టెంపర్ బ్యూటీ మరణ వార్తలు.. అసలు మ్యాటర్ ఇదే!
నోరా ఫతేహి గురించి తెలుసుకునేందుకు చాలా మంది ఆమెను సోషల్ మీడియా ద్వారా పలకరించారు.
పుట్టిన రోజు వేడుకల్లో భాగంగా బంగీ జంపింగ్ చేసేందుకు ప్రయత్నించిన నోరా ఫతేహి ప్రమాదవశాత్తు మరణించింది అంటూ సోషల్ మీడియాలో పుకార్లు వచ్చాయి. అందుకు సంబంధించిన ఒక వీడియో సైతం సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. అడవిలో చేసిన ఆ జంపింగ్ సమయంలో ప్రమాదం జరిగి మహిళ కింద పడ్డట్టుగా వీడియోలో ఉంది. ఆ వీడియోలో ఉన్న వ్యక్తి నోరా ఫతేహి అన్నట్లు అనిపిస్తుంది. దాంతో ఆమె ఫ్యాన్స్‌తో పాటు నెటిజన్స్ అంతా షాక్ అయ్యారు. నోరా ఫతేహి గురించి తెలుసుకునేందుకు చాలా మంది ఆమెను సోషల్ మీడియా ద్వారా పలకరించారు.
ప్రమాదం జరిగినట్లు చూపించిన వీడియో మార్ఫింగ్ అయ్యి ఉంటుందని మొదటి నుంచి కొందరు అంటున్నా, అలా చేయాల్సిన అవసరం ఎవరికి ఉందని కొందరు ఆందోళన వ్యక్తం చేశారు. మొత్తంగా ఎన్టీఆర్ టెంపర్ సినిమాలో ఐటెం సాంగ్ చేసి తెలుగు ప్రేక్షకులకు సైతం సుపరిచితురాలైన బాలీవుడ్ బ్యూటీ నోరా ఫతేహి చనిపోయిందనే వార్తలు ప్రముఖంగా వచ్చాయి. కొన్ని గంటల్లోనే వార్తలు దావానంలా వ్యాప్తి చెందడంతో వెంటనే ఆమె టీం స్పందించింది. సోషల్ మీడియాలో వస్తున్న వార్తలను నమ్మవద్దు అంటూ వారు పేర్కొన్నారు. ఆ వీడియోలో ఉన్నది నోరా కాదని వారు క్లారిటీ ఇచ్చారు.
ప్రస్తుతం నోరా ఫతేహీ తన పుట్టిన రోజు వేడుకలను జరుపుకుంటుంది. సోషల్ మీడియా ద్వారా తన పుట్టిన రోజుకు సంబంధించిన ఫోటోలను వీడియోలను షేర్ చేస్తూ వచ్చింది. దాంతో సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం నిజం కాదని మరోసారి క్లారిటీ వచ్చింది. కొందరు కావాలని ఆ వీడియోను మార్ఫింగ్ చేశారని, అలాంటి పనులు చేయడం ద్వారా సెలబ్రెటీల అటెన్షన్ దక్కించుకోవచ్చు అని భావిస్తున్నారేమో. కానీ పుకార్లను వ్యాప్తి చెందించడం ద్వారా సదరు సెలబ్రెటీ ఫ్యాన్స్, సన్నిహితులు ఎంతో ఆందోళనకు గురి అవుతారనే విషయాన్ని గుర్తించాల్సిన అవసరం ఉంది.
కెనడాలోని టొరంటోలో పుట్టిన నోరా ఫతేహి బాలీవుడ్‌లో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చి సక్సెస్‌లను దక్కించుకుంది. మొరాకో సంతతికి చెందిన ఫ్యామిలీలో పుట్టిన నోరా ఫతేహి యార్క్ విశ్వవిద్యాలయంలో రాజకీయ శాస్త్రంలో అంతర్జాతీయ సంబంధాలను అభ్యసించి గ్రాడ్యుయేషన్ దక్కించుకుంది. బాలీవుడ్‌లో సినిమాలతో అలరించిన నోరా చాలా సార్లు తాను భారతీయురాలిని అనే భావన కలుగుతుందని చెప్పుకొచ్చింది. బిగ్ బాస్ 9లో పాల్గొనడం ద్వారా పాపులారిటీని సొంతం చేసుకుంది. ప్రస్తుతం కాంచన 4 సినిమాతో పాటు మరో రెండు మూడు సినిమాల్లో నటిస్తోంది. తెలుగు ప్రేక్షకులకు ఐటెం సాంగ్స్‌తో చేరువ అయిన నోరా ఫతేహీ టాలీవుడ్‌లో ముందు ముందు మరిన్ని సినిమాల్లో నటించాలని కోరుకుంటున్నట్లు చెప్పుకొచ్చింది.