ప్రభాస్ లిస్టులో యువ దర్శకుడు.. అయ్యే పనేనా?

అయితే ప్రస్తుతం ప్రభాస్ లైన్ అప్ చూసుకుంటే మరో మూడేళ్ళ వరకు కొత్త దర్శకుడితో సినిమా చేయడం కష్టం అని చెప్పొచ్చు.

Update: 2024-10-18 04:38 GMT

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం దేశంలోనే అత్యధిక మార్కెట్ ఉన్న హీరోగా దూసుకుపోతున్నాడు. ఆయన సినిమాలపై వందల కోట్ల బడ్జెట్ పెట్టడానికి నిర్మాతలు వెనుకాడటం లేదు. దర్శకులు కూడా అవుట్ ఆఫ్ ది బౌండరీలో లార్జర్ దెన్ లైఫ్ లాంటి కథలని ప్రభాస్ తో చేయడానికి ఆసక్తి చూపిస్తున్నారు. అయితే ప్రస్తుతం ప్రభాస్ లైన్ అప్ చూసుకుంటే మరో మూడేళ్ళ వరకు కొత్త దర్శకుడితో సినిమా చేయడం కష్టం అని చెప్పొచ్చు.

కానీ ప్రభాస్ మాత్రం చాలా మంది దర్శకుల కథలు వింటున్నాడని టాక్ వినిపిస్తోంది. రీసెంట్ గా ప్రశాంత్ వర్మ ప్రభాస్ కి ఒక స్టోరీ నేరేట్ చేసాడనే టాక్ తెరపైకి వచ్చింది. ప్రస్తుతం ఆ కథ పైన చర్చలు జరుగుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. అయితే ప్రభాస్ లైన్ అప్ ముగిసేవరకు ప్రశాంత్ వర్మ తో ఇప్పట్లో సినిమా చేసే అవకాశం ఉండకపోవచ్చు. ఈ మూవీ పట్టాలు ఎక్కాలంటే ప్రస్తుతం చేతిలో ఉన్న ఐదు ప్రాజెక్ట్స్ కంప్లీట్ కావాల్సి ఉంటుంది.

అంటే కనీసం 3 నుంచి 4 ఏళ్ళ తర్వాత ప్రశాంత్ వర్మతో అనుకునే ప్రాజెక్ట్ స్టార్ట్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది. ప్రశాంత్ వర్మ కూడా ప్రస్తుతం మోక్షజ్ఞతో మూవీ చేస్తున్నాడు. అలాగే ‘జై హనుమాన్’ కూడా తెరకెక్కించాల్సి ఉంటుంది. ఈ రెండు కంప్లీట్ అయ్యేసరికి ఈజీగా మూడేళ్లు అయిపోతుంది. అందుకే తన సూపర్ హీరో ప్రాజెక్ట్స్ కోసం ముందుగానే ప్రశాంత్ వర్మ హీరోలని కన్ఫర్మ్ చేసుకునే పనిలో ఉన్నారనే మాట ఇండస్ట్రీలో వినిపిస్తోంది.

ప్రభాస్ ప్రస్తుతం మారుతి దర్శకత్వంలో ‘ది రాజాసాబ్’ మూవీ ఫినిష్ చేసే పనిలో ఉన్నారు. దీంతో పాటు హను రాఘవపూడి దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ‘ఫౌజీ’ షూటింగ్ దశలో ఉంది. ప్రభాస్ లేని సన్నివేశాలని హను ప్రస్తుతం తెరకెక్కిస్తున్నారు. నెక్స్ట్ సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో ‘స్పిరిట్’ మూవీ సెట్స్ పైకి వెళ్లనుంది. 2025 ఆరంభంలో ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ చేయాలని సందీప్ రెడ్డి అనుకుంటున్నారు.

2025 ద్వితీయార్ధంలో ‘కల్కి 2898ఏడీ పార్ట్ 2’ షూటింగ్ మొదలు కావొచ్చని అనుకుంటున్నారు. 2026లో ‘సలార్ 2’ స్టార్ట్ చేస్తాడని అంచనా వేస్తున్నారు. దీని తర్వాత కొత్త సినిమా ఏదైనా మొదలయ్యే అవకాశం ఉందని ఇండస్ట్రీ వర్గాలలలో మాట్లాడుకుంటున్నారు. అయితే ప్రశాంత్ వర్మ ప్లానింగ్ ఎలా ఉందనేది ఇప్పుడు తెలియాల్సి ఉంది. అలాగే ఆ లోపు ఈ యువ దర్శకుడు మరిన్ని బిగ్ హిట్స్ అందుకుంటే మంచిది.

Tags:    

Similar News