పవన్.. మళ్ళీ షూటింగ్ లోకి ఎప్పుడు?

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఈసారి పిఠాపురం నియోజకవర్గం నుంచి పోటీ చేసిన విషయం తెలిసిందే.

Update: 2024-05-14 16:30 GMT

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఈసారి పిఠాపురం నియోజకవర్గం నుంచి పోటీ చేసిన విషయం తెలిసిందే. ఇక ఎన్నికల్లో ఆయనదే విజయం అనేలా చాలామంది మద్దతుగా నిలుస్తున్నారు. సినిమా ఇండస్ట్రీ నుంచి కొందరు పవన్ కళ్యాణ్ కు సపోర్ట్ అందించిన విషయం తెలిసిందే. ఇక పవన్ కళ్యాణ్ పాలిటిక్స్ ను కాసేపు పక్కన పెడితే ప్రస్తుతం ఆయన సినిమాల పెండింగ్ వర్క్ అయితే చాలానే ఉంది.

ముందుగా పవన్ కళ్యాణ్ ఏ సినిమా షూటింగ్ లో పాల్గొంటారు అనేది కూడా ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారుతోంది. అందరి ఫోకస్ ఎక్కువగా OG సినిమా పైనే ఉంది. ఈ సినిమా షూటింగ్ సగానికి పైగా పూర్తయింది. ఇక మిగిలిన షూటింగ్ కూడా వీలైనంత త్వరగా పూర్తి చేయాలి అని అనుకుంటున్నారు. ఇక పవన్ కళ్యాణ్ ప్రస్తుతం కాస్త విశ్రాంతిలో ఉన్నారు.

నిన్న మొన్నటి వరకు ఎలక్షన్స్ హడావిడి, ప్రచారాలలో చాలా బిజీగా గడిపిన ఆయన ఇప్పుడు కాస్త రెస్ట్ తీసుకుని ఫ్యామిలీతో గడపాలని అనుకుంటున్నారు. మరి కొన్ని రోజుల్లో పవన్ ఫ్యామిలీతో కలిసి విహారయాత్రకు వెళ్లాలనే ఆలోచనలో ఉన్నారు. ఇక ఆ తర్వాత మళ్లీ సినిమాలో షూటింగ్లో బిజీ అయ్యే అవకాశం ఉంది. ఇక ఆయన వచ్చి రాగానే ముందుగా దానయ్య ప్రొడక్షన్లో రూపొందుతున్న ఓజి సినిమా పని పూర్తి చేయబోతున్నాడు.

యువ దర్శకుడు సుజిత్ డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమా షూటింగ్ లో పవన్ కళ్యాణ్ దాదాపు రెండు వారాలపాటు పాల్గొనే అవకాశం ఉంది. అలాగే ఏ మాత్రం ఛాన్స్ దొరికినా ఉస్తాద్ భగత్ సింగ్ షూటింగ్ కూడా పూర్తి చేయాలని అనుకుంటున్నాడు. కానీ ప్రస్తుతం హరీష్ శంకర్ రవితేజ సినిమా పనిలో బిజీగా ఉన్నాడు మరి అతను ఆ సినిమాను పక్కన పెట్టి పవన్ కళ్యాణ్ కోసం ఇటువైపు యూ టర్న్ తీసుకుంటాడా లేదా అనేది చూడాలి.

అలాగే లిస్టులో హరిహర వీరమల్లు సినిమా కూడా ఉంది. ఈ సినిమా డైరెక్టర్ క్రిష్ తప్పుకోవడంతో ఆ బాధ్యతను నిర్మాత కొడుకు జ్యోతి కృష్ణ తీసుకున్నాడు. ఇక అతను కూడా పక్క ప్రణాళికతో పవన్ కళ్యాణ్ కోసం సిద్ధంగా ఉన్నాడు ఈ సినిమా షూటింగ్ దాదాపు 30 శాతానికి పైగా బ్యాలెన్స్ ఉన్నట్లుగా తెలుస్తోంది. ఇక ఆ బ్యాలెన్స్ పూర్తి చేయడానికి మాత్రం కాస్త ఎక్కువ టైం తీసుకునే ఛాన్స్ ఉంది.

మొత్తంగా ఈ సినిమాల బ్యాలెన్స్ షూటింగ్స్ అన్నీ కూడా ఏడాది చివరిలోపు ఫినిష్ చేయాలి అని పవన్ కళ్యాణ్ అనుకుంటున్నారు. అయితే పవన్ కళ్యాణ్ ఒకవేళ ఎన్నికల్లో గెలిస్తే మాత్రం సినిమాల షెడ్యూల్స్ లలో మార్పులు వచ్చే అవకాశం ఉంది. అనుకున్న టైమ్ కంటే మళ్ళీ ఎక్కువ టైమ్ కూడా పట్టవచ్చు.

Tags:    

Similar News