పవన్ జీ పరుగులు పెట్టించడానికి రెడీ అవుతున్నారా?
ఆన్ సెట్స్ కి రావడానికి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ముహూర్తం పెట్టేసారా? ఇక ఆలస్యం అమృతం విషంగా భావించి మ్యాకప్ వేసుకోవడానికి రెడీ అవుతున్నారా?
ఆన్ సెట్స్ కి రావడానికి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ముహూర్తం పెట్టేసారా? ఇక ఆలస్యం అమృతం విషంగా భావించి మ్యాకప్ వేసుకోవడానికి రెడీ అవుతున్నారా? అంటే అవుననే లీకులందుతున్నాయి. ఎన్నికలు అయిపోయినా..ఫలితాలు వచ్చేసినా..ప్రభుత్వం ఏర్పాటు చేసినా...అది గడిచి రెండు నెలలు అయిపోయినా పవన్ ఇంకా సినిమాల వైపు రాని సంగతి కళ్ల ముందు కనిపిస్తూనే ఉంది. ఆయన ఎప్పుడు వస్తారా? అని దర్శక, నిర్మాతలు ఎదురు చూస్తున్నారు.
ఈ నేపథ్యంలో పవన్ కూడా రంగంలోకి దిగాలనే నిర్ణయించుకున్నారుట. ఈ రెండు నెలలు డీప్యూటీ సీఎంగా చేయాల్సిన ముఖ్యమైన పనులన్నీ చేసేసి అక్టోబర్ నుంచి మ్యాకప్ వేసుకుని కెమెరా ముందకు వచ్చేయాలని భావిస్తున్నారుట. తనకోసం ఎదురుచూస్తోన్న నిర్మాతల్ని ఇంకేమాత్రం వెయిట్ చేయించ కూడదని సీన్ లోకి వచ్చే ప్రణాళిక సిద్దం చేస్తున్నారుట. తొలుత `ఓజీ` సినిమా షూటింగ్ పూర్తి చేస్తారుట. ఇప్పటికే చాలా భాగం షూటింగ్ పూర్తయింది.
ఈ నేపథ్యంలో పెండింగ్ షూటింగ్ కూడా పూర్తి చేస్తే తన బాధ్యత తీరిపోతుంది. అటుపై పోస్ట్ ప్రొడక్షన్ పనులు చేసుకోవడానికి యూనిట్ అవకాశం ఉంటుంది. మళ్లీ డబ్బింగ్ కోసం పవన్ నాలుగైదు రోజులొస్తే సరిపోతుంది. మరి ఇదే సమయంలో `హరిహర వీరమల్లు` కోసం కూడా డేట్టు కేటాయిస్తారా? అన్నది సస్పెన్స్ . ఎందుకంటే పవన్ కోసం ఏ.ఎం రత్నం కూడా అంతే ఆశగా ఎదురు చూస్తున్నారు. ఆ సినిమా కూడా మధ్యలోనే ఉంది. రత్నం బాగా కావాల్సిన స్నేహితుడు.
పైగా ఇప్పుడా ప్రాజెక్ట్ డైరెక్టర్ కూడా మారాడు. క్రిష్ స్థానంలో జ్యోతికృష్ణ వచ్చాడు. ఈ నేపథ్యంలో నిర్మాత ఇబ్బందిని కూడా పవన్ గుర్తించే అవకాశం లేకపోలేదు. మరోవైపు `ఉస్తాద్ భగత్ సింగ్` కోసం దర్శకుడు హరీష్ శంకర్ కూడా క్యూలో ఉన్నాడు. హరీష్ తెరకెక్కిస్తోన్న `మిస్టర్ బచ్చన్` కూడా షూటింగ్ పూర్తయింది . ఈనెలలోనే ఆ సినిమా రిలీజ్ అవుతుంది. మరి ఇలాంటి పరిస్థితుల్లో పవన్ ఏ సినిమాకి ఎలా డేట్లు ఇస్తారు? అన్నది చూడాలి.