అప్పుడు హీరోయిన్ ఇప్పుడు అతిధిగానా?

కొంత కాలంగా నిత్యామీనన్ కెరీర న‌త్త‌న‌డ‌క‌న సాగుతోన్న సంగ‌తి తెలిసిందే. సినిమా ఛాన్సులు త‌గ్గ‌డంతో టీవీషోల‌తో బిజీ అయింది

Update: 2024-06-13 12:30 GMT

కొంత కాలంగా నిత్యామీనన్ కెరీర న‌త్త‌న‌డ‌క‌న సాగుతోన్న సంగ‌తి తెలిసిందే. సినిమా ఛాన్సులు త‌గ్గ‌డంతో టీవీషోల‌తో బిజీ అయింది. అయినా సినిమాలు వ‌ద‌ల్లేదు. వచ్చిన అవ‌కాశాల్ని స‌ద్వినియోగం చేసుకుం టుంది. అయితే గ‌త ఏడాది కేవ‌లం ఒక్క సినిమాకే ప‌రిమిత‌మైంది. అది మ‌ల‌యాళంలో న‌టించిన చిత్రం. త‌మిళ్ , తెలుగులో ఒక్క సినిమా కూడా చేయ‌లేదు. అయితే 2024 లో మాత్రం మ‌ళ్లీ యాక్టివ్ అయిన‌ట్లు క‌నిపిస్తుంది.

అమ్మ‌డు జ‌యం ర‌వి స‌ర‌స‌న కోలీవుడ్ లో ఓ సినిమా చేస్తుంది. అలాగే `డియర్ ఎక్సెస్` అనే మ‌రో సినిమాలో కూడా న‌టిస్తుంది. కానీ ఇంత‌వ‌ర‌కూ తెలుగు సినిమాకి మాత్రం సైన్ చేయ‌లేదు. ఈ నేప‌థ్యంలో తాజాగా ఓ ఇంట్రెస్టింగ్ అప్ డేట్ అందుతోంది. యూత్ స్టార్ నితిన్ హీరోగా న‌టిస్తోన్న `త‌మ్ముడు` చిత్రం లో గెస్ట్ రోల్ కి సైన్ చేసింద‌ని స‌మాచారం. ఇటీవ‌లే ద‌ర్శ‌కుడు వేణు శ్రీరామ్ ఆమెకి పాత్ర గురించి వివ‌రించి ఒప్పించిన‌ట్లు లీకులందుతున్నాయి.

మ‌రి ఇందులో నిజ‌మెంతో తెలియాల్సి ఉంది. గ‌తంలో నితిన్ తో అమ్మ‌డు రెండు సినిమాల్లో హీరోయిన్ గా న‌టించిన సంగతి తెలిసిందే. తొలిసారి విక్ర‌మ్ .కె కుమార్ తెర‌కెక్కించిన `ఇష్క్` తో జోడీ క‌ట్టారు. ఆ సినిమా మంచి విజ‌యం సాధించింది. ఆ సినిమాతో ఈ జోడీకి రొమాంటిక్ పెయిర్ గా మంచి గుర్తింపు ద‌క్కింది. ఆ క్రేజ్ తోనే మ‌రోసారి `గుండెజారి గ‌ల్లంత‌య్యిందే` సినిమాతో మ‌ళ్లీ తెర‌ను పంచుకున్నారు.

ఆ సినిమా కూడా మంచి విజయం సాధించింది. అప్ప‌టి నుంచి హిట్ పెయిర్ గా మార్కెట్ లో ముద్ర ప‌డిపోయింది. దీంతో ఇదే క‌ల‌యిక‌లో హ్యాట్రిక్ ప్లాన్ చేసే అవ‌కాశాలున్న‌ట్లు ప్ర‌చారంలో ఉంది. కానీ నిత్య మీన‌న్ క్రేజ్ త‌గ్గ‌డంతో అమ్మ‌డికిప్పుడు ఆ ఛాన్స్ లేదు. నితిన్ కూడా స‌క్సెస్ కోసం ఎదురు చూస్తోన్న స‌మ‌యం. స‌రైన హిట్ పడి చాలా కాల‌మ‌వుతోంది. ఈ నేప‌థ్యంలో మళ్లీ ఛాన్స్ తీసుకోవ‌డం క‌ష్ట‌మే. మ‌రి `త‌మ్ముడు` లో నిత్య గెస్ట్ రోల్ ఎంత వ‌ర‌కూ నిజ‌మో ఖారారు అవ్వాలి.

Tags:    

Similar News