స‌మ‌స్య చిన్న‌దే అని వ‌దిలేస్తే కాటు వేస్తుంది: న‌టి ప‌ద్మ‌ప్రియ‌

మంగళవారం నాడు వడకర సమీపంలోని మడపల్లి ప్రభుత్వ కళాశాలలో మూడవ ఎంఆర్ నారాయణ కురుప్ స్మారక ఉపన్యాసం సంద‌ర్భంగా ప‌ద్మ ప్రియ పై వ్యాఖ్య‌లు చేసారు.

Update: 2024-10-04 03:25 GMT

సినీరంగంలో స్త్రీలు ప్రాతినిధ్యం వహించకపోవడానికి లింగ వివక్ష, మార్కెట్‌ విలువే కారణమని, కథలు కథనాలుగానీ, మేకింగ్ ప‌రంగా కానీ మేల్ పాత్రలు వేళ్లూనుకున్నాయని బ‌హుభాషా న‌టి పద్మప్రియ అన్నారు.

90 శాతం సినిమాలు బాక్సాఫీస్ వద్ద పరాజయం పాలయ్యే పరిశ్రమలో మగ నటులు బ్యాంకబుల్ అని, మహిళలు బ్యాంకబుల్ కాదని ఎవరైనా ఎలా చెప్పగలరని ప్ర‌శ్నించారు. కాబట్టి మహిళలు, ట్రాన్స్‌పీపుల్-సెంట్రిక్ కథలు చెప్పడాన్ని ఎవ‌రూ ఆప‌లేర‌ని అన్నారు.

మమ్ముట్టి స‌హా ప‌లువురు సౌత్ అగ్ర హీరోల స‌ర‌స‌న ప‌ద్మ ప్రియ న‌టించారు. ఏడు భాషల్లో నటించిన ప‌ద్మ‌ప్రియ‌ మలయాళ పరిశ్రమలో కాజ్చా (2004)తో అరంగేట్రం చేసారు. మంగళవారం నాడు వడకర సమీపంలోని మడపల్లి ప్రభుత్వ కళాశాలలో మూడవ ఎంఆర్ నారాయణ కురుప్ స్మారక ఉపన్యాసం సంద‌ర్భంగా ప‌ద్మ ప్రియ పై వ్యాఖ్య‌లు చేసారు. తన వ్యక్తిగత అనుభవాన్ని దృష్టిలో ఉంచుకుని పద్మప్రియ మాట్లాడుతూ.. ఒక మహిళ సమస్యల గురించి మాట్లాడితే అది ఆమె సమస్యగా మారుతుంది. 2007లో తమిళ చిత్రం `మిరుగమ్` (జంతువు) చిత్రీకరణ సమయంలో షూటింగ్ చివరి రోజున దర్శకుడు సామి న‌న్ను చెంపదెబ్బ కొట్టాడు. పరిశ్రమలోని సంఘాల‌తో ఈ సమస్య గురించి లేవనెత్తినప్పుడు.. అప్ప‌టికే వాగ్దానం చేసిన చాలా సినిమాలను కోల్పోయానని ప‌ద్మ‌ప్రియ‌ చెప్పింది. చాలా కాలంగా ఇది పెద్ద స‌మ‌స్య అని అనుకుంటున్నాను! అని చెప్పింది.

బాగా ఎమోట్ చేయడం లేదు! అని ఆరోపిస్తూ సామీ ప‌ద్మ ప్రియ‌ను చెంపదెబ్బ కొట్టాడు. కానీ పద్మప్రియ `మిరుగమ్`లో తన పాత్రకు ఉత్తమ నటిగా తమిళనాడు రాష్ట్ర చలనచిత్ర ప్రత్యేక అవార్డును గెలుచుకుంది. సినిమాలో తన హింసాత్మక నేరస్థుడైన భర్తగా రూపాంతరం చెందిన టాంబోయిష్ మహిళగా ప‌ద్మ ప్రియ‌ నటించింది. ఒక రీసెర్చ్ ఆధారంగా చూస్తే.. సినిమాల్లో పురుష -స్త్రీ పాత్రలను చిత్రీకరించే విధానంలో పూర్తి వ్యత్యాసం ఉందని ప‌ద్మ‌ప్రియ‌ చెప్పింది. ఎగ్జిక్యూటివ్‌లు, మిలిటరీ అధికారులు, లాయర్లు, గ్యాంగ్‌స్టర్‌లు వంటి ఏజెన్సీ పాత్రలు ప్రధానంగా మగవారే అయితే, స్త్రీ పాత్రలు చాలా అందంగా గ్లామ‌ర్ ఒల‌క‌బోసేవిగా ఉంటాయి. యువతులు మ‌తి చెడి డ్యాన్సుల‌కు ప‌రిమితం అవుతార‌ని చెప్పింది.

మహిళలను లొంగదీసుకోవడం సినిమాలకే పరిమితం కాదన్నారు. ఇది సర్వవ్యాప్తి చెందిందని, అన్ని రంగాలలో పోరాడాల్సిన అవసరం ఉందని ఆమె అన్నారు. లింగ పక్షపాతం గురించి నిరంతరం మాట్లాడండి. మహిళల ప్రాతినిధ్యాన్ని పెంచండి. చిన్న స‌మ‌స్యే అని మీరు మాట్లాడకుండా ఉంటే, అది మిమ్మల్ని కాటు వేయడానికి తిరిగి వస్తుంది! అని పద్మ ప్రియ‌ కళాశాల విద్యార్థుల‌తో అన్నారు.

Tags:    

Similar News