హీరోయిన్ గా ఒంగోలు అమ్మాయి ఎంట్రీ
ట్యాలెంట్ గల వారికి పరిశ్రమ అవకాశాలు కల్పిస్తుందని అంతా నమ్ముతున్నారు.
టాలీవుడ్ లో తెలుగు అమ్మాయిల జోరు పెరిగిన సంగతి తెలిసిందే. కొత్త అమ్మాయిలకు ఇప్పుడు అవకాశా లు బాగానే కల్పిస్తున్నారు. ట్యాలెంట్ ఉండి...పాత్రలకు ఇక్కడి బ్యూటీలు సెట్ అవుతారు అనుకుంటే మేకర్స్ మరో ఆలోచన లేకుండా తీసుకుంటున్నారు. పాత పద్దతికి స్వస్తి పలికి కొత్త విధానంలో రిక్రూట్ చేయడంపై తెలుగు అమ్మాయిలు సైతం సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ట్యాలెంట్ గల వారికి పరిశ్రమ అవకాశాలు కల్పిస్తుందని అంతా నమ్ముతున్నారు.
అయితే ఈ రేసులో తెలంగాణ అమ్మాయిలు కంటే ఆంధ్రా అమ్మాయిలే ఎక్కువగా కనిపిస్తున్నారు. విశాఖపట్టణం..విజయవాడ..రాజమండ్రి బ్యూటీలే ఇండస్ట్రీలో ఎక్కువగా తారస పడుతుంటారు. అలాగే హైదరాబాద్ స్థానికత కలిగిన అమ్మాయిలు ఇండస్ట్రీలో అవకాశాల కోసం సీరియస్ గా ప్రయత్నాలు చేస్తున్నారు వారు ఎంతో మంది ఉన్నారు. తాజాగా ఒంగోలు అమ్మాయి కూడా హీరోయిన్ గా ఎంట్రీ ఇస్తుందన్న సంగతి ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
'హ్యాపీ ఎండింగ్' అనే చిత్రంలో అపూర్వ రావ్ అనే భామ నటిస్తోంది. నేను తెలుగు అమ్మాయినే అంటూ అమ్మడు తనని తాను పరిచయం చేసుకుంది. ' నేను తెలుగు అమ్మాయినే. సొంతూరు ఒంగోలు. కానీ నాన్న ఉద్యోగ రీత్యా గుజరాత్ వెళ్లిపోయాం. కొన్నాళ్ల పాటు కువైట్ లోనూ ఉన్నాం. అక్కడే నా స్కూలింగ్ అంతా జరిగింది. అటుపై పెద్ద చదువులు పూర్తయిన తర్వాత కొన్నాళ్ల పాటు ఉద్యోగం చేసాను.
కానీ ఏవీ నాకు అంతగా సంతృప్తినివ్వలేదు. కళల వైపు ఆసక్తితో సినిమాలవైపు వచ్చాను. సమంత..సాయి పల్లవి.. శ్రీలీల ప్రయాణం ఎంతో స్పూర్తిదాయకంగా అనిపిస్తుంది. వీళ్లతో కలిసి పనిచే యాలని ఉంది. ఒక మంచి సినిమా ప్రేక్షకుల ముందుకు రావాలి అంటే అలాంటి నటీమణులు ఉండాలి అన్నది నా అభిప్రాయం' అంది.