ఈవారం ఓటీటీ సందడే సందడి
ప్రతివారం మాదిరిగానే ఈ వారం ఓటీటీ ప్రేక్షకుల ముందుకు తెలుగు, హిందీ, ఇంగ్లీష్, ఇతర భాషల కంటెంట్ పెద్ద ఎత్తున రాబోతుంది.
ప్రతివారం మాదిరిగానే ఈ వారం ఓటీటీ ప్రేక్షకుల ముందుకు తెలుగు, హిందీ, ఇంగ్లీష్, ఇతర భాషల కంటెంట్ పెద్ద ఎత్తున రాబోతుంది. గురువారం నుంచి పలు వెబ్ సిరీస్‌లు, సినిమాలు స్ట్రీమింగ్ మొదలు కాబోతున్నాయి. పుష్ప 2 సినిమా గత వారం ప్రేక్షకుల ముందుకు వచ్చి భారీ విజయాన్ని సొంతం చేసుకున్న విషయం తెల్సిందే. ఈ వారంలోనూ ఆ సినిమా థియేట్రికల్ సందడి కొనసాగే అవకాశాలు ఉన్నాయి. ఆ సినిమాతో పాటు ఓటీటీ ద్వారా ప్రేక్షకులను అలరించేందుకు గాను మరికొన్ని సినిమాలు ప్రేక్షకులు మందుకు రాబోతున్నాయి.
బాలీవుడ్ ప్రేక్షకులను ఇప్పటి వరకు పలు సార్లు అలరించిన సింగం సిరీస్‌లో సింగం ఎగైన్ వచ్చింది. అయితే బాక్సాఫీస్ వద్ద సింగం ఎగైన్ సినిమా తీవ్రంగా నిరాశ పరిచింది. ప్రముఖ దర్శకుడు రోహిత్ శెట్టి దర్శకత్వంలో రూపొందినా ప్రేక్షకులను అలరించడంలో మాత్రం ఫెయిల్ అయ్యింది. అయితే ఓటీటీ ద్వారా కచ్చితంగా మంచి విజయాన్ని సొంతం చేసుకునే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. ప్రముఖ ఓటీటీ అమెజాన్ ప్రైమ్ ద్వారా డిసెంబర్ 12 నుంచి సింగం ఎగైన్ సినిమా స్ట్రీమింగ్ కాబోతుంది. ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించారు.
ఈ మధ్య చిన్న సినిమాలకు మంచి రీచ్ ఉంటుంది. కంటెంట్ ఓరియంటెడ్ సినిమాలను చేస్తే ప్రేక్షకులు ఆధరిస్తారని ఇప్పటికే పలు సార్లు నిరూపితం అయ్యింది. ఈటీవీ విన్ ద్వారా ఇప్పటికే వచ్చిన పలు చిన్న సినిమాలు ప్రేక్షకులను మెప్పించాయి. ఇప్పుడు అదే ఈటీవీ విన్‌లో రోటీ కప్‌డా రొమాన్స్ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. అందుకు సంబంధించిన అధికారిక ప్రకటన వచ్చింది. ఓటీటీ ద్వారా రాబోతున్న ఈ సినిమా ఒక వర్గం ప్రేక్షకులను అలరించే అవకాశాలు ఉన్నాయి.
హాలీవుడ్ నుంచి సీక్రెట్ లెవల్ అడల్ట్ యానిమేటెడ్ సిరీస్ ప్రేక్షకలు ముందుకు రాబోతుంది. ప్రతి ఎపిసోడ్ అత్యంత విభిన్నంగా ఉంటుంది అని ఈ సిరీస్ డిసెంబర్ 10 నుంచి ప్రైమ్ వీడియో స్ట్రీమింగ్ చేయబోతుంది. ఇవే కాకుండా ఏంజెలీనా జోలీ ప్రధాన పాత్రలో నటించిన మారియా కల్లాస్ ఆధారంగా రూపొందింది. నెట్ ఫ్లిక్స్ లో ఈ వెబ్ సిరీస్‌ను డిసెంబర్ 11 నుంచి స్ట్రీమింగ్ చేయబోతున్నారు. ఏంజెలీనా జోలీ ఫ్యాన్స్ మారియా కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.