అభిమాని హ‌త్య‌.. ఇంత‌కీ పవిత్ర గౌడ ఎవరు?

అభిమాని హ‌త్య కేసులో క‌న్న‌డ స్టార్ హీరో ద‌ర్శ‌న్, అత‌డి ప్రియురాలు ప‌విత్ర గౌడ అరెస్ట‌యిన సంగ‌తి తెలిసిందే.

Update: 2024-06-15 03:52 GMT

అభిమాని హ‌త్య కేసులో క‌న్న‌డ స్టార్ హీరో ద‌ర్శ‌న్, అత‌డి ప్రియురాలు ప‌విత్ర గౌడ అరెస్ట‌యిన సంగ‌తి తెలిసిందే. హ‌త్య‌కు ప్రేరేపించిన కీల‌క వ్య‌క్తి ప‌విత్ర గౌడ‌ను ఏ1 గా లిస్ట్ లో చేర్చ‌గా, ఏ2 గా ద‌ర్శ‌న్ పేరును చేర్చారు.

నిజానికి ఈ హ‌త్యోదంతం గురించి బ‌య‌ట‌కు వ‌చ్చే వ‌ర‌కూ అస‌లు ప‌విత్ర గౌడ ఎవ‌రు? అన్న‌ది ఎవ‌రికీ తెలీదు. పవిత్ర గౌడ తప్పుడు కారణాలతో హెడ్ లైన్స్ లోకి రావ‌డంతో ఇప్పుడు దేశ‌మంతా పాపుల‌రైంది. పవిత్ర గౌడ కన్నడ నటి అని, టాప్ మోడ‌ల్ అని చాలా మందికి తెలియ‌దు. ద‌ర్శ‌న్ అభిమాని రేణుకాస్వామి హత్య కేసులో ఆమెను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. హత్య కేసులో దర్శన్‌తో పాటు మరో తొమ్మిది మందిని అరెస్టు చేసినట్లు క‌థ‌నాలొచ్చాయి. మృతుడు రేణుక స్వామి పవిత్రకు అసభ్యకరమైన సందేశాలు పంపేవాడు.

అస‌లింత‌కీ ఈ గొడ‌వ‌లో ఇరుక్కున్న పవిత్ర గౌడ ఎవరు? అంటే వివ‌రాల్లోకి వెళ్లాలి. పవిత్ర గౌడ 1 జనవరి, 1970న జన్మించారు. 54 ఏళ్ల ప‌విత్ర కన్నడ నటి. ఆమె 2013లో రమేష్ అరవింద్ కామెడీ డ్రామా `చత్రిగలు సార్ చత్రిగలు`తో కన్నడ చిత్ర పరిశ్రమలో అడుగుపెట్టింది. తర్వాత 2016లో పవిత్ర థ్రిల్లర్ డ్రామా 54321తో తమిళ పరిశ్రమలో అడుగుపెట్టింది. ఆమె ప్రీతి కితాబు, అగమ్య వంటి సినిమాల్లో కూడా నటించింది.

మీడియా క‌థ‌నాల ప్రకారం రేణుకా స్వామి హత్య కేసులో పవిత్ర గౌడను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అనంత‌రం ఆమెను అన్నపూర్ణేశ్వరి నగర్ పోలీస్ స్టేషన్‌కు తీసుకుని వెళ్లారు. ఆమెను విచారించారు. రేణుకాస్వామి హత్య కేసులో దర్శన్‌ను మంగళవారం నాడు అరెస్టు చేశారు. దర్శన్‌తో తనకు దశాబ్ద కాలంగా సంబంధం ఉందని పవిత్ర ఇన్‌స్టాలో పేర్కొనడంతో, ఇప్పుడు హ‌త్యోదంతంలో దర్శన్ అరెస్ట్ తర్వాత పవిత్ర హత్య కేసులో కనెక్ట్ అయ్యింది.

పవిత్రతో దర్శన్ ఎఫైర్ గురించి చాలాసార్లు పుకార్లు మీడియా హెడ్ లైన్స్‌లో కనిపించాయి. 2011లో దర్శన్ కి, అతడి భార్య విజయ లక్ష్మి కి మ‌ధ్య గ‌డ‌వ‌లొచ్చాయి. దర్శన్‌పై గృహహింస ఆరోపణలు వచ్చాయి. అనేక ఒడిదుడుకుల న‌డుమ‌ మోడల్ కం నటి పవిత్రతో దర్శన్ వివాహేత‌ర‌ సంబంధాన్ని కలిగి ఉన్నాడని వాదనలు ఉన్నాయి. అత‌డు ప‌విత్ర‌ను రెండో పెళ్లి చేసుకున్నాడ‌ని కూడా ప‌లు మార్లు క‌న్న‌డ మీడియాలో క‌థ‌నాలొచ్చారు.

Tags:    

Similar News