శుభాకాంక్షలు చెప్పి ట్విస్ట్‌ ఇచ్చిన పాయల్‌..!

ఈ సమయంలో పాయల్ రాజ్‌ పూత్‌ నుంచి వచ్చిన ట్వీట్‌ అందరి దృష్టిని ఆకర్షిస్తోంది.;

Update: 2025-02-07 05:22 GMT
శుభాకాంక్షలు చెప్పి ట్విస్ట్‌ ఇచ్చిన పాయల్‌..!

పాయల్‌ రాజ్‌పుత్‌ ప్రధాన పాత్రలో అజయ్ భూపతి దర్శకత్వంలో వచ్చిన మిస్టరీ థ్రిల్లర్‌ మంగళవారం ఎంతటి విజయాన్ని సొంతం చేసుకుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఒక అమ్మాయి వింత సమస్యతో బాధపడుతూ ఉంటే, సమాజంలో ఆమె ఎదుర్కొనే ఇబ్బందులను గురించి దర్శకుడు ఒక మంచి స్క్రీన్‌ప్లేతో దానికి థ్రిల్లర్ ఎలిమెంట్స్‌, హర్రర్‌ ఎలిమెంట్స్ జోడించి చూపించాడు. ఆకట్టుకునే కథ, స్క్రీన్‌ ప్లేతో మంగళవారం రూపొంది ప్రేక్షకుల ముందుకు వచ్చి భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. అందుకే మంగళవారం సీక్వెల్‌ కోసం ప్రేక్షకులు ఎదురు చూస్తున్నారు.

దర్శకుడు అజయ్‌ భూపతి చాలా రోజుల క్రితమే మంగళవారం కి సీక్వెల్‌ ఉంటుంది అంటూ అధికారికంగా ప్రకటించారు. సీక్వెల్‌కి సంబంధించిన కథ, స్క్రిప్ట్‌ వర్క్‌కి చాలా సమయం పట్టింది. ఎట్టకేలకు ప్రీ ప్రొడక్షన్‌ వర్క్‌ ప్రారంభం అయ్యింది. త్వరలోనే రెగ్యులర్‌ షూటింగ్‌ ప్రారంభించే అవకాశాలు ఉన్నాయి. ఈ సమయంలో పాయల్ రాజ్‌ పూత్‌ నుంచి వచ్చిన ట్వీట్‌ అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ఆమె ట్వీట్‌ చాలా పెద్ద ట్విస్ట్‌ను సైతం ఇచ్చినట్లు అయ్యింది. చిత్ర యూనిట్‌ సభ్యులు అందరికీ శుభాకాంక్షలు చెప్పడం ద్వారా మంగళవారం సీక్వెల్‌లో తాను నటించడం లేదని ట్విస్ట్‌ ఇచ్చింది.

మంగళవారం సినిమా అనగానే పాయల్‌ రాజ్‌పుత్ గుర్తుకు వస్తుంది. సినిమాలోని ఆమె నటన గురించి ఎంత చెప్పినా తక్కువే అన్నట్లు ఉంటుంది. ఆమె బోల్డ్‌గా నటించడం వల్లే మంగళవారం అంతటి విజయాన్ని సొంతం చేసుకుంది. అలాంటి విజయాన్ని సొంతం చేసుకున్న పాయల్ కచ్చితంగా సీక్వెల్‌లో ఉంటుందని అంతా భావించారు. కానీ అనూహ్యంగా పాయల్‌ రాజ్‌పుత్‌ సీక్వెల్‌లో ఉండటం లేదని తెలుస్తోంది. దర్శకుడు అజయ్‌ భూపతి మరో ముద్దుగుమ్మతో సినిమాను చేసేందుకు ప్లాన్‌ చేస్తున్నారా అనే చర్చ మొదలు అయ్యింది.

మొత్తానికి పాయల్‌ చేసిన ట్వీట్‌ తో అనేక అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. తనకు ఎంతో ఇష్టమైన దర్శకుడు అజయ్ భూతికి శుభాకాంక్షలు. ఆయన దర్శకత్వంలో నటించడంను ఎప్పటికీ మరచిపోలేను. కచ్చితంగా మరో మంచి మాస్టర్ పీస్‌ సినిమా రానుంది. ఆ సినిమా కోసం నేను కూడా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నాను అంటూ మంగళవారం సినిమాకు సంబంధించిన హింట్ ఇచ్చింది. సక్సెస్ లెగస్సీ కంటిన్యూ కావాలంటూ శుభాకాంక్షలు చెప్పింది. అతి త్వరలోనే మంగళవారం సీక్వెల్‌ హీరోయిన్ ఎవరు, ఇతర నటీనటులు ఎవరు అనే విషయమై క్లారిటీ వచ్చే అవకాశాలు ఉన్నాయి.

Tags:    

Similar News