ఎన్టీఆర్ - ప్రశాంత్ నీల్.. అంతకుమించి..
దీని తర్వాత ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తారక్ సినిమాని సెట్స్ పైకి తీసుకొని వెళ్లనున్నారు.
జూనియర్ ఎన్టీఆర్ హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో దేవర మూవీ తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. రెండు భాగాలుగా సిద్ధమవుతోన్న ఈ సినిమా వచ్చే ఏడాది ఏప్రిల్ లో ఒక భాగం రిలీజ్ కానుంది. ఏడాది ఆఖరులో పార్ట్2 రావొచ్చు. దీని తర్వాత ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తారక్ సినిమాని సెట్స్ పైకి తీసుకొని వెళ్లనున్నారు. వార్ 2 ఈ మధ్యలో చేసిన అది హిందీ కేటగిరీలోకి వస్తుంది.
దీంతో ప్రశాంత్ నీల్ సినిమాపైన ఫ్యాన్స్ భారీ అంచనాలు పెట్టుకున్నారు. సలార్ పార్ట్ 2 రిలీజ్ తర్వాత ఎన్టీఆర్ చిత్రాన్ని ప్రశాంత్ నీల్ స్టార్ట్ చేస్తారు. కరెక్ట్ గా చూసుకుంటే 2025లో ఈ సినిమా పట్టాలు ఎక్కే అవకాశం కనిపిస్తోంది. ఇదిలా ఉంటే సలార్ ప్రమోషన్స్ లో భాగంగా ప్రశాంత్ నీల్ వీ సినిమా గురించి ఇంటరెస్టింగ్ న్యూస్ రివీల్ చేశారు.
తారక్ తో చేయబోయే సినిమా షూటింగ్ ఏకంగా 38 దేశాలలో ఉంటుందని చెప్పారు. సినిమాలో కథ అవసరాన్ని బట్టి అన్ని దేశాలలో షూట్ చేయాల్సి ఉంటుందని చెప్పుకొచ్చారు. కచ్చితంగా ఈ మూవీ నెక్స్ట్ లెవల్ లో ఉంటుందని అన్నారు. ఇక ప్రశాంత్ నీల్ సినిమాని 400 కోట్ల బడ్జెట్ తో నిర్మించనున్నట్లు తెలుస్తోంది. పాన్ వరల్డ్ రేంజ్ లో గ్లోబల్ స్టార్ ఇమేజ్ ఎస్టాబ్లిష్ అయ్యే విధంగా ఈ మూవీ ఉండబోతోందని టాక్.
అదే జరిగితే ఆర్ఆర్ఆర్ తో తారక్ కి వచ్చిన గ్లోబల్ ఇమేజ్ ని ప్రశాంత్ నీల్ చిత్రం మంచి హెల్ప్ అవుతుంది. దేవర, వార్ 2 సినిమాలతో ఎలాగూ తారక్ ఇమేజ్ పెరుగుతుంది. అప్పుడు ప్రశాంత్ నీల్ మూవీని పాన్ వరల్డ్ రేంజ్ లో ప్లాన్ చేసిన ఇతర దేశాల వారు రిసీవ్ చేసుకుంటారు.
మరి ఈ సినిమా ఎప్పుడు ప్రారంభం అవుతుందనేది మాత్రం ఆసక్తికరంగా మారింది. ప్రశాంత్ నీల్ ఫోకస్ అంతా ప్రెజెంట్ సలార్ చిత్రంపైనే ఉంది. దీని తర్వాతనే తన నెక్స్ట్ ప్రాజెక్ట్ గురించి ఆలోచిస్తాడు.