'వార్' కోసం ఎన్టీఆర్ రెండో సారి...!
ఇటీవలే దేవర తాజా షెడ్యూల్ ని ముగించుకున్న ఎన్టీఆర్ తో వార్ 2 చిత్ర దర్శకుడు అయాన్ ముఖర్జీ భేటీ అయ్యాడు.
యంగ్ టైగర్ ఎన్టీఆర్ బాలీవుడ్ ఎంట్రీ కన్ఫర్మ్ అయిన విషయం తెల్సిందే. వార్ 2 సినిమా తో హిందీ ప్రేక్షకుల ముందుకు ప్రత్యక్షంగా వెళ్లేందుకు గాను ఎన్టీఆర్ కి గ్రౌండ్ ప్రిపేర్ అయింది. ప్రస్తుతం దేవర సినిమా షూటింగ్ లో ఉన్న ఎన్టీఆర్ ఇదే ఏడాది చివరి వరకు వార్ 2 షూటింగ్ లో జాయిన్ అవ్వాల్సి ఉందని సమాచారం అందుతోంది.
ఇటీవలే దేవర తాజా షెడ్యూల్ ని ముగించుకున్న ఎన్టీఆర్ తో వార్ 2 చిత్ర దర్శకుడు అయాన్ ముఖర్జీ భేటీ అయ్యాడు. హైదరాబాద్ కి ఎన్టీఆర్ తో చర్చల కోసం వచ్చిన అయాన్ ముఖర్జీ స్క్రిప్ట్ వివరించడంతో పాటు, పాత్రకు సంబంధించిన ఇన్ పుట్స్ ని కూడా ఎన్టీఆర్ తో చర్చించినట్లు తెలుస్తోంది.
గతంలో ఒక సారి ఎన్టీఆర్ తో అయాన్ ముఖర్జీ వార్ 2 కోసం భేటీ అయ్యాడు. నేడు వీరిద్దరి మధ్య రెండో భేటీ కొనసాగుతోంది. స్క్రిప్ట్ వర్క్ దాదాపుగా పూర్తి అయిన కారణంగా ఒకసారి ఫైనల్ నరేషన్ ఇవ్వడం కోసం అయాన్ ముఖర్జీ హైదరాబాద్ వచ్చి ఉంటాడు అంటూ మీడియా సర్కిల్స్ లో టాక్ వినిపిస్తుంది.
ఇదే సమయంలో ఎన్టీఆర్ డేట్ల విషయం లో కూడా దర్శకుడు క్లారిటీ తీసుకునే అవకాశాలు ఉన్నాయి. దేవర సినిమా షూటింగ్ ఇంకా పూర్తి అవ్వని కారణంగా ఎప్పటి నుండి వార్ 2 కోసం అందుబాటులోకి వచ్చేది ఎన్టీఆర్ ఈ భేటీలో క్లారిటీ ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. షూటింగ్ ఎక్కువ శాతం ముంబైలో ఉండే అవకాశం ఉందట.
ఆర్ఆర్ఆర్ సినిమా తర్వాత ఎన్టీఆర్ స్థాయి పాన్ ఇండియా రేంజ్ ను మించి పెరిగింది అనడంలో సందేహం లేదు. అలాంటి ఎన్టీఆర్ ని వార్ 2 లో నటింపజేయడం వల్ల ఆ సినిమా స్థాయి మరింత పెరగడం ఖాయం. హృతిక్ రోషన్, ఎన్టీఆర్ ను కలిపి ఎప్పుడెప్పుడు వెండి తెరపై చూస్తామా అంటూ ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.