OG + సాహో లింక్.. ఇవి గమనించారా

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ పుట్టినరోజు సందర్భంగా ఓజీ టీజర్ రిలీజై ఫ్యాన్స్ లో పూనకాలు తెప్పించింది.

Update: 2023-09-03 05:28 GMT

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ పుట్టినరోజు సందర్భంగా ఓజీ టీజర్ రిలీజై ఫ్యాన్స్ లో పూనకాలు తెప్పించింది. పవన్ లుక్స్, వైలైన్స్, బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్.. ప్రతీది ఊహించని రేంజ్ లో మైండ్ బ్లో చేశాయి. శత్రువులను చిరుతలా వేటాడుతూ.. పోలీస్ స్టేషన్ వెళ్లి మరీ చెయ్యి నరికేంత పవర్ ఫుల్ లీడర్ గా పవన్ ను సూపర్ గా చూపించారు. ఈ ప్రచార చిత్రం చూస్తుంటే పవన్ కల్యాణ్ కు సరైన కథతో ఓ స్ట్రైట్ ఫిల్మ్స్ పడితే.. ఆయన స్టామినా ఎలా ఉండబోతుందో ఈ సినిమా రుచి చూపించబోతున్నట్లు అర్థమైంది.

వాస్తవానికి పవన్ కల్యాణ్ తమ్ముడు, ఖుషి, బద్రి తర్వాత తన రేంజ్ కు మ్యాచ్ అయ్యేలా భారీ హిట్ అందుకోలేకపోయిన పవన.. ఆ తర్వాత చాలా కాలానికి గబ్బర్ సింగ్, అత్తారింటికి దారేదితో సక్సెస్ అందుకున్నారు. మళ్లీ చాలా గ్యాప్ తర్వాత రీఎంట్రీలో వకీల్ సాబ్, భీమ్లానాయక్, బ్రో వంటి రీమేక్ సినిమాలు చేశారు. అవి కూడా పవన్ రియల్ స్టామినాకు తగ్గట్టు సక్సెస్ లు కాలేదు. పైగా బ్యాక్ టు బ్యాక్ రీమేక్స్ చేయడంతో పవన్ ఫ్యాన్స్ కాస్త హర్ట్ కూడా అయ్యారు.

కానీ ఇప్పుడు అలా అస్సలు కనిపించట్లేదు. లాంగ్ టైమ్ తర్వాత పవన్ అభిమానులకు పెద్ద ట్రీట్ రాబోతున్నట్లు అర్థమవుతోంది. ఎందుకంటే ఈ టీజర్ ప్రతి ఫ్రేమ్ పూనకాలు తెప్పించాయి. సినిమాలో మంచి స్టన్నింగ్ కంటెంట్ ఉన్నట్లు చూపించారు. పోలీస్ స్టేషన్‌కు వెళ్లి మరీ ఒకరి చెయ్యి నరికేంత పవర్ ఫుల్ మాఫియా నాయకుడిగా పవన్ కల్యాణ్ పాత్రను సుజీత్ చూపించడం హైలైట్ గా ఉంది.

ఇకపోతే ఓజీ సినిమా కన్నా ముందు దర్శకుడు సుజీత్ 'సాహో' సినిమా చేసిన సంగతి తెలిసిందే. వాజీ సిటీలో ఆ కథ జరిగినట్లు చూపించారు. అయితే ఆ వాజీ సిటీకి, ముంబయిలో జరిగిన ఒరిజినల్ గ్యాంగ్‌స్టర్‌కు సంబంధం ఉంటుందని తెలుస్తోంది. ఎందుకంటే ఇప్పుడీ 'ఓజీ'లో 'వాజీ ఇంపోర్ట్స్ అండ్ ఎక్స్పోర్ట్స్' అని బోర్డు చూపించారు సుజీత్. దాని ముందు ఓ యాక్షన్ సీక్వెన్ జరిగినట్లు హింట్ ఇచ్చారు. దీంతో ఈ సినిమా సుజిత్ యూనివర్స్ అయి ఉంటుందని, ఓజీకి సాహోకు లింక్ ఉంటుందని అంతా తెగ మాట్లాడేసుకుంటున్నారు.

అలాగే పోలీస్ స్టేషన్ లో చెయ్యి నరికేటప్పుడు పవన్ మరాఠీలో డైలాగులు కూడా చెప్పారు. ఇంతకీ, ఆ మాటలకు అర్థం ఏంటో తెలుసా అని అభిమానులు తెగ వెతికేస్తున్నారు. 'Lavkar' అంటే... 'త్వరగా' అని అర్థం. 'Khade Khade Kaayi Bagthos Jaakar Dhund' అంటే... నిలబడి ఏం చూస్తున్నావ్ రా! వెళ్లి త్వరగా వెతుకు'.. 'Davde' అంటే 'కత్తి' అని అర్థం. ఇంకా పవన్ బ్రాస్ లెట్ కూడా హైలైట్ అయింది. దాని మీద డ్రాగన్ వచ్చింది అంటూ ఉంది. అంటే పవన్ పాత్ర అంత పవర్ ఫుల్ గా ఉంటుందని అర్థం.

Tags:    

Similar News