అల్లు అర్జున్ అరెస్ట్.. సెల్ఫ్ మేడ్ స్టార్ అన్న పూనమ్!
ఇప్పుడు హీరోయిన్ పూనమ్ కౌర్ సోషల్ మీడియాలో స్పందించారు. బన్నీని ఉద్దేశించి నెట్టింట పోస్ట్ పెట్టారు.
టాలీవుడ్ స్టార్ హీరో అల్లు అర్జున్ అరెస్ట్ అయిన విషయం తెలిసిందే. హైదరాబాద్ లోని ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లో ఉన్న సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాట ఘటనలో రేవతి అనే మహిళ మృతి చెందగా.. ఆమె కుమారుడు శ్రీ తేజ తీవ్రంగా గాయపడ్డాడు. ఈ ఘటనలో చిక్కడపల్లి పోలీసులు పలువురిపై కేసులు నమోదు చేశారు.
సంధ్య థియేటర్ యాజమాన్యంపై కేసులు నమోదు చేసి ఇప్పటికే ముగ్గురిని అరెస్ట్ చేశారు. అల్లు అర్జున్ పై బీఎన్ ఎస్ 105, 118 సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు. ఇప్పటికే బన్నీ.. తనపై పెట్టిన కేసుల విషయంలో హైకోర్టును ఆశ్రయించగా.. శుక్రవారం మధ్యాహ్నం పోలీసులు ఆయనను తన నివాసంలో అరెస్ట్ చేశారు.
అయితే అల్లు అర్జున్ అరెస్ట్ ను పలువురు సినీ సెలబ్రిటీలు ఖండిస్తున్నారు. బాలీవుడ్ హీరో వరుణ్ ధావన్ ఇప్పటికే స్పందించారు. ఘటన విషాదకరమైనదప్పటికీ ఒక్కరిపై నిందలు వేయలేమని వ్యాఖ్యానించారు. ఇప్పుడు హీరోయిన్ పూనమ్ కౌర్ సోషల్ మీడియాలో స్పందించారు. బన్నీని ఉద్దేశించి నెట్టింట పోస్ట్ పెట్టారు.
బహిరంగ ర్యాలీలు, వడదెబ్బ, తొక్కిసలాట వంటి ఘటనల్లో ఎంతో మంది అమాయకులు చనిపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. ఆ లిస్ట్ కోసం చూస్తున్నట్లు తెలిపారు. అసౌకర్యం, గుండెపోటు వల్ల ఓ యంగ్ యాక్టర్ ప్రాణాలు కోల్పోయారని చెప్పారు. వారసత్వంతో కాకుండా స్వయంకృషితో ఎదిగిన స్టార్ బన్నీ అని రాసుకొచ్చారు.
ప్రస్తుతం పూనమ్ కౌర్ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అనేక మంది అల్లు అర్జున్ అభిమానులు స్పందిస్తున్నారు. రేవతి మృతి కేసులో తమ అభిమాన హీరోకు నేరుగా ఏం సంబంధం లేదని చెబుతున్నారు. విడుదల చేయాలని కోరుతున్నారు. అలా ఎక్కడ చూసినా నెట్టింట ఆ పోస్టులే కనిపిస్తున్నాయి.
అయితే అల్లు అర్జున్ - సుకుమార్ కాంబినేషన్‌లో తెరకెక్కిన పుష్ప 2.. డిసెంబర్ 5న వరల్డ్ వైడ్ గా రిలీజ్ అవ్వగా.. డిసెంబర్ 4వ తేదీ రాత్రి ప్రీమియర్స్ వేశారు మేకర్స్. ఆ క్రమంలో సంధ్య థియేటర్ కు అల్లు అర్జున్ రాగా.. ఫ్యాన్స్ ఎగబడ్డారు. దీంతో అప్పుడు తొక్కిసలాట జరగ్గా.. ఇప్పుడు ఆ కేసులో బన్నీని పోలీసులు అరెస్ట్ చేశారు.