త్రివిక్రమ్ వల్ల అలా చేశా: పూనమ్ కౌర్
నటి పూనమ్ కౌర్, స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ మధ్య ఏం జరిగిందో తెలియదు గానీ.. కొన్నేళ్లుగా ఆ ఇష్యూ హాట్ టాపిక్ గా మారిన విషయం తెలిసిందే.
నటి పూనమ్ కౌర్, స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ మధ్య ఏం జరిగిందో తెలియదు గానీ.. కొన్నేళ్లుగా ఆ ఇష్యూ హాట్ టాపిక్ గా మారిన విషయం తెలిసిందే. సోషల్ మీడియా వేదికగా ఎప్పటికప్పుడు అనేక సార్లు పూనమ్ కౌర్.. త్రివిక్రమ్ ను ఉద్దేశించి పరోక్షంగా ట్వీట్లు పెడుతుంటుంది. కొంతకాలంగా నేరుగా త్రివిక్రమ్ పేరు పెట్టి మరీ ట్వీట్స్ చేస్తుంది.
మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ కూడా ఫిర్యాదు చేసినట్లు ఆ మధ్య తెలిపింది. కానీ ఎలాంటి యాక్షన్ తీసుకోలేదని కామెంట్ చేయడంతో శివ బాలాజీ స్పందించారు. తమకు ఎలాంటి కంప్లైంట్ అందలేదని తెలిపారు. సోషల్ మీడియాలో ట్వీట్స్ పెట్టే కన్నా.. వచ్చి తమకు గానీ, పోలీసులకు గానీ ఫిర్యాదు చేస్తే చర్యలు తీసుకుంటామన్నారు.
కానీ ఇప్పటి వరకు త్రివిక్రమ్ వల్ల తన అన్యాయం జరిగిందని చెప్పిన పూనమ్, దానిని బయట పెట్టలేదు. ఇప్పుడు మరోసారి ఆ విషయంపై మాట్లాడి ఆరోపణలు చేయడం చర్చనీయాంశంగా మారింది. తాను త్రివిక్రమ్ వల్ల అన్నీ ఆపేశానని తెలిపింది. తాను ఆయన వల్లే సినిమాలకు దూరమయ్యానని పరోక్షంగా కామెంట్ చేసింది.
టాలీవుడ్ సీనియర్ హీరో నందమూరి బాలకృష్ణకు రీసెంట్ గా కేంద్ర ప్రభుత్వం పద్మభూషణ్ అవార్డు ప్రకటించిన విషయం తెలిసిందే. దీంతో అనేక మంది విషెస్ చెప్పగా.. తాజాగా పూనమ్ కౌర్ కూడా జై బాలయ్య అంటూ ట్విట్టర్ లో పోస్ట్ పెట్టింది. ఆ సమయంలో ఇప్పుడు మీరెం చేస్తున్నారని ఓ నెటిజన్ క్వశ్చన్ చేశారు.
దీంతో పూనమ్.. అప్పట్లో తాను సినిమాలు చేసేదాన్ని అని చెప్పింది. కానీ త్రివిక్రమ్ తో పాటు కొన్ని గ్రూప్స్ టార్చర్ వల్ల అన్నీ ఆపేశానని ఆరోపణలు చేశారు. ప్రస్తుతం ఆమె కామెంట్.. నెట్టింట వైరల్ గా మారింది. అసలు ఇష్యూ ఏంటి చెప్పండని నెటిజన్లు అడుగుతున్నారు. అంతే కానీ ఇలా పోస్టులు పెడితే ఏం వస్తుందని అంటున్నారు.
ఇక పూనమ్ విషయానికొస్తే.. ఒకప్పుడు వరుస సినీ అవకాశాలతో బిజీ బిజీగా గడిపింది అమ్మడు. మాయాజాలం మూవీతో టాలీవుడ్ లోకి వచ్చిన ఆమె.. తన యాక్టింగ్ తో అందరినీ మెప్పించిందనే చెప్పాలి. ఆ తర్వాత శౌర్యం, నిక్కీ అండ్ నీరజ్, శ్రీనివాస కళ్యాణం, నెక్స్ట్ ఏంటి వంటి అనేక సినిమాల్లో యాక్ట్ చేసింది. చివరగా నాతిచరామిలో నటించగా.. సోషల్ మీడియాలో మాత్రం పూనమ్ చాలా యాక్టివ్ గా కనిపిస్తుంటుంది.