతో కష్టపడినట్టు నిఖిల్ ఆ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు. దాని కోసం ఎనిమిది నెలల పాటూ ఎంతో కఠినమైన ఆహార నియమాలు పాటించానని, మద్యం పూర్తిగా మానేసి, రైస్, షుగర్ లేకుండా అవకాడో, దానిమ్మ, ప్రొటీన్ ఫుడ్ మాత్రమే తిన్నట్టు తీసుకున్నట్టు నిఖిల్ తెలిపాడు.
చూడగానే యుద్ధ వీరుడిగా కనిపించాలని ప్రయత్నించానని, కాకపతే దానికి చాలా ఎక్కువ టైమ్ పట్టిందని నిఖిల్ చెప్పాడు. వియత్నాంలో గుర్రపు స్వారీ, మార్షల్ ఆర్ట్స్, ఆర్చరీతో పాటూ పలు విద్యల్లో శిక్షణ తీసుకున్నానని, ఆర్ఆర్ఆర్ లో ఎన్టీఆర్, చరణ్‌కు స్టంట్ మాస్టర్ గా చేసిన కింగ్ సోలోమాన్ వద్ద 45 రోజుల పాటూ ట్రైనింగ్ తీసుకున్నానని, ఆయన నుంచి రోజుకో కొత్త విషయాన్ని నేర్చుకున్నట్టు నిఖిల్ పేర్కొన్నాడు.
సోషియో ఫాంటసీ సినిమాగా రూపొందుతున్న ఈ సినిమాను ఠాగూర్ మధు సమర్పణలో శ్రీకర్ భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమాకు రూ.60 కోట్లు వరకు ఖర్చు పెట్టారని తెలుస్తోంది. నిఖిల్ కెరీర్లోనే ఇది ఖరీదైన సినిమాగా చెప్తున్నారు. ఈ సినిమాతో పాటూ నిఖిల్ సుధీర్ వర్మతో ఓ సినిమా, రామ్ చరణ్ సమర్పణలో యువి క్రియేషన్స్ లో ది ఇండియా హౌస్ అనే సినిమాలను చేస్తున్నాడు. ఇవి కాకుండా కార్తికేయ3 కూడా లైన్ లోనే ఉంది.