పుష్ప 2 ప్రీమియర్స్ దెబ్బ.. సరైనోళ్లే భయపడ్డారు!

ఈ ప్రీమియర్ షోలకి పబ్లిక్ నుంచి మంచి స్పందన వచ్చిన బీ,సి సెంటర్లు ఎక్కువగా ఉన్న చిన్న చిన్న టౌన్ లు, గ్రామీణ ప్రాంతాలలో మాత్రం టికెట్స్ అమ్ముడుపోవడం చాలా కష్టం అయ్యింది.

Update: 2024-12-06 07:14 GMT

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ‘పుష్ప 2’ ప్రీమియర్ షోలకి రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు పర్మిషన్ ఇచ్చాయి. దీంతో డిసెంబర్ 4న రాత్రి వేసిన ప్రీమియర్ షోలకి భారీగా టికెట్ ధరలు పెట్టి ప్రత్యేకంగా ఫ్యాన్స్ కోసం అని వేశారు. బీ,సి సెంటర్స్ లలో 800-900 టికెట్ రేట్లు పెడితే మల్టీ ప్లెక్స్ లలో 1500 రూపాయిల వరకు నిర్ణయించి ప్రీమియర్స్ వేశారు. అయితే సిటీస్ లలో ఈ ప్రీమియర్ షోలకి పబ్లిక్ నుంచి మంచి స్పందన వచ్చిన బీ,సి సెంటర్లు ఎక్కువగా ఉన్న చిన్న చిన్న టౌన్ లు, గ్రామీణ ప్రాంతాలలో మాత్రం టికెట్స్ అమ్ముడుపోవడం చాలా కష్టం అయ్యింది.

టికెట్ ధరలు ఎక్కువగా ఉండటంతో గ్రామీణ ప్రాంతాలలో అల్లు అర్జున్ అభిమానులు సైతం ఈ ప్రీమియర్ షోలలో సినిమాని వీక్షించేందుకు ఆసక్తి చూపలేదు. ఇంత పెద్ద స్టార్ సినిమాకి ప్రీమియర్స్ లో హౌస్ ఫుల్స్ ఉండాలి. కానీ రెండు మూడు రోస్ వరకు ఖాళీగా ఉండడం షాకింగ్. ఈ ఇంపాక్ట్ మూవీ కలెక్షన్స్ పైన కూడా పడిందనే మాట వినిపిస్తోంది. నిజానికి ఈ టికెట్ ధరలు పెంచుకోవడంతో పాటు ప్రీమియర్ షోల పర్మిషన్ కోసం నిర్మాతలు పవన్ కళ్యాణ్ ని కలిశారు. ఆ సందర్భంగా ప్రీమియర్ షోల టికెట్ ధరలు అంత పెద్ద మొత్తం పెట్టడం కరెక్ట్ కాదని ఆయన సలహా ఇచ్చినట్లు తెలుస్తోంది.

ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాలలో 800 రూపాయిలు పెట్టి టికెట్స్ కొనుక్కొని మూవీ చూడటానికి ఆడియన్స్ సిద్ధంగా ఉండరని, అంత బడ్జెట్ వారు భరించలేరని సలహా ఇచ్చారంట. అందుకే బీ,సి సెంటర్స్ లో ప్రీమియర్ షోల టికెట్ ధరలు తగ్గిస్తే బెటర్ అని సలహా ఇచ్చారంట. అయితే నిర్మాతలు, హీరో అల్లు అర్జున్ పవన్ కళ్యాణ్ సలహా పట్టించుకోలేదని ఇండస్ట్రీలో అనుకుంటున్నారు.

పవన్ సలహా పాటించి ఉంటే కలెక్షన్స్ పెరగడంతో పాటు సినిమాకి ఇంకా ఎక్కువ పాజిటివ్ రెస్పాన్స్ వచ్చేదని సినీ విశ్లేషకులు అంటున్నారు. టిక్కెట్ రేట్లు అందుబాటులో ఉంటే ఫుట్ ఫాల్స్ పెరిగేవి. థియేటర్స్ తప్పకుండా హౌస్ ఫుల్ అయ్యేవి. కానీ ఓ వర్గం ఫ్యాన్స్ సైతం ఆ రేంజ్ లో ధరలు  భరించేందుకు ధైర్యం చేయలేకపోయారు. ప్రీమియర్ షోల టికెట్ ధరలు ఇంపాక్ట్ రెండు తెలుగు రాష్ట్రాలలో బలంగా పడిందని తెలుస్తోంది.

దేవర టైమ్ లో టాక్ అటు ఇటుగా ఉన్నా కూడా ఈ తరహా ప్రభావం అయితే పడలేదు. నిర్మాతలు దేవర స్టైల్ లోనే టిక్కెట్ల రేట్లు పెట్టి ఉంటే బాగుండేది అనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఇక బీ సెంటర్స్ లో పుష్ప 2 హౌస్ ఫుల్ కాలేదు. ఇక సి సెంటర్స్ అయితే పలుచోట్ల కనీసం 10, 20 టికెట్లు కూడా ప్రీమియర్ షోలకి తెగకపోవడంతో షోలు చాలా చోట్ల రద్దు చేశారు.

ఒక సినిమాకు బి,సి సెంటర్స్ ఇచ్చే బూస్ట్ మల్టీప్లెక్స్ లు ఇవ్వలేవు. అందులోనూ మాస్ సినిమాలకు అదే ప్రధాన ఆయువు పట్టు. టాక్ అయినా కలెక్షన్స్ పెరగలన్నా అక్కడ జోరు చూపిస్తేనే ఏ సెంటర్స్ పై ప్రభావం ఉంటుంది. కానీ సరైనోళ్లే రేట్ల కారణంగా ప్రీమియర్స్ కు అంత రేట్లు పెట్టేందుకు భయపడ్డారు. ఇక ఒక స్టార్ హీరో సినిమాకి ఇలా ప్రీమియర్ షోలు రద్దు చేశారనే టాక్ ఎంతోకొంత మూవీపైన ప్రతికూల ప్రభావం చూపిస్తుందని ట్రేడ్ పండితులు అంటున్నారు. అయితే పవన్ మేరకు మేకర్స్ సలహా ఇచ్చి ఉండడనే కామెంట్స్ కూడా వినిపిస్తున్నాయి.

Tags:    

Similar News