పూజా హెగ్డే అసలు ప్లాన్ అదా!

హీరోయిన్ పూజా హెగ్డేకు ఎలాంటి క్రేజ్ ఉందో అందరికీ తెలిసిందే. నాగచైతన్య ఒక లైలా కోసం మూవీతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన బ్యూటీ..

Update: 2024-10-09 03:56 GMT

హీరోయిన్ పూజా హెగ్డేకు ఎలాంటి క్రేజ్ ఉందో అందరికీ తెలిసిందే. నాగచైతన్య ఒక లైలా కోసం మూవీతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన బ్యూటీ.. డెబ్యూ సినిమాతో పర్వాలేదనిపించుకున్నారు. ఆ తర్వాత మెగా హీరో వరుణ్ తేజ ముకుందాలో కనిపించి ఆకట్టుకున్నారు. అదే టైంలో బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్ తో మొహెంజోదారో చిత్రంలో నటించే ఛాన్స్ కొట్టేశారు. కానీ అనుకున్న స్థాయిలో ఆ మూవీ మెప్పించలేకపోయింది.

కెరీర్ స్టార్టింగ్ లో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ రంగస్థలం మూవీలో ఐటమ్ సాంగ్ చేసిన పూజ.. ఆ తర్వాత ఒక్కసారిగా అవకాశాలు అందుకున్నారు. అరవింద సమేత, అలా వైకుంఠపురంలో వంటి సూపర్ హిట్స్ సాధించారు. దీంతో ఆమె కెరీర్ కు తిరుగులేదు అనుకున్న సమయంలో ఫ్లాప్స్ మూటగట్టుకున్నారు. రాధేశ్యామ్, ఆచార్య, బీస్ట్ వంటి చిత్రాలతో నిరాశపరిచారు. గతేడాది కిసీ కా బాయ్ కిసీ కా జాన్ సినిమాలో నటించినా.. మళ్లీ నిరాశే ఎదురైంది.

దీంతో చిన్న గ్యాప్ తీసుకున్న పూజా హెగ్డే.. ఇప్పుడు మళ్లీ బిజీ అయిపోయారు. కోలీవుడ్ స్టార్ సూర్య హీరోగా పీరియాడికల్‌ యాక్షన్‌ థ్రిల్లర్‌ తెరకెక్కుతున్న పాన్ ఇండియా మూవీలో నటిస్తున్నారు. ఇప్పటికే తన షూటింగ్ పార్ట్ ను పూర్తి చేసుకున్నారు. బాలీవుడ్ షాహిద్ క‌పూర్‌ తో చేస్తున్న యాక్ష‌న్ మూవీ దేవాను ఇప్పుడు కంప్లీట్ చేసే పనిలో ఉన్నారు. రీసెంట్ గా విజయ్ 69 ప్రాజెక్టు గాను మెయిన్ హీరోయిన్ గా సెలెక్ట్ అయ్యారు. ఇటీవల జరిగిన పూజా కార్యక్రమాల్లో కూడా పాల్గొన్నారు.

మళ్లీ వరుస హిట్స్ అందుకుని.. తన టాలెంట్ ఏంటో చూపించాలని ఉవ్విళ్లూరుతున్నారు పూజా హెగ్డే. ఒక బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంటే.. మళ్లీ ఆమె వరుస ఛాన్సులు దక్కించుకునే అవకాశం ఉంది. అయితే పూజా హెగ్డే భారీగా రెమ్యునరేషన్ తీసుకుంటున్నారని గతంలో వార్తలు వచ్చాయి. దీంతో కొందరు మేకర్స్.. ఆమెను సెలెక్ట్ చేయడం లేదని రూమర్స్ వినిపించాయి. ఇప్పుడు మళ్లీ ఆమె వరుస ఆఫర్లు అందుకుంటుండడంతో ఎలా సాధ్యమని నెటిజన్లు డిస్కస్ చేసుకుంటున్నారు.

అయితే కొత్త ఆఫర్ల కోసం కొన్ని నెలలపాటు వెయిట్ చేసిన పూజ.. తన రెమ్యునరేషన్‌ ను బాగా తగ్గించారట. తన టీమ్ మొత్తం కూడా ఖర్చులను తగ్గించుకుందని ఊహాగానాలు వస్తున్నాయి. అందుకే ఆమెకు పెద్ద ప్రాజెక్టుల్లో ఛాన్సులు వస్తున్నాయని వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. మార్కెట్ కు తగ్గట్లే రెమ్యునరేషన్ ఆమె అడుగుతున్నట్లు తెలుస్తోంది. మరి ఇందులో నిజమెంత అనేది తెలియదు.

Tags:    

Similar News