బాప్ రే! ఒర్రీతో ఒక్క క్లిక్‌కి ల‌క్ష‌ల్లో చెల్లించాలా?

సెల‌బ్రిటీ ప్ర‌పంచంలో ఒర్రీ అలియాస్ అవ్ర‌త‌మ‌ణి ఒక సంచ‌ల‌నం. సోషల్ మీడియాలో ఓర్రీ నిరంతరం చ‌ర్చ‌ల్లో నిలుస్తున్నాడు.

Update: 2024-05-12 14:09 GMT

సెల‌బ్రిటీ ప్ర‌పంచంలో ఒర్రీ అలియాస్ అవ్ర‌త‌మ‌ణి ఒక సంచ‌ల‌నం. సోషల్ మీడియాలో ఓర్రీ నిరంతరం చ‌ర్చ‌ల్లో నిలుస్తున్నాడు. అతడు అన్ని సినిమా పార్టీలు ఫంక్ష‌న్ల‌లో కనిపిస్తున్నాడు. న‌ట‌వార‌సురాళ్ల‌తో పాటు, పెద్ద స్టార్స్ తోను స‌న్నిహితంగా ఉన్నాడు. హిందీ చిత్ర పరిశ్రమలోని ప్రతి స్టార్‌కి ఒర్రీతో అనుబంధం ఉంది. స్టార్ కిడ్స్ కి అత్యంత స‌న్నిహితంగా ఉన్న అత‌డి ఫోటోలు ఇప్ప‌టికే అంత‌ర్జాలంలో హాట్ టాపిక్ గా మారాయి.

ఓర్రీ ఇండ‌స్ట్రీలో జ‌రిగే అతిపెద్ద పార్టీలలో నిరంత‌రం క‌నిపిస్తాడు. నైట్ పార్టీల్లో అత‌డే స్పెష‌ల్ ఎట్రాక్ష‌న్. స‌ల్మాన్ తో బిగ్ బాస్ షోలోను అత‌డి ఎపిసోడ్ సంచ‌ల‌నం అయింది. ఓర్రీ ఎప్పుడూ ఖాళీగా పార్టీల్లో తిరుగుతుంటాడు. జీవనోపాధి కోసం ఏం చేస్తాడో ఎవరికీ తెలియదు. కానీ నిరంత‌రం నైట్ పార్టీల‌లో అత‌డు మెరుస్తుంటాడు. స్టార్‌లతో అతడి స్నాప్‌లు వైరల్ అవుతూనే ఉంటాయి.

అయితే ఓర్రీ డబ్బు ఎలా సంపాదిస్తాడు? అంటే.. దానికి ర‌క‌ర‌కాల మార్గాలున్నాయి. అత‌డు సెల‌బ్రిటీ పార్టీల‌కు అటెండ‌యితే డ‌బ్బు ముడుతుంద‌ని ఇంత‌కుముందే చెప్పాడు. ఇప్పుడు త‌న పాపులారిటీని బ‌ట్టి ఓర్రీ ఓ ఇంటర్వ్యూలో తనతో ఎవరైనా ఫోటో దిగాలంటే ల‌క్ష‌ల్లో చెల్లించాలని అంటున్నాడు. మొత్తానికి పార్టీ నైట్ మీడియాలో ఉంటూ పెద్ద మొత్తంలో డబ్బు సంపాదిస్తున్నాడు.

సినీప‌రిశ్ర‌మ‌లో బిగ్ షాట్స్ ఈవెంట్ల‌కు హాజ‌రైనందుకు ఒర్రీ భారీ మొత్తం డిమాండ్ చేస్తున్నాడు. అత‌డి రాక‌తో పార్టీకి కొత్త క‌ళ వ‌స్తుంద‌ని అంతా న‌మ్ముతారు. అందుకే ఒర్రీని ప్ర‌త్యేకంగా ఆహ్వానిస్తున్నారు. బాలీవుడ్‌లోని అనేక బ్రాండ్‌లు అతడికి పెద్ద మొత్తంలో డబ్బు చెల్లిస్తాయి. సెలెబ్స్‌తో పోజులిచ్చేందుకు ఓర్రీ ఒక విలక్షణమైన శైలిని కలిగి ఉంటాడనే పేరుంది. అతడు వారిని హ‌త్తుకునే విధానం ఒక ప్రత్యేకత‌ను క‌లిగి ఉంటుంది.

ఓర్రీ అకా ఓర్హాన్ అవత్రమణి దేవ‌ర బ్యూటీ జాన్వీ కపూర్‌కి స్నేహితుడు. అతడి స్వంత యూట్యూబ్ ఛానెల్ ద్వారా ఆర్జిస్తున్నాడు. అలాగే గూగుల్‌లో అత్యధికంగా శోధించిన వ్యక్తులలో అతడు కూడా ఒకడు. తనకు పార్టీలు అంటేనే ఇష్టమని సినిమాలు, షోలు చేయాలనే ఉద్దేశం లేదని కూడా ఓర్రీ చెప్పాడు. అత‌డి అభిరుచికి త‌గ్గ‌ట్టే పార్టీల్లో మాత్ర‌మే క‌నిపిస్తున్నాడు.

Tags:    

Similar News