ఏంటమ్మా హానీ.. రోజు షాప్ ఓపెనింగ్సేనా?

తాజాగా కూడా ఓ షాపింగ్ మాల్ ఓపెనింగ్ లోనూ ఆమె సందడి చేశారు. రెడ్ కలర్ శారీలో ఎర్రమందారంలా మెరిసిపోయింది.

Update: 2023-08-11 00:30 GMT

హనీ రోజ్ ఈ పేరు అంతక ముందుఎవరికీ తెలియకపోవచ్చు. కానీ ఇటీవల బాలయ్య వీర సింహారెడ్డిలో నటించిన తర్వాత ఫుల్ క్రేజ్ తెచ్చుకుంది. ఈ వీర సింహారెడ్డి మూవీకి ముందు చాలా సినిమాలే చేసింది. కానీ, పాపం ఏదీ మంచి హిట్ ఇవ్వలేకపోయాయి. చూడగానే ఆకట్టుకునే అందం ఉన్నా, స్టార్ హీరోయిన్ క్వాలిటీలు ఉన్నా ఆ స్టానాన్ని చేరుకోలేకపోయింది.

మళయాళం మూవీ మాన్ స్టర్ మూవీ తెలుగులో రీమేక్ అయినప్పుడు అందరూ ఆమె అందానికి ఫిదా అయ్యారు. ఆ తర్వాత వీర సింహారెడ్డిలో చూసిన తర్వాత ఇంతకాలం ఈ అందాన్ని ఎలా మిస్ అయ్యాం అని అందరూ అనుకున్నారు. సీనియర్ హీరోలకు మంచి హీరోయిన్ ఆప్షన్ అవుతుంది అని అందరూ అనుకున్నారు. ఆ మూవీ కూడా మంచి హిట్ అయ్యింది. దీంతో, హనీకి ఆఫర్లు క్యూలు కడతాయి అని అందరూ అనుకున్నారు.

కానీ, ఇప్పటివరకు ఆమెకు మళ్లీ ఒక్క ఆఫర్ కూడా రాలేదు. అయితే, ఆమెకు షాపింగ్ మాల్స్ ఓపెనింగ్ ఆఫర్లు మాత్రం విపరీతంగా వస్తున్నాయి. తాజాగా కూడా ఓ షాపింగ్ మాల్ ఓపెనింగ్ లోనూ ఆమె సందడి చేశారు. రెడ్ కలర్ శారీలో ఎర్రమందారంలా మెరిసిపోయింది. ప్రకాశం జిల్లా మార్కాపురంలోని లక్కీ షాపింగ్ మాల్ ని ఆమె ఓపెన్ చేయగా, దానికి సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారాయి.

తెలుగు ప్రజలు తనపై చాలా అభిమానం చూపిస్తున్నారని, అది తనకు చాలా ఆనందాన్ని కలిగిస్తోందని ఆమె చెప్పారు. అనంతరం ఆ షాపింగ్ మాల్ లోని కొన్ని చీరలను తనపై పెట్టుకొని ఆమె ఫోటోలకు ఫోజులు ఇచ్చారు. ఆమెను చూడటానికి చాలా మంది అక్కడకు రావడం విశేషం.

ఇదిలా ఉండగా, నిజానికి హనీ చాలా మంచి నటి. ఆమె ఎలాంటి పాత్రలనైనా సులభంగా చేయగలదు. మాన్ స్టర్ మూవీనే అందుకు నిదర్శనం. మంచు లక్ష్మితో కలిసి రొమాన్స్ కూడా చేసింది. అలాంటి ఆమెకు మన దర్శక నిర్మాతలు మాత్రం సరైన ఆఫర్లు ఇవ్వడం లేదు. మరి, భవిష్యత్తులో అయినా ఆమెకు మంచి ఆఫర్లు వస్తాయేమో చూడాలి.

Tags:    

Similar News