ఇండియా టాప్‌ 10 లో మన స్టార్స్‌ ఐదుగురు

సోషల్‌ మీడియాలో బాలీవుడ్‌ స్టార్స్ తో పోల్చితే టాలీవుడ్‌ స్టార్స్ కి ఎక్కువ క్రేజ్ ఉందని మరోసారి నిరూపితం అయ్యింది

Update: 2024-08-23 11:30 GMT

సోషల్‌ మీడియాలో బాలీవుడ్‌ స్టార్స్ తో పోల్చితే టాలీవుడ్‌ స్టార్స్ కి ఎక్కువ క్రేజ్ ఉందని మరోసారి నిరూపితం అయ్యింది. ప్రముఖ డిజిటల్ మీడియా సంస్థ అయిన ORMAX మీడియా ప్రతి నెల సోషల్ మీడియా ద్వారా, ఆన్ లైన్‌ ద్వారా నిర్వహించే సర్వే ఫలితాలు ఆసక్తిని కలిగిస్తూ ఉంటాయి. నెట్టింట ఏ స్టార్‌ కి ఏ స్థాయిలో క్రేజ్ ఉంది అనే విషయాలను ఈ సంస్థ సరిగ్గా లెక్క కడుతుంది అనే నమ్మకం చాలా మందిలో ఉంది. తాజాగా మరోసారి ఈ సంస్థ తన సర్వే ఫలితాలో వచ్చింది. ఇందులో టాలీవుడ్‌ స్టార్స్ కి నెటిజన్స్‌ బ్రహ్మరథం పట్టారు.

జూలై 2024 ORMAX మోస్ట్‌ పాపులర్‌ మేల్‌ ఫిల్మ్‌ స్టార్స్ ఇన్‌ ఇండియా సర్వేలో టాప్‌ లో పాన్ ఇండియా సూపర్‌ స్టార్‌, కల్కి స్టార్‌ ప్రభాస్ చోటు దక్కించుకున్నాడు. కల్కి సినిమా కారణంగా గత కొన్ని రోజులుగా సోషల్‌ మీడియాలో ప్రభాస్ నామం ఓ రేంజ్‌ లో మారు మ్రోగుతోంది. అందుకే జులై 2024 సర్వే లో ప్రభాస్ ప్రథమ స్థానంలో నిలిచాడు. రెండో స్థానంలో తమిళ స్టార్‌ హీరో విజయ్‌ నిలిచాడు. ఈయన తన గోట్‌ సినిమాతో పాటు రాజకీయ పార్టీ కారణంగా గత కొన్ని రోజులుగా రెగ్యులర్‌ గా వార్తల్లో ఉంటున్నాడు. అందుకే సోషల్‌ మీడియాలో విపరీతమైన క్రేజ్ తో రెండో స్థానంలో నిలిచాడు.

బాలీవుడ్‌ బాద్‌ షా షారుఖ్‌ ఖాన్‌ కి మూడో స్థానం దక్కింది. ఈ మధ్య కాలంలో ఆయన నటించిన సినిమాలు ఏవీ కూడా విడుదల కాకున్నా కూడా టాప్‌ స్థానంలో నిలిచాడు. ఇక నాల్గవ స్థానంలో టాలీవుడ్‌ సూపర్‌ స్టార్‌ మహేష్ బాబు నిలిచాడు. గుంటూరు కారం తో ఈ ఏడాది ఆరంభంలో ప్రేక్షకుల ముందుకు వచ్చిన మహేష్ బాబు ప్రస్తుతం రాజమౌళి సినిమా కోసం రెడీ అవుతున్నాడు. ఇటీవల కాస్త గడ్డం పెంచి సోషల్‌ మీడియాలో అందరి దృష్టిని ఆకర్షించాడు. ఇక అయిదవ స్థానంలో యంగ్‌ టైగర్ ఎన్టీఆర్‌ నిలిచాడు. దేవర సినిమాతో వచ్చే నెలలో ఎన్టీఆర్ ప్రేక్షకుల ముందుకు రాబోతున్న నేపథ్యంలో ORMAX మీడియా సర్వేలో టాప్‌ లో నిలిచాడు.

ఆ తర్వాత స్థానాల్లో అక్షయ్‌ కుమార్‌ ఆరవ స్థానం, అల్లు అర్జున్‌ ఏడవ స్థానం, సల్మాన్‌ ఖాన్‌ ఎనిమిదవ స్థానం, రామ్‌ చరణ్ తొమ్మిదవ స్థానం, తమిళ స్టార్ అజిత్‌ 10వ స్థానంలో ఉన్నారు. మొత్తం పది స్థానాల్లో అయిదు తెలుగు స్టార్స్‌ దక్కించుకున్నారు. ఇక తమిళ స్టార్స్ కి రెండు స్థానాలు దక్కాయి. బాలీవుడ్‌ నుంచి కేవలం ముగ్గురికి మాత్రమే చోటు దక్కడం విశేషం. టాలీవుడ్‌ ప్రస్తుతం ఇండియన్ సినిమా ఇండస్ట్రీ ని ప్రభావితం చేస్తుంది అనేందుకు ఇదే ప్రత్యక్ష సాక్ష్యం అంటూ నెటిజన్స్ మరియు తెలుగు మీడియా వర్గాల వారు కామెంట్స్ చేస్తున్నారు.

--

Tags:    

Similar News