మ‌నోహ‌రి ఫిట్నెస్ సీక్రెట్ ఇదా?

అయితే నోరా ప‌టేహీకి మాత్రం ఇలాంటి ప్ర‌ణాళిక‌లేవి లేవు. రెగ్యుల‌ర్ గా జిమ్ చేయ‌దు.

Update: 2024-04-30 16:30 GMT

బాలీవుడ్ హీరోయిన్ల ఫిట్ నెస్ ప్రీక్ గురించి చెప్పాల్సిన ప‌నిలేదు. బ్యూటీ విష‌యంలో ఏ ఒక్క‌రూ త‌గ్గేదేలే. అందాల‌న్నీ ఫిట్ నెస్ కోసం పోటాపోటీగా జిమ్ముల్లో క‌స‌ర‌త్తులు చేస్తుంటారు. వాళ్ల డేనే జిమ్ముతో మొద‌ల‌వుతుంది. అది ముగించిన వెంట‌నే ప‌నిలో ప‌డ‌తారు త‌ప్ప‌! జిమ్..యోగా...ధ్యానం వంటి సెష‌న్స్ లేకుండా వాళ్ల డే మొద‌లు కాదు. డైట్ విష‌యంలోనూ అంతే కేర్ పుల్ గా ఉంటారు. డైటీష‌న్లు..న్యూట్రీష‌న్లు చెప్పిన‌ట్లే పుడ్ తీసుకుంటారు. ఇలా ఓ ప్ర‌ణాళిక ప్ర‌కారం బాలీవుడ్ హీరోయిన్ల ఫిట్ నెస్ కి అవ‌స‌ర‌మైన చ‌ర్య‌లు తీసుకుంటారు.


అయితే నోరా ప‌టేహీకి మాత్రం ఇలాంటి ప్ర‌ణాళిక‌లేవి లేవు. రెగ్యుల‌ర్ గా జిమ్ చేయ‌దు. రోజూ ఉదాయానే లేవాల‌నే కండీష‌న్ త‌న డైరీ లో లేదు. న‌చ్చిన‌ప్పుడు లేస్తుంది. ఇష్ట‌మైతే జిమ్ కి వెళ్తుంది. లేకుంటే లేదు. డైట్ మెయింటనెన్స్ కూడా మ‌రీ ష్యూర్ గా ఉండ‌దు. అవును ఈ విష‌యాల‌న్నీ నోరా స్వ‌యంగా రివీల్ చేసింది. గ్లోబ‌ల్ స్పా క‌వ‌ర్ పేజీ పై భంగిమ‌లు ఒల‌క‌బోసిన అమ్మ‌డు ఈ సెషన్ లో నే ఈ విష‌యాల‌న్నింటిపై స్పందించింది. అంద‌రిలో జిమ్ము చేయ‌న‌ని..కేవ‌లం డాన్సు ద్వారానే ఇంత ఫిట్ గా ఉంటున్న‌ట్లు వెల్ల‌డించింది.

జిమ్ కి వెళ్లినా ఇంత ఫిట్ గా ఉంటానో ? లేదో తెలియ‌దు. కానీ డాన్స్ చేస్తే మాత్రం క‌చ్చితంగా ఉంటాను అని చెప్ప‌గ‌ల‌ను. ఇదే నా బ్యూటీ సీక్రెట్ అంటూ గుట్టు విప్పేసింది. ఇక నోరా ప‌టేహీ ఎంత గొప్ప డాన్స‌ర్ అన్న‌ది చెప్పాల్సిన ప‌నిలేదు. బాలీవుడ్ ఐటం భామ‌ల్లోనే ఆమె డాన్స్ కి మంచి ఫాలోయింగ్ ఉంది. శ‌రీరాన్ని విల్లులా వంచి డాన్సు చేయ‌గ‌ల బ్యూటీ. ఇన్ స్టా పిక్ ప‌రిశీలిస్తే నోరా అందానికి కొల‌మానం ఎక్క‌డు? క్రీమ్ క‌ల‌ర్ ప్లోర‌ల్ డిజైన్ లో జివ్వు మ‌నిపిస్తుంది. అమ్మ‌డి అలంక‌ర‌ణ ప్ర‌తీది మ‌రింత అందంగా తీర్చి దిద్దాయి. ప్ర‌స్తుతం ఈ ఫోటో నెట్టింట వైర‌ల్ గా మారింది.

నోరా మ‌నోహ‌రి పాట‌తో తెలుగింట ఎంత ఫేమ‌స్ అయిందో తెలిసిందే. అంత‌కుముందు `టెంప‌ర్` చిత్రంలోనూ ఆడిపాడింది. `షేర్`..`ఊపిరి` లాంటి చిత్రాల్లో నూ కుర్రాళ్ల‌ను అల‌రిచింది. ప్ర‌స్తుతం వ‌రుణ్ తేజ్ `మ‌ట్కా`లోనూ న‌టిస్తోంది. ఇక బాలీవుడ్ లో అయితే బిజీగా మూడు నాలుగు సినిమాలు చేస్తోంది.

Tags:    

Similar News