NTR 31.. అంతా ఒకేసారి!

అయితే దేవర అయిపోయింది! మరి తారక్.. తన చేతిలో ఉన్న సినిమాలు ఎప్పుడు పూర్తి చేస్తారన్న విషయం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.

Update: 2024-10-08 14:26 GMT

టాలీవుడ్ స్టార్ హీరో జూనియర్ ఎన్టీఆర్.. ప్రస్తుతం దేవర సక్సెస్ జోష్ లో ఉన్న విషయం తెలిసిందే. కొరటాల శివ తెరకెక్కించిన ఆ సినిమా.. బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లు సాధిస్తూ అదరగొడుతోంది. స్టార్టింగ్ లో కాస్త మిక్స్ డ్ రివ్యూస్ వచ్చినప్పటికీ.. వాటితో సంబంధం లేకుండా కలెక్షన్స్ సాధిస్తోంది. నార్త్ లో కూడా అనుకున్న స్థాయికి మంచి రాణిస్తోంది. ఇప్పటికే వరల్డ్ వైడ్ గా బ్రేక్ ఈవెన్ టార్గెట్ ను పూర్తి చేసుకున్న దేవర.. ఇప్పుడు లాభాల పంట పండిస్తోంది!

అయితే దేవర అయిపోయింది! మరి తారక్.. తన చేతిలో ఉన్న సినిమాలు ఎప్పుడు పూర్తి చేస్తారన్న విషయం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. తన బాలీవుడ్ డెబ్యూ మూవీ వార్-2కు సంబంధించిన షూటింగ్ షెడ్యూల్స్ లో ఇప్పటికే తారక్ పాల్గొన్నారు. అదే సమయంలో కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ తో చేయాల్సిన ప్రాజెక్ట్ ను త్వరలో స్టార్ట్ చేయనున్నారని ఇండస్ట్రీలోకి ప్రచారం జరుగుతోంది. ఆగస్టులో NTR 31 మూవీ పూజా కార్యక్రమాలు ఘనంగా జరిగాయి.

కానీ ఆ చిత్రం ఇంకా పట్టాలెక్కలేదు. త్వరలో రెగ్యులర్ షూటింగ్ మొదలు కానున్నట్లు తెలుస్తోంది. అయితే NTR 31కు సంబంధించిన ఓ ఆసక్తికరమైన వార్త ఇప్పుడు నెట్టింట చక్కర్లు కొడుతోంది. ప్రస్తుతం సినీ ఇండస్ట్రీలో సీక్వెల్స్ ట్రెండ్ నడుస్తున్న విషయం తెలిసిందే. ఇటీవల రిలీజ్ అయిన తారక్ మూవీ దేవరకు కూడా సీక్వెల్ రానుంది. కానీ ప్రశాంత్ నీల్.. NTR 31 మూవీని సింగిల్ ఫిల్మ్ గా తెరకెక్కించనున్నట్లు తెలుస్తోంది. ఎలాంటి ప్రీక్వెల్ కానీ సీక్వెల్ కానీ ఉండదట.

అయితే ప్రశాంత్ నీల్.. కేజీఎఫ్ చిత్రాన్ని రెండు పార్టులుగా తీశారు. గతేడాది వచ్చి బ్లాక్ బస్టర్ హిట్ అయిన సలార్ కు కూడా త్వరలో సీక్వెల్ తీయనున్నారు. ఇప్పుడు NTR 31ను మాత్రం యాక్షన్ డ్రామాగా సింగిల్ ఫిల్మ్ తో ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. దీంతో సీక్వెల్స్ ట్రెండ్ కు నీల్ చిన్న బ్రేక్ ఇచ్చినట్లే అన్నమాట. ఇప్పుడు ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. తారక్ ఫ్యాన్స్.. తెగ ట్రెండ్ చేస్తున్నారు.

ఇక NTR 31 మూవీకి సంబంధించి కొద్ది రోజులుగా సోషల్ మీడియాలో రకరకాల వార్తలు వినిపిస్తున్నాయి. హీరోయిన్ గా సప్త సాగరాలు దాటి ఫేమ్ రుక్మిణీ వసంత్ నటిస్తున్నట్లు టాక్ వినిపిస్తోంది. ఇప్పటికే మేకర్స్ ఆమెను ఖరారు చేశారని, త్వరలో అఫీషియల్ గా అనౌన్స్ చేయనున్నారని వార్తలు వచ్చాయి. బంగ్లాదేశ్‌ బ్యాక్‌ డ్రాప్‌ లో సాగే కథతో మూవీ ఉండబోతున్నట్టు మరో వార్త కూడా చక్కర్లు కొట్టింది. మరి వీటిలో నిజమెంతో చూడాలి.

Tags:    

Similar News