ఆ కేసులో టాలీవుడ్ నిర్మాత అరెస్టు!

హైదరాబాద్ లో ఒక ఎఫ్ఎంసీజీ సంస్థను స్థాపించి రాంబాబు.. మల్టీలెవల్ మార్కెటింగ్ పేరుతో అధిక వడ్డీని ఆశ చూపి వందలాది మందిని ముంచేసినట్లుగా చెబుతున్నారు.

Update: 2023-12-02 04:35 GMT

టాలీవుడ్ నిర్మాత అట్లూరి నారాయణరావు అరెస్టు అయ్యారు. వందలాది మందిని మోసం చేశారన్న ఆరోపణలతో అందిన ఫిర్యాదును పరిశీలించిన పోలీసులు.. ప్రాథమిక విచారణ అనంతరం కేసు కట్టి అరెస్టు చేసిన వైనం కలకలాన్ని రేపింది. ‘గర్ల్ ఫ్రెండ్’.. ‘నీది నాది ఒకే కథ’ చిత్రాలకు నిర్మాతగా వ్యవరించిన ఆయన ఎఫ్ఎంసీజీ దందాలో పలువురిని మోసం చేసినట్లుగా ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఈ కేసులో ప్రధా సూత్రధారి రాంబాబుగా పోలీసులు భావిస్తున్నారు. ఆసక్తికరమైన విషయం ఏమంటే.. ఈ మోసంలో సినీ నిర్మాతకు నేరుగా సంబంధం లేకున్నా.. ఆయన చేసిన పనికి అడ్డంగా బుక్ అయినట్లుగా చెబుతున్నారు. అసలేం జరిగిందంటే..

హైదరాబాద్ లో ఒక ఎఫ్ఎంసీజీ సంస్థను స్థాపించి రాంబాబు.. మల్టీలెవల్ మార్కెటింగ్ పేరుతో అధిక వడ్డీని ఆశ చూపి వందలాది మందిని ముంచేసినట్లుగా చెబుతున్నారు. ప్రాథమిక లెక్కల ప్రకారం ఈ మోసం దాదాపు రూ.540 కోట్లుగా చెబుతున్నారు. తాజాగా సంస్థ బోర్డును తిప్పేశారు. దీంతో బాధితులు ఆయనపై పెద్ద ఎత్తున ఒత్తిళ్లు తీసుకొస్తున్నారు. ఇదిలా ఉండగా ఒక సీఏ చొరవతో సదరు రాంబాబు సినీ నిర్మాత నిర్మాత అట్లూరి నారాయణను కలిశారు. తాను ఉన్న పరిస్థితిని చెప్పుకున్నారు.

దీనికి రియాక్టు అయిన అట్లూరి.. తనకున్న పలుకుబడితో కేసు లేకుండా చేస్తానని హామీ ఇచ్చారు. ఇందుకుగాను అన్ని ఖర్చులతో కలిపి రూ.20 కోట్లు ఇవ్వాల్సి ఉంటుందని పేర్కొన్నారు. బేరసారాల అనంతరం ఈ డీల్ రూ.2 కోట్లకు తెగింది. దీంతో.. అడ్వాన్సుగా రూ.10 లక్షలను అట్లూరి నారాయణకు చెల్లించాడు. దీనికి తోడు రూ.కోటి విలువైన బంగారు ఆభరణాల్ని కూడా ఇచ్చాడు రాంబాబు.

ఈ బంగారు ఆభరణాల్ని కరిగించిన అట్లూరి.. రూ.90 లక్షలకు అమ్మేసి సొమ్ము చేసుకున్నాడు. రాంబాబును అదుపులోకి తీసుకోగా విషయం మొత్తంబయటకు రావటంతో నారాయణరావును కూడా అరెస్టు చేసిన పోలీసులు కోర్టు ఎదుట హాజరుపర్చారు. దీంతో.. విచారణ జరిపిన నాంపల్లి కోర్టు అదనపు విచారణ కోసం పోలీసుల కస్టడీకి అప్పగించాల్సిందిగా కోరారు. దీనికి కోర్టు సానుకూలంగా స్పందించింది. కస్టడీలోకి తీసుకున్న తర్వాత కరిగించిన బంగారాన్ని రికవరీ చేయాలని పోలీసులు భావిస్తున్నారు.

Tags:    

Similar News