ఆస్కార్‌-2024 వేడి మొద‌లైంది

2024 ఆస్కార్ ఓటింగ్ ప్ర‌క్రియ ప్రారంభ‌మైంది. 96వ ఆస్కార్‌ అవార్డుల వేడుక మార్చి 10న లాస్‌ ఏంజెల్స్‌లో జరగనుంది

Update: 2024-01-13 14:29 GMT

2024 ఆస్కార్ ఓటింగ్ ప్ర‌క్రియ ప్రారంభ‌మైంది. 96వ ఆస్కార్‌ అవార్డుల వేడుక మార్చి 10న లాస్‌ ఏంజెల్స్‌లో జరగనుంది. నామినేషన్లు జనవరి 23న ప్రకటించనున్నారు. నటన, దర్శకత్వం, రచన, క్రాఫ్ట్ కేటగిరీల (మేకప్/హెయిర్‌స్టైలింగ్, విజువల్ ఎఫెక్ట్స్ మినహా)లో పోటీదారులు సంవత్సరాలుగా అమలులో ఉన్న ప్రాధాన్యత విధానంలో ఎంపికవుతారు. బ్యాలెట్ లెక్కింపు పద్ధతి ఎలా పనిచేస్తుందో వివరించడానికి, గత సంవత్సరం ఉత్తమ నటుడి రేసులో దీనిని వర్తింపజేసారు.

జనవరి 12న ఓటింగ్ ప్రారంభం కాగా, జనవరి 16 సాయత్రం 5 గంటల వరకు ఇది సాగుతుంది. ఆస్కార్‌ అకాడమీలో పదివేల మందికి పైగా సభ్యులు ఉండ‌గా, వారికి కేటాయించిన విభాగాల్లోని ఓటు వేయాల్సి ఉంది. న‌టులు న‌ట‌న‌కు సంబంధించిన విభాగంలో, ద‌ర్శ‌కులు వారి విభాగంలో, ఇత‌ర శాఖ‌ల వారు వారికి కేటాయించిన విభాగంలో ఓట్లు వేయాల్సి ఉంది. 23 విభాగాల్లో ఆస్కార్‌ అవార్డుల విజేతలను ప్రకటిస్తారు. జ‌న‌వ‌రి 23న ఆస్కార్‌ నామినేషన్స్‌ను ప్రకటిస్తారు. ఇప్పటికే పది విభాగాల్లోని షార్ట్‌ లిస్ట్‌ జాబితాను ప్రకటించారు.

2023 తెలుగు చిత్ర‌సీమ‌కు అవార్డుల ప‌రంగా క‌లిసొచ్చిన సంవ‌త్స‌రం. ఆర్.ఆర్.ఆర్ చిత్రం ఆస్కార్ ని తెలుగు లోగిళ్ల‌కు తెచ్చింది. ఆస్కార్ తో పాటు ప్ర‌తిష్ఠాత్మ‌క గోల్డెన్ గ్లోబ్, హాలీవుడ్ క్రిట‌క్స్ పుర‌స్కారాలు మ‌న‌కు ద‌క్కాయి. భార‌త‌దేశంలో నెవ్వ‌ర్ బిఫోర్ ట్రీట్ ఇచ్చింది టాలీవుడ్. అందుకే ఈసారి తెలుగు చిత్ర‌సీమ నుంచి ఏ సినిమా ఆస్కార్ రేసులోకి వెళ్ల‌నుంది? అన్న‌ది ఆస‌క్తిగా మారింది.

Tags:    

Similar News