త్రివిక్రమ్ ముందే యంగ్ టైగర్ పంచ్‌లు?
కుదిరితే సరిదిద్దండి.. లేదంటే క్షమించండి!.. ఈ పంచ్ డైలాగ్ విసిరింది ఎవరో తెలుసా? యంగ్ టైగర్ ఎన్టీఆర్
కుదిరితే సరిదిద్దండి.. లేదంటే క్షమించండి!.. ఈ పంచ్ డైలాగ్ విసిరింది ఎవరో తెలుసా? యంగ్ టైగర్ ఎన్టీఆర్. అతడి నోట త్రివిక్రమ్ మాట ఎలా పలికాడు? పైగా అత్తారింటికి దారేది సినిమాలోని ఆ డైలాగ్ చెప్పాల్సిన సందర్భం ఎన్టీఆర్ కి ఎప్పుడు వచ్చింది? అంటే వివరాల్లోకి వెళ్లాలి.
ఇటీవల దేవర షూటింగ్ తో ఫుల్ బిజీగా ఉన్న ఎన్టీఆర్ నిన్నటి సాయంత్రం ఆహ్లాదకరంగా జరుగుతున్న టిల్లు స్క్వేర్ సక్సెస్ మీట్ లో పాల్గొన్నారు. అంతేకాదు త్రివిక్రమ్ ముందే అతడు రాసిన అత్తారింటికి దారేది డైలాగ్ ని చెప్పి అలరించారు. నేనున్నానని గుర్తించండి.. నేను చెబుతున్నా! అంటూ ఫ్యాన్స్ ని ఉత్సాహపరిచారు ఎన్టీఆర్. అయితే అతడు అత్తారింటికి దారేది సినిమాలోని పవన్ కళ్యాణ్ డైలాగ్‌ని అనుకరించడం అందరి దృష్టిని ఆకర్షించింది. ఆ సినిమా దర్శకుడి ముందే అతడు డైలాగ్ ని అదరగొట్టాడు. స్పీచ్ తో మైమరిపించాడు. తారక్ ఈ డైలాగ్‌ని చెప్పినప్పుడు త్రివిక్రమ్ నవ్వుకున్నారు. ఆడిటోరియం మొత్తం ఫిదా అయ్యేలా ఎన్టీఆర్ డైలాగ్ చెప్పారు. ప్రస్తుతం ఈ క్లిప్ పవన్ - ఎన్టీఆర్ అభిమానుల్లో వైరల్ గా మారింది.
'దేవర' వచ్చేదెపుడు?
యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటిస్తున్న భారీ పాన్ ఇండియా చిత్రం 'దేవర' రాక కోసం ఫ్యాన్స్ కళ్లు కాయలు కాసేలా వేచి చూస్తున్నారు. కానీ ఈ సినిమా రిలీజ్ గురించి కొంత డైలమా నెలకొనగా, దానిని ఎన్టీఆర్ క్లియర్ చేసాడు.
ఇది కొంచెం ఓవర్ గా అనిపించవచ్చు కానీ 'దేవర' అభిమానులందరినీ గర్వపడేలా చేస్తాడని, ఫ్యాన్స్ కాలరెగరేస్తారని ఎన్టీఆర్ అన్నారు. ఆలస్యమవుతున్నప్పటికీ అభిమానులకు ఇది పెద్ద ట్రీట్ అని ఎన్టీఆర్ ఆత్మవిశ్వాసాన్ని వ్యక్తం చేసారు. దేవర కాన్సెప్ట్ ఆసక్తికరం. 'భయం' అనే కాన్సెప్ట్ చుట్టూ తిరిగే చిత్రమిదని ఎన్టీఆర్ వెల్లడించారు. 'కళా కాదైకి ఒక ధైర్యం ఉండాలి, ఆ కలని నిజం చేస్కోడానికి భయం ఉండాలి'' అంటూ డైలాగ్ ని చెప్పారు. టిల్లు స్క్వేర్ సక్సెస్ ఈవెంట్లో దేవర గురించి అప్ డేట్ రావడంతో తారక్ అభిమానుల్లో ఒకటే ఉత్సాహం నెలకొంది. దేవర సాధ్యమైనంత తొందర్లోనే రిలీజ్ కి రానుందన్న క్లారిటీ వచ్చింది.