అన్నయ్య కోసం పవన్ పదవి అడిగారా?
ఇదంతా కేవలం తమ్ముడిపై ఉన్న ప్రేమా భిమానంతో. ఎలాగైనా వైకాపాని గద్దె దించాలని అన్నసంకల్పంతో తాను చేయాల్సిందంతా చేసారు.
`జనసేన` గెలుపుకోసం మెగా బ్రదర్ నాగబాబు ఎంతగా శ్రమించారో చెప్పాల్సిన పనిలేదు. తనకు అందుబాటులో ఉన్న మాధ్యమం సోషల్ మీడియా ద్వారా తాను చేయాల్సిందంతా ఓ సైనికుడిలాగే చేసాడు. చివరికి తన సీటును సైతం త్యాగం చేసారు. ఇదంతా కేవలం తమ్ముడిపై ఉన్న ప్రేమా భిమానంతో. ఎలాగైనా వైకాపాని గద్దె దించాలని అన్నసంకల్పంతో తాను చేయాల్సిందంతా చేసారు.
అలా కష్టపడటంతోనే పవన్ కళ్యాణ్ ఎమ్మెల్యేగా గెలిచారు. మంత్రి వర్గంలో డిప్యూటీ సీఎంగా బాధ్యతలు చేపట్టారు. ఈ నేపథ్యంలోనాగబాబుకి కూడా ఏదైనా నామినేటెడ్ పదవి వస్తుందనే ప్రచారం చాలా కాలంగా జరుగుతోంది. దీనిలో భాగంగా టీటీడీ చైర్మన్ పదవి ఆయనదే అన్నట్లు అప్పట్లో ప్రచారం సాగింది. కానీ దీన్ని నాగబాబు ఖండిచారు. తాజాగా ప్రభుత్వం నామినేటెడ్ పదవుల కసరత్తు మొదలు పెట్టింది.
ఈ నేపథ్యంలో ఫిల్మ్ డెవలెప్ మెంట్ కార్పోరేషన్ చైర్మన్( ఎఫ్ డీసీ) బాధ్యతలు నాగబాబుకు ఇస్తారు? అన్న ప్రచారం కొన్ని రోజులుగా జరుగుతోంది. ఈ పదవి కోసం టీడీపీ నుంచి కూడా ఓ పెద్దాయన బరిలో ఉన్నారని వెలుగులోకి వచ్చింది. ఆయన చంద్రబాబుని కలిసినట్లు కూడా ప్రచారం సాగింది. అయితే ఈ పదవి విషయంలో నాగబాబు మాత్రం ఇంకా ఎలాంటి ఖండన చేయలేదు.
ఈనేపథ్యంలో తాజాగా ఆ పదవి ని తన అన్నయ్యకే ఇవ్వాలంటూ డీసీఎం పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని కోరినట్లు సమాచారం. పార్టీ తరుపున పవన్ నాగబాబు పేరు ఖరారు చేసారుట. అనంతరమే ఈ విషయాన్ని సీబీఎన్ దృష్టికి తీసుకెళ్లినట్లు ఫిలిం సర్కిల్స్ లో వినిపిస్తుంది. అయితే చంద్రబాబు మాత్రం ఇంకా ఏ విషయం ఫైనల్ చేయలేదని అంటున్నారు. మరి ఆ పదవి నాగబాబు వరిస్తుందా? లేదా? అన్నది చూడాలి.