దారుణంగా దెబ్బైన పాన్ ఇండియా డైరెక్టర్లు!
ఈ సినిమాకి కథ అందించింది ప్రశాంత్ నీల్. కానీ సినిమా బాక్సాఫీస్ వద్ద దారుణంగా ఫెయిలైంది.
ప్రశాంత్ వర్మ, అట్లీ, ప్రశాంత్ నీల్ పాన్ ఇండియాలో దారుణంగా దెబ్బతిన్నారా? ఇండియాలో వాళ్ల బ్రాండ్ ఏమాత్రం వర్కౌట్ అవ్వలేదా? అంటే అవుననే అనాలి. అదేంటి ముగ్గురు పాన్ ఇండియాలో కోట్ల వసూళ్లు తెచ్చిన సినిమాలు చేసారు. వాళ్ల సినిమాలు ప్లాప్ అయినట్లు ఇదేం ఎలివేషన్ అనుకోవద్దు. ఎందుకంటే వాళ్ల ఫెయిలైంది మేకర్లగా కాదు. స్టోరీ రైటర్లగా. ఆ మధ్య శ్రీమురళీ హీరోగా సూరి దర్శకత్వం వహించిన `బఘీర` చిత్రం పాన్ ఇండియాలో రిలీజ్ అయిన సంగతి తెలిసిందే.
ఈ సినిమాకి కథ అందించింది ప్రశాంత్ నీల్. కానీ సినిమా బాక్సాఫీస్ వద్ద దారుణంగా ఫెయిలైంది. పుల్ రన్ లో ఈ సినిమా వసూళ్లు 30 కోట్లలోపే సాధించింది. అలాగే ప్రశాంత్ వర్మ కూడా ఇలాంటి అటెంప్ట్ చేసి ఫెయిలయ్యాడు. అశోక్ గల్లా హీరోగా నటించిన `దేవకీ నందవాసుదేవ` చిత్రానికి ప్రశాంత్ వర్మనే కథ అందించాడు. అర్జున జంధ్యాల తెరకెక్కించాడు. కానీ ఈ సినిమా ప్రేక్షకులకు కనెక్ట్ అవ్వలేదు. సినిమా ఎప్పుడు రిలీజ్ అయిందో? ఎప్పుడు థియేటర్ల నుంచి తీసేసారో? కూడా తెలియని పరిస్థితి.
ఇక వరుణ్ ధావన్ , కీర్తి సురేష్ జంటగా నటించిన ` బేబీజాన్` చిత్రానికి అట్లీ స్టోరీ అందించగా కలీస్ దర్శకత్వం వహించాడు. ఇటీవల రిలీజ్ అయిన ఈసినిమా ఎక్కడా సౌండ్ కూడా చేయలేదు. అట్లీ ఈ సినిమాని భారీ ఎత్తున ప్రమోట్ చేసాడు. ఈ సినిమా కారణంగా అట్లీ అవమానాలకు సైతం గురయ్యాడు. కానీ పనవ్వలేదు. అలా ముగ్గురు పాన్ ఇండియా డైరెక్టర్లకు ఈ మూడు సినిమా స్టోరీలు నెగిటివ్ ఇంపాక్ట్ ని మూటగట్టాయి.
పాన్ ఇండియాలో ముగ్గురుకి సంచలన దర్శకులుగా పేరుంది. వాళ్లకంటూ ప్రత్యేకమైన ఐడెంటిటీ ఉంది. కానీ ఆ బ్రాండ్ ఎక్కడా మార్కెట్ లో వర్కౌట్ అవ్వలేదు. కంటెంట్ లేని చిత్రాలుగానే ప్రేక్షకులు డిసైడ్ చేసారు. పాన్ ఇండియా బ్లాక్ బస్టర్ `కార్తికేయ-2` తర్వాత యంగ్ హీరో నటించిన మూడు సినిమాలు రిలీజ్ అయ్యాయి. కానీ ఆ సినిమాలేవి సరిగ్గా ఆడలేదు. పాన్ ఇండియాలో సిద్దార్ద్ కి గుర్తింపు ఉన్నా? అదెక్కడా కలిసి రాలేదు. అంతిమంగా స్టోరీ అన్నది సినిమాకి ఎంత కీలకం అన్నది మరోసారి ప్రూవ్ అయింది.