#కల్కి 2898 AD.. భైరవ లుక్‌తో సర్‌ప్రైజ్
తాజాగా ప్రభాస్ అభిమానులకు మహాశివరాత్రి కానుక అందింది. కాశీ వీధుల సాక్షిగా 'భైరవ'ని మేకర్స్ పరిచయం చేశారు.
'సలార్' లాంటి భారీ బ్లాక్ బస్టర్ తర్వాత ప్రభాస్ నుంచి వస్తున్న 'కల్కి 2898 AD' పై ప్రపంచవ్యాప్తంగా ఆసక్తి నెలకొంది. భారతదేశంలోనే తొలి సైన్స్ ఫిక్షన్ ఫాంటసీ సినిమాగా భవిష్యత్ మానవ జీవితాన్ని కళ్లకు కడుతూ నాగ్ అశ్విన్ చేస్తున్న అద్భుత ప్రయోగం గురించి సర్వత్రా ఉత్కంఠగా వేచి చూస్తున్నారు. కల్కి టీమ్ ఇంతకుముందు ప్రభాస్ లుక్ ని రిలీజ్ చేయగా అద్భుత స్పందన వచ్చింది. ఇప్పుడు భైరవ పాత్రను పరిచయం చేసింది! నిజానికి డ్యూయల్ రోల్ లో నటిస్తున్నాడో లేదో తెలియదు కానీ ఈ లుక్ లో ప్రభాస్ చాలా స్టైలిష్ గా కనిపిస్తున్నాడు. తాజాగా ప్రభాస్ అభిమానులకు మహాశివరాత్రి కానుక అందింది. కాశీ వీధుల సాక్షిగా 'భైరవ'ని మేకర్స్ పరిచయం చేశారు.
మే 2024న ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. 'కల్కి 2898 AD' ప్రచార హంగామా ఇప్పటికే మొదలైంది. అంతకంతకు టీమ్ హీట్ పెంచేస్తోంది. గత కొన్ని నెలలుగా మేకర్స్ ఎప్పటికప్పుడు అప్‌డేట్‌లను విడుదల చేయడంతో ప్రభాస్ అభిమానుల్లో క్యూరియాసిటీ అంతకంతకు పెరిగింది. ఇటీవల ఇటలీ నుండి విడుదల చేసిన రెండు ఫోటోలు కూడా వైరల్ అయిన సంగతి తెలిసిందే. మహా శివరాత్రి సందర్భంగా ప్రభాస్ లుక్‌ని, పాత్ర పేరును చిత్రబృందం వెల్లడించింది.
ప్రభాస్ ఇందులో ద్విపాత్రాభినయం చేస్తున్నాడా లేదా? అన్నదానిపై అంతగా స్పష్ఠత లేదు. కానీ ప్రభాస్ ఈ లుక్‌లో చాలా వైవిధ్యంగా కనిపిస్తున్నాడు. కాశీ వీధుల్లోంచి వచ్చిన 'భైరవ'లుక్ ఆశ్చర్యపరుస్తోంది. ఈ చిత్రం భవిష్యత్ ప్రపంచం ఆధునికత బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కుతోంది. అందుకు సంబంధించిన సెటప్ కూడా ఈ పోస్టర్ లో కనిపిస్తోంది. ప్రభాస్ భైరవగా డాషింగ్‌గా కనిపిస్తున్నాడు. అతని డ్రెస్సింగ్ చాలా ప్రత్యేకంగా కనిపిస్తోంది. తన చేతికి ధరించిన మోడ్రనైజ్డ్ గాజులు ఆకట్టుకుంటున్నాయి. మెలి తిరిగిన కండలు.. పచ్చబొట్టుతో ఉన్న ప్రభాస్ నయా లుక్ అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. విడుదలయ్యే ప్రతి పోస్టర్ ఈ చిత్రంపై అంచనాలను పెంచుతున్నాయి.
ఈ భారీ చిత్రం నుండి టీజర్ లేదా ట్రైలర్ కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా వేచి చూస్తున్నారు. సంతోష్ నారాయణన్ సంగీతం అందిస్తుండగా, డిజోర్డ్జే స్టోజిలిజ్కోవిచ్ సినిమాటోగ్రఫీని అందిస్తున్నారు. అశ్విని దత్ ఈ చిత్రానికి నిర్మాత. డిస్టోపియన్ బ్యాక్‌డ్రాప్... నటీనటుల లుక్ వీక్షకులలో చాలా ఆసక్తిని రేకెత్తించాయి. అమితాబ్ బచ్చన్, దీపికా పదుకొణె, కమల్ హాసన్, దిశా పటానీ కీలక పాత్రలు పోషిస్తున్నారు.