పవర్ స్టార్ ఫ్యాన్స్ కి.. అన్ని కిక్కులు ఆ రోజే

పవన్ కళ్యాణ్ అభిమానులు అతన్ని రాజకీయ నాయకుడిగా చూసుకోవాలని అనుకుంటున్నారు

Update: 2023-08-08 04:25 GMT

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులు అతన్ని రాజకీయ నాయకుడిగా ఎంతలా అభిమానిస్తున్నారో అంతకు మించి హీరోగా తెరపై చూసుకోవాలని అనుకుంటున్నారు. అందుకే పవన్ కళ్యాణ్ సినిమాలు వస్తే ఇప్పటికి పూనకాలు వచ్చినట్లుగా ఫ్యాన్స్ థియేటర్స్ కి క్యూ కడతారు. సరైన కథ పడితే సినిమా ఎలాంటి బ్లాక్ బస్టర్ అవుతుందో అత్తారింటికి దారేది, గబ్బర్ సింగ్ చూపించాయి.

అయితే పవర్ స్టార్ సినిమా అంటే ఫ్యాన్స్ లో హై ఎక్స్ పెక్టేషన్స్ ఉంటాయి. అతని నుంచి అదిరిపోయే పంచ్ డైలాగ్స్, స్టైలిష్ యాక్షన్ సీక్వెన్స్, అంతకుమించి ఫన్ కోరుకుంటారు. అయితే ఫ్యాన్స్ ని సంతృప్తి పరిచే ప్రయత్నంలో దర్శకులు కథల మీద ఫోకస్ పెట్టడం లేదని ఈ మధ్య పవన్ కళ్యాణ్ సినిమాల విషయంలో వినిపించే విమర్శలు. భీమ్లా నాయక్, బ్రో మూవీస్ లో పవన్ కళ్యాణ్ ఎలివేషన్ కోసం పెట్టినంత శ్రద్ధ కథపై పెట్టి ఉంటే బ్లాక్ బస్టర్ అయ్యేవని ఫ్యాన్స్ నుంచి వినిపించే మాట

అయితే ఇప్పుడు పవన్ కళ్యాణ్ నుంచి ఒక సాలిడ్ బ్లాక్ బస్టర్ మూవీని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. ప్రస్తుతం అతని చేతిలో మూడు సినిమాలు ఉన్నాయి. ఈ మూడు కూడా పూర్తి భిన్నమైన కథలతో సిద్ధమవుతున్నవే కావడం విశేషం. సుజిత్ దర్శకత్వంలో ఓజీ మూవీ మాఫియా బ్యాక్ డ్రాప్ లో పాన్ ఇండియా ప్రాజెక్ట్ గా సిద్ధమవుతోంది. దీనిపై అంచనాలు గట్టిగానే ఉన్నాయి. హరీష్ శంకర్ దర్శకత్వంలో ఉస్తాద్ భగత్ సింగ్ సిద్ధమవుతోంది.

హరీష్ శంకర్ అంటే రీమేక్ కింగ్ అని చెప్పొచ్చు. హీరోయిజాన్ని ఎలివేట్ చేయడంలో హరీష్ శంకర్ మేకింగ్ విజన్ నెక్స్ట్ లెవల్ లో ఉంటుంది. అందుకే ఉస్తాద్ భగత్ సింగ్ పైన అంచనాలు ఉన్నాయి. క్రిష్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న హరిహర వీరమల్లు పీరియాడికల్ జోనర్ లో రాజుల కాలం నటి కథగా రానుంది. పవన్ కళ్యాణ్ కెరియర్ లో మొదటి సారి ఇలాంటి భిన్నమైన రోల్ చేస్తున్నారు.

ఇలా ఈ మూడు సినిమాలు ప్రత్యేకంగా ఉండటంతో కచ్చితంగా హిట్ ఖాయం అనుకుంటున్నారు. పవన్ కళ్యాణ్ బర్త్ డే అయిన సెప్టెంబర్ 9న ఈ మూడు చిత్రాల నుంచి ఫ్యాన్స్ కి అదిరిపోయే సర్ప్రైజ్ ఇవ్వాలని ఆయా చిత్రాల దర్శకులు ఆలోచిస్తున్నారు. ఓజీ మూవీ డిసెంబర్ లో రిలీజ్ చేయాలని సుజిత్ ప్లాన్ చేసుకుంటున్నారు. ఉస్తాద్ భగత్ సింగ్ సంక్రాంతి లేదా వేసవి టార్గెట్ గా సిద్ధమవుతోంది. ఇక హరిహరవీరమల్లు ఎన్నికలకి ముందే వస్తుందని నిర్మాత ఏఎం రత్నం అంటున్నారు. మరి ఈ సినిమాలు పవన్ కళ్యాణ్ ఇమేజ్ ని ఎంత వరకు నిలబెడతాయో చూడాలి.

Tags:    

Similar News