వీడియో: కన్నుగీటి కొంటెగా బుట్టబొమ్మ విన్యాసాలు
ఇటీవల కొంతకాలంగా సౌత్ కి దూరమైన పూజా నెమ్మదిగా ఇండస్ట్రీ జనం గుండెల్లోకి కొంటె బాణాలు రువ్వి ఇక్కడ కూడా మళ్లీ పెద్ద స్టార్లతో అవకాశాలు కొట్టేయాలని ప్లాన్ చూస్తోంది.
కన్ను గీటుతోంది.. పెదవి ముద్దిస్తానంటోంది.. కొంటె ఎక్స్‌ప్రెషన్స్ తో గుండె గుల్ల చేస్తోంది. అందమైన కాటుక కళ్లను అటూ ఇటూ తిప్పుతూ యూత్‌ని అదే పనిగా కవ్విస్తోంది.. ఇంతకీ ఎవరీ భామ? అంటే.. బుట్టబొమ్మ పూజా హెగ్డే గురించే ఇదంతా. ఇటీవల కొంతకాలంగా సౌత్ కి దూరమైన పూజా నెమ్మదిగా ఇండస్ట్రీ జనం గుండెల్లోకి కొంటె బాణాలు రువ్వి ఇక్కడ కూడా మళ్లీ పెద్ద స్టార్లతో అవకాశాలు కొట్టేయాలని ప్లాన్ చూస్తోంది.
పూజా ఇటీవల షాహిద్ కపూర్ సరసన 'దేవా' లాంటి యాక్షన్ చిత్రంలో నటించింది. ఈ సినిమా మరో వారంలో విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ సమయంలో ప్రచార హంగామాతో అదరగొట్టేస్తోంది పూజా. కొంత గ్యాప్ తర్వాత అదిరిపోయే హిట్టు కొట్టాలని కలలు గంటున్న పూజాకు ఈసారి ఆశించినది దక్కుతుందని అంచనా వేస్తున్నారు. దేవా టీజర్ ట్రైలర్ సహా ప్రతిదీ ఆకట్టుకున్నాయి. దీంతో షాహిద్ తనకు హిట్టివ్వడం ఖాయమని పూజా ఫ్యాన్స్ కూడా భావిస్తున్నారు.
మరోవైపు పూజా హెగ్డే బ్లాక్ బస్టర్ ఫ్రాంఛైజీలో అవకాశం అందుకుంది. లారెన్స్ మాస్టర్ 'కాంచన 4'లో నటించనుందని కథనాలొస్తున్నాయి. పూజా హెగ్డే ఊహించని విధంగా కథను ప్రభావితం చేసే పాత్రను పోషిస్తుందని, స్క్రిప్ట్ విన్న వెంటనే ఓకే చెప్పేసిందని తెలుస్తోంది. రాఘవ లారెన్స్ దర్శకత్వం వహించి, నటించే ఈ హారర్ కామెడీ ఎంటర్‌టైనర్‌లో పూజా హెగ్డేతో పాటు నోరా ఫతేహి కూడా నటించనుంది. కాంచన 4ని మనీష్ షా నిర్మిస్తున్నారు. ఇప్పటికే చిత్రీకరణ మొదలైంది. కాంచన 4 హిందీ వెర్షన్ సహా దక్షిణాది నాలుగు భాషల్లోను విడుదలవుతుంది. స్త్రీ 2 విజయం తర్వాత హారర్ సినిమాల జోరు హోరు పెరిగింది. ఇదే హుషారులో లారెన్స్ మాస్టర్ తెలివిగా పాన్ ఇండియాలో హారర్ సినిమాతో దూసుకొస్తున్నారు.