యంగ్‌ హీరో సినిమాలో పాన్‌ ఇండియా స్టార్స్‌

తమిళ్‌ తో పాటు తెలుగు సినీ ఇండస్ట్రీ లో కూడా గుర్తింపు, స్టార్‌ డమ్ ఉన్న హీరో శివ కార్తీకేయన్‌. తెలుగు లో ఈయన చేస్తున్న సినిమాలన్నీ కూడా వరుసగా డబ్‌ చేస్తున్నారు.

Update: 2023-11-17 06:33 GMT

తమిళ్‌ తో పాటు తెలుగు సినీ ఇండస్ట్రీ లో కూడా గుర్తింపు, స్టార్‌ డమ్ ఉన్న హీరో శివ కార్తీకేయన్‌. తెలుగు లో ఈయన చేస్తున్న సినిమాలన్నీ కూడా వరుసగా డబ్‌ చేస్తున్నారు. అడపా దడపా ఇక్కడ ఆయన సినిమాలు ఆడుతున్నాయి. కానీ తమిళనాట మాత్రం ఈయన సినిమాలు మినిమం గ్యారెంటీ అన్నట్లుగా సక్సెస్‌ ను దక్కించుకుంటున్నాయి

శివ కార్తికేయన్‌ వరుసగా సినిమాలు చేస్తూ వస్తున్నాడు. ప్రస్తుతం కమల్‌ హాసన్‌ సొంత బ్యానర్ అయిన రాజ్‌ కమల్‌ ఫిల్మ్స్‌ లో ఒక సినిమాను చేస్తున్నాడు. ఆ సినిమా పై ఏ స్థాయి లో అంచనాలు ఉన్నాయో అందరికి తెలిసిందే. ఇప్పుడు శివ కార్తికేయన్‌ మరో క్రేజీ మూవీని కమిట్‌ అయ్యాడ

మురుగదాస్ దర్శకత్వంలో శివ కార్తికేయన్ సినిమా ను ఇప్పటికే అధికారికంగా ప్రకటించారు. ఇప్పుడు ఈ సినిమాకు సంబంధించిన నటీనటుల విషయమై ఆసక్తికర చర్చ జరుగుతోంది. మలయాళ సూపర్‌ స్టార్‌ మోహన్‌ లాల్‌ ఈ సినిమాలో కీలక పాత్రలో నటించబోతున్నాడు. మలయాళంతో పాటు పాన్ ఇండియా స్థాయి లో మోహన్‌ లాల్‌ కి క్రేజ్‌ ఉంది.

ఇక బాలీవుడ్‌ స్టార్‌ నటుడు విద్యుత్‌ జమ్వాల్‌ కూడా కార్తికేయన్‌, మురుగదాస్ కాంబోలో రూపొందబోతున్న సినిమాలో కీలక పాత్రలో కనిపించబోతున్నాడు. వీరిద్దరూ ఈ సినిమాలో ఉండటం వల్ల పాన్‌ ఇండియా మూవీ అన్న భావన కలుగుతోంది అంటూ కొందరు మీడియా సర్కిల్స్ వారు మాట్లాడుకుంటున్నారు.

ఈ ఇద్దరితో పాటు హీరోయిన్‌ గా అక్కడ, ఇక్కడ గుర్తింపు దక్కించుకున్న సీతారామం బ్యూటీ మృణాల్‌ ఠాకూర్‌ ను ఎంపిక చేయడం జరిగింది. మొత్తానికి శివ కార్తికేయన్‌ మరియు మురుగదాస్‌ కాంబోలో రూపొందుతున్న సినిమా లో ఈ ముగ్గురు ఉండటం వల్ల పాన్ ఇండియా రేంజ్ లో విడుదల సమయంలో సందడి చేయడం ఖాయం అనిపిస్తుంది.




Tags:    

Similar News