పవర్ స్టార్ పవన్ కల్యాణ్-మెగా మేనల్లుడు సాయి తేజ్ కాంబోలో వచ్చిన సినిమా 'బ్రో'. సముద్రఖని దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం జులై 28న విడుదలై మిక్స్డ్ టాక్ తెచ్చుకుంది. రాజకీయంగానూ ఎన్నో విమర్శలను ఎదుర్కొని హాట్ టాపిక్‌గా నిలిచింది. అలాగే ఈ చిత్రం పవన్ ఫ్యాన్స్‌కు ఫుల్ ఎంటర్టైన్మెంట్ ఇవ్వగా.. కామన్ ఆడియెన్స్‌ను మాత్రం కాస్తా నిరాశపరిచింది. మొదటి వీకెండ్లో మంచి వసూళ్లనే అందుకున్న ఈ చిత్రం.. ఆ తర్వాత జోరును కొనసాగించలేకపోయింది. వర్కింగ్ డేస్‌లో డీలా పడిపోయింది.
అయితే ఇప్పుడు ఈ సినిమా థియేటర్ రన్ టైమ్ ముగిసింది. అటు సూపర్ స్టార్ రజనీకాంత్ జైలర్.. ఇటు మెగాస్టార్ చిరంజీవి భోళా శంకర్ సినినిమాలు ఒక్క రోజు గ్యాప్‌లో రీసెంట్గా రావడంతో ఆల్మోస్ట్ అన్ని థియేటర్లలో బ్రోను ఈ కొత్త చిత్రాలనే ప్రదర్శిస్తున్నారు. దీంతో 'బ్రో' ఓటీటీ స్ట్రీమింగ్ ఎప్పుడా అంటూ చర్చలు మొదలయ్యాయి. ఈ సినిమా కోసం ఓటీటీ ఆడియెన్స్ ఎదురుచూస్తున్నారు.
ఈ క్రమంలోనే తాజాగా ఈ సినిమా ఓటీటీ ప్రీమియర్స్ రిలీజ్ గురించి గుడ్ న్యూస్ బయటకు వచ్చింది. ఈ నెలలోనే బ్రో మూవీ డిజిటల్ ప్లాట్ ఫామ్ రిలీజ్ అవుతుందని గట్టిగా ప్రచారం జరుగుతోంది. ఆగస్టు 25 లేదా 26నుంచి ఓటీటీ ప్లాట్ ఫామ్ వేదికగా స్ట్రీమింగ్ కాబోతున్నట్లు తెలిసింది. జీ5 ఓటీటీలోకి ఇది వచ్చే అవకాశం ఉందని తెలిసింది. అయితే దీనిపై ఎటువంటి అధికార ప్రకటన రాలేదు. అలాగే అమెజాన్ ప్రైమ్ వేదికగా కూడా వచ్చే ఛాన్స్ ఉంటుందని అంటున్నారు.
ఇకపోతే ఈ సినిమా విషయానికొస్తే.. తమిళంలో సూపర్ హిట్ అందుకున్న వినోదయ సీతంకు రీమేక్‌గా ఈ చిత్రం రూపొందింది. ఈ చిత్రంలో కేతిక శర్మ, ప్రియా వారియర్ హీరోయిన్లుగా నటించగా.. బాలీవుడ్ బ్యూటీ ఊర్వశీ రౌతేలా స్పెషల్ సాంగ్‌లో చిందులేసి పవన్ ఫ్యాన్స్‌ను బాగా ఆకట్టుకుంది. తనికెళ్ళ భరణి, అలీ రాజా, వెన్నెల కిషోర్, బ్రహ్మానందం, రోహిణి ముఖ్య పాత్రల్లో నటించారు. తమన్ స్వరలా సమకూర్చారు.
మాటల మాంత్రికుడు తెలుగు నెటివిటీకీ తగ్గట్టుగా మార్చి ఈ సినిమాకు స్క్రీన్‌ప్లే, మాటలు అందించారు. కానీ అవి కాస్త బోల్తా కొట్టాయి. సోషల్‌మీడియాలో కొద్ది రోజులపాటు త్రివిక్రమ్‌పై బాగా నెగిటివిటీ వచ్చింది. ఆ తర్వాత ఈ సినిమా రాజకీయ కోణంలో విమర్శలు ఎదుర్కోవడంతో మరింత హాట్ టాపిక్‌గా మారడంతో త్రివిక్రమ్‌పై ఫోకస్ తగ్గిపోయింది.