పీకాక్ ఫోటోషూట్: రకుల్ బంగారు ధగధగలు
తాజాగా `ది పీకాక్` మ్యాగజైన్ కవర్ ఫోటోషూట్‌తో అభిమానుల ముందుకు వచ్చింది. ఈ ఫోటోషూట్ లో రకుల్ బంగారు ధగధగలతో తళతళలాడింది.
సౌత్ ని విడిచిపెట్టి బాలీవుడ్‌కి వెళ్లిపోయింది రకుల్ ప్రీత్ సింగ్. అక్కడ బాలీవుడ్ నటుడు, నిర్మాత జాకీ భగ్నానీని పెళ్లాడిన సంగతి తెలిసిందే. పెళ్లి తర్వాత రకుల్ కెరీర్ మరింత స్లో అయింది. ప్రస్తుతం దే దే ప్యార్ దే సీక్వెల్, భారతీయుడు 3 సినిమాలు మినహా కొత్త సినిమాకి సంతకం చేసిందే లేదు. అయితే సోషల్ మీడియాల వేదికగా రకుల్ తన అభిమానులకు టచ్ లో ఉంది. నిరంతరం ఫోటోషూట్లను షేర్ చేస్తూ ఫ్యాన్స్ ని యంగేజ్ చేస్తోంది.
తాజాగా `ది పీకాక్` మ్యాగజైన్ కవర్ ఫోటోషూట్‌తో అభిమానుల ముందుకు వచ్చింది. ఈ ఫోటోషూట్ లో రకుల్ బంగారు ధగధగలతో తళతళలాడింది. ఎంపిక చేసుకున్న పరికిణీ... వీ షేప్ బ్లౌజ్ కటింగ్ తనలోని ఆకర్షణను మరింత పెంచింది. ముఖ్యంగా గోల్డ్ ఛమ్కీలతో డిజైనర్ లుక్ ఎంతో స్పెషల్ గా కనిపిస్తోంది. ఎంపిక చేసుకున్న ప్రత్యేక డిజైనర్ లుక్ కి తగ్గట్టే మెడలో భారీతనం నిండిన ఆభరణాన్ని ధరించింది. ప్రస్తుతం ఈ స్పెషల్ ఫోటోషూట్ ఇంటర్నెట్ లో వైరల్ గా మారుతోంది.
ది పీకాక్ తో చిట్ చాట్ లో రకుల్ కొన్ని ఆసక్తికర విషయాలను తెలిపింది. తాను చిన్నప్పటి నుంచి బాలీవుడ్ సినిమాలు చూస్తూ పెరిగానని.. షారూఖ్ నటించిన డిడిఎల్‌జే .. కుచ్ కుచ్ హోతా హై వంటి రొమాంటిక్ లవ్ స్టోరి సినిమాలను చూస్తానని తెలిపింది. బాలీవుడ్ లో రొమాన్స్ జానర్ కి పిచ్చి అభిమానిని అని కూడారకుల్ వెల్లడించింది. సినిమా అభిమానిగా అన్ని జానర్ల సినిమాలను చూస్తానని తెలిపింది. అలాగే మ్యూజిక్ క్యాసెట్లు కొనడాన్ని కూడా ఇష్టపడతానని వెల్లడించింది.