ఎన్టీఆర్ బాక్సాఫీస్.. లెక్క ఇలానే స్టార్ట్ అవ్వాలి

అలాగే దేవర చిత్రం మొదటి రోజు 100 కోట్లకి పైగా కలెక్షన్స్ ని అందుకోవడం గ్యారెంటీ అని ట్రెండ్ పండితులు అంటున్నారు.

Update: 2024-09-09 04:11 GMT

యంగ్ టైగర్ ఎన్టీఆర్ సెప్టెంబర్ 27న దేవర చిత్రంతో ప్రేక్షకుల ముందుకి రాబోతున్నారు. కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి. ఇప్పటికే సినిమాపై బిజినెస్ డీల్స్ కూడా క్లోజ్ అయిపోయాయి. దేవర మూవీ ట్రైలర్ ని ముంబైలో లాంచ్ చేయబోతున్నారు. ఈ విషయాన్ని అధికారికంగా ధ్రువీకరించారు. ఎన్టీఆర్, జాన్వీ కపూర్, సైఫ్ అలీఖాన్ తో పాటు మొత్తం క్రూ అందరూ ఈ ట్రైలర్ రిలీజ్ ఈవెంట్ లో పాల్గొనబోతున్నారు.

ఇదిలా ఉంటే ఈ సినిమాకి సంబందించిన అడ్వాన్స్ బుకింగ్స్ ని యూఎస్ లో ఇప్పటికే ఓపెన్ చేసారంట. అడ్వాన్స్ బుకింగ్స్ ద్వారా టికెట్స్ రికార్డ్ స్థాయిలో బుకింగ్స్ జరుగుతున్నాయనే టాక్ వినిపిస్తోంది. ట్రైలర్ రిలీజ్ తర్వాత మూవీపైన అంచనాలు మరింత పెరిగే ఛాన్స్ ఉంది. అదే జరిగితే బుకింగ్స్ పరంగా ఇంకా జోరు చూపించొచ్చని భావిస్తున్నారు. అలాగే దేవర చిత్రం మొదటి రోజు 100 కోట్లకి పైగా కలెక్షన్స్ ని అందుకోవడం గ్యారెంటీ అని ట్రెండ్ పండితులు అంటున్నారు.

ప్రభాస్ తర్వాత మొదటి రోజు 100 కోట్ల కలెక్షన్స్ అందుకునే హీరోగా దేవర చిత్రంతో జూనియర్ ఎన్టీఆర్ మారబోతున్నారని నమ్ముతున్నారు. ఒక వేళ ట్రేడ్ వర్గాల అంచనాలు ప్రకారం తారక్ మొదటి రోజు 100 కోట్లకి పైగా కలెక్షన్స్ ని వరల్డ్ వైడ్ గా అందుకుంటే కచ్చితంగా అది రికార్డ్ అవుతుంది. ఇది కచ్చితంగా సాధ్యం అవుతుందని యంగ్ టైగర్ అభిమానులు కూడా నమ్ముతున్నారు.

సినిమా మీద ఉన్న ఎక్స్ పెక్టేషన్స్, అనిరుద్ రవిచందర్ బ్రాండ్, సైఫ్ అలీఖాన్, జాన్వీ కపూర్ లాంటి స్టార్ క్యాస్టింగ్ ఈ సినిమా కలెక్షన్స్ పై హెవీగా ఇంపాక్ట్ చూపిస్తాయని భావిస్తున్నారు. 100-150 కోట్ల మధ్యలో దేవర మొదటి రోజు కలెక్షన్స్ ఉంటాయని అంచనా వేస్తున్నారు. సెప్టెంబర్ 27 కోసం ఫ్యాన్స్ తో పాటు తెలుగు సినీ అభిమానులు కూడా ఎదురుచూస్తున్నారు. ఆర్ఆర్ఆర్ తర్వాత తారక్ నుంచి వస్తోన్న మొదటి పాన్ ఇండియా మూవీ కావడంతో అంచనాలు ఎక్కువగా ఉన్నాయి.

మొదటి రోజు కలెక్షన్స్ మాత్రమే కాకుండా ఓవరాల్ గా కూడా ఈ సినిమా ఎన్ని వందల కోట్లు వసూళ్లు చేస్తుందనే దానిపై యంగ్ టైగర్ ఎన్టీఆర్ మార్కెట్ కూడా ఆధారపడి ఉంటుంది. సోలోగా 400 కోట్ల వరకు తారక్ కి మార్కెట్ ఉందని బయట వినిపిస్తోన్న టాక్. మరి దీనిని ఎంత వరకు నిలబెట్టుకొని నెక్స్ట్ లెవల్ కి వెళ్తాడనేది వేచి చూడాలి.

Tags:    

Similar News