ఎన్టీఆర్.. షాక్ ఇస్తున్న బడ్జెట్ లెక్కలు!
ఆర్ఆర్ఆర్ సినిమా తర్వాత గ్లోబల్ స్టార్ ఇమేజ్ ను సొంతం చేసుకున్న జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో దేవర సినిమాని పాన్ ఇండియా స్థాయిలో చేస్తున్నారు.
ఆర్ఆర్ఆర్ సినిమా తర్వాత గ్లోబల్ స్టార్ ఇమేజ్ ను సొంతం చేసుకున్న జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో దేవర సినిమాని పాన్ ఇండియా స్థాయిలో చేస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ శరవేగంగా సాగుతోంది. రెండు భాగాలుగా ఈ చిత్రాన్ని రిలీజ్ చేయనున్నట్లు ఇప్పటికే కొరటాల శివ క్లారిటీ ఇచ్చారు.
కంప్లీట్ ఫిక్షనల్ కథతో పీరియాడికల్ జోనర్ లో ఈ మూవీని కొరటాల శివ సిల్వర్ స్క్రీన్ పై ఆవిష్కరించే ప్రయత్నం చేస్తున్నారు. ఏకంగా 300 కోట్ల రూపాయల భారీ బడ్జెట్ తో సినిమాని నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. దీని తర్వాత బాలీవుడ్ లో వార్ 2 సినిమాలో తారక్ నటించబోతున్నారు. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ స్టార్ట్ అయింది.
హృతిక్ రోషన్, జూనియర్ ఎన్టీఆర్ లీడ్ రోల్ లో మల్టీస్టారర్ గా ఈ మూవీ తెరకెక్కుతోంది. వారు టూ లో నెగిటివ్ సైడ్స్ ఉన్న పాత్రలో జూనియర్ ఎన్టీఆర్ కనిపించబోతున్నట్లు సమాచారం. ఈ సినిమాని ఏకంగా 500 కోట్ల రూపాయల భారీ బడ్జెట్ తో యష్ రాజ్ ఫిలిమ్స్ ఆదిత్య చోప్రా నిర్మిస్తున్నారు. అయాన్ ముఖర్జీ దర్శకత్వంలో ఈ మూవీ తెరకెక్కుతూ ఉండటం విశేషం.
దీని తర్వాత వచ్చే ఏడాది ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో మైత్రి మూవీ మేకర్స్ లో భారీ బడ్జెట్ సినిమాని జూనియర్ ఎన్టీఆర్ చేయబోతున్నారు. ఈ సినిమాని ఏకంగా 400 కోట్ల భారీ బడ్జెట్ తో రెండు భాగాలుగా తెరకెక్కించనున్నట్లు ఇండస్ట్రీ వర్గాలలో వినిపిస్తోంది. మొత్తం ఈ ఈ మూడు సినిమాల బడ్జెట్ చూసుకుంటే ఇప్పుడు ఏకంగా 1200 కోట్ల వరకు ఉండటం విశేషం. యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ తర్వాత ప్రస్తుతం సౌత్ లో అత్యధిక బడ్జెట్ తో సినిమాలు చేస్తున్న హీరోగా జూనియర్ ఎన్టీఆర్ ఉన్నారని చెప్పాలి.
గతంతో పోల్చుకుంటే కథల ఎంపిక విషయంలో కూడా తారక్ ఇప్పుడు చాలా పర్ఫెక్ట్ లైన్ లో ఉన్నారని టాక్ వినిపిస్తోంది. కంప్లీట్ గా బౌండెడ్ స్క్రిప్ట్ సాటిస్ఫై అయితేనే ఆ చిత్రాన్ని సెట్స్ పైకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. అలాగే టాలెంట్ ఉంటే ఫ్లాప్ డైరెక్టర్లకు కూడా అవకాశం ఇవ్వడానికి జూనియర్ ఎన్టీఆర్ సిద్ధంగానే ఉన్నట్లు ఇండస్ట్రీ వర్గాలలో వినిపిస్తోంది.