ఎన్టీఆర్ - నీల్.. సడన్ మీటింగా?

గత ఏడాది ఆఖరులో సలార్ సినిమాతో ప్రశాంత్ నీల్ ప్రేక్షకుల ముందుకొచ్చి బ్లాక్ బస్టర్ హిట్ ని తన ఖాతాలో వేసుకున్నాడు.

Update: 2024-01-29 05:03 GMT

గత ఏడాది ఆఖరులో సలార్ సినిమాతో ప్రశాంత్ నీల్ ప్రేక్షకుల ముందుకొచ్చి బ్లాక్ బస్టర్ హిట్ ని తన ఖాతాలో వేసుకున్నాడు. ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా 730 కోట్ల కలెక్షన్స్ ని అందుకుంది. ఇదిలా ఉంటే సలార్ తర్వాత ప్రశాంత్ నీల్ ఎన్టీఆర్ హీరోగా మైత్రీ మూవీ మేకర్స్ లో చేయాల్సిన సినిమాని స్టార్ట్ చేయాలని అనుకున్నాడు. అలాగే ప్లానింగ్ చేసుకున్నాడు.

అయితే సలార్ సీక్వెల్ శౌర్యంగ పర్వం ఇప్పుడు లైన్ లోకి వచ్చింది. ఆ సినిమాని వీలైనంత వేగంగా పూర్తి చేయాల్సిన అవసరం ఉంది. వచ్చే ఏడాది ఆగష్టు లోపు శౌర్యంగ పర్వం విడుదల చేస్తామని ఇప్పటికే నిర్మాత విజయ్ కిరంగదూర్ ప్రకటించాడు. ప్రభాస్ కూడా ఈ ఏడాదిలో ఆ సినిమాని పూర్తి చేసి కొత్త ప్రాజెక్ట్ స్టార్ట్ చేయాలని అనుకుంటున్నారు. దీంతో ప్రశాంత్ నీల్ ఎన్టీఆర్ ప్రాజెక్ట్ కి వెనక్కి నెట్టి సలార్ 2 పైన ఫోకస్ చేశారు.

మరో వైపు ఎన్టీఆర్ కూడా ప్రస్తుతం దేవర షూటింగ్ లో ఉన్నారు. ఇది ఏప్రిల్ 5న రిలీజ్ అవుతుందని ప్రకటించారు. కానీ సాధ్యం కాదనే మాట వినిపిస్తోంది. మార్చి నుంచి హిందీలో చేస్తోన్న వార్ 2 మూవీ షూటింగ్ లో జాయిన్ అవుతారు. ఆ సినిమాకి 90 రోజుల కాల్ షీట్స్ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఈ మూవీ పూర్తయిన తర్వాత మరల దేవర సీక్వెల్ కూడా రెడీ కానుంది.

ఇలా వరుస ప్రాజెక్ట్స్ ఉన్నాయి. తాజాగా ప్రశాంత్ నీల్, ఎన్ఠీఆర్ తో భేటీ అయినట్లు తెలుస్తోంది. ఎన్టీఆర్ ఇంట్లోనే వీరిద్దరూ తమ ప్రాజెక్ట్ పై చాలా సేపు చర్చించారంట. ఈ నేపథ్యంలో ఈ మూవీకి సంబందించిన త్వరలో క్లారిటీ వచ్చే అవకాశం ఉందనే మాట వినిపిస్తోంది. ఇద్దరు ప్రస్తుతం చేస్తోన్న ప్రాజెక్ట్స్ నుంచి పూర్తిగా ఫ్రీ అయ్యాక తమ కొత్త ప్రాజెక్ట్ ని పట్టాలు ఎక్కించే ఛాన్స్ ఉంది.

అన్ని కరెక్ట్ గా జరిగితే ఈ ఏడాది ఆఖరులో లేదంటే వచ్చే ఏడాది ఆరంభంలో ప్రశాంత్, తారక్ ప్రాజెక్ట్ సెట్స్ పైకి వెళ్లే అవకాశం ఉందని ఇండస్ట్రీ వర్గాలలో వినిపిస్తోంది. మైత్రీ మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్ తో నిర్మించడానికి సిద్ధంగా ఉంది. భారీ కాన్వాస్ పై డిఫరెంట్ కథాంశంతో తెరకెక్కబోయే ఈ మూవీ కోసం ఫ్యాన్స్ కూడా ఎదురుచూస్తున్నారు. తారక్ తో చేయబోయే సినిమా ఇప్పటి వరకు చేసిన సినిమాలకి భిన్నంగా ఉంటుందని ప్రశాంత్ నీల్ గతంలోనే క్లారిటీ ఇచ్చారు.





 


Tags:    

Similar News