దివంగత స్టార్ కి దక్కిన గౌరవం
సినిమా రంగంలో విశేష సేవ చేసిన విజయ్ కాంత్ రాజకీయాల్లో కూడా తనదైన ముద్ర వేసిన విషయం తెల్సిందే
ప్రతి సంవత్సరం భారత ప్రభుత్వం ప్రకటించే పద్మ అవార్డుల జాబితాలో సినిమా రంగానికి చెందిన వారికి ప్రాముఖ్యత కల్పించడం సినీ ప్రేమికులకు ఆనందాన్ని కలిగించే విషయం. 2024 రిపబ్లిక్ డే సందర్భంగా ఐదుగురికి పద్మ విభూషణ్ అవార్డులు, 17 మందికి పద్మ భూషన్, 110 మందికి పద్మశ్రీ అవార్డులను ప్రకటించారు.
గత ఏడాది అనారోగ్యంతో మృతి చెందిన కెప్టెన్ విజయ్ కాంత్ కి కేంద్ర ప్రభుత్వం పద్మ భూషన్ అవార్డును ప్రకటించడం ఆయన అభిమానులకు ఆనందాన్ని కలిగించింది. ఎన్నో సినిమాల్లో నటించి నటుడిగా స్టార్ డమ్ దక్కించుకున్న విజయ్ కాంత్ కి సౌత్ ఇండియా మొత్తం అభిమానులు ఉన్నారు.
సినిమా రంగంలో విశేష సేవ చేసిన విజయ్ కాంత్ రాజకీయాల్లో కూడా తనదైన ముద్ర వేసిన విషయం తెల్సిందే. ఆయన పార్టీని ప్రారంభించి క్రియాశీలకంగా వ్యవహరించారు. హేమా హేమీలు అయిన జయలలిత మరియు కరుణా నిధి వంటి వారిని ఢీ కొట్టాడు.
గత ఏడాది డిసెంబర్ 28న మృతి చెందిన విజయ్ కాంత్ కి పద్మభూషణ్ అవార్డు దక్కడం పట్ల ప్రతి ఒక్కరు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. సోషల్ మీడియాలో విజయ్ కాంత్ అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తూ ఉన్నారు. కేంద్ర ప్రభుత్వంకు వారు కృతజ్ఞతలు చెబుతూ కెప్టెన్ కి దక్కిన గౌరవం పట్ల సంతోషం వ్యక్తం చేస్తున్నారు.