ప్రభాస్.. శివయ్యతోనే సగం కెరీర్!

తరువాత ప్రభాస్ కెరియర్ లో క్లాసిక్ మూవీగా అందరికి చేరువ అయిన చిత్రం పౌర్ణమి.

Update: 2024-03-09 04:29 GMT

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ని సాక్షాత్తు మహా శివుడు ముందుకి నడిపిస్తున్నట్లుగా అతని కెరియర్ చూస్తుంటే అనిపిస్తోంది. ప్రభాస్ మొదటి సినిమా ఈశ్వర్. మూవీలో హీరో పేరు కూడా అదే కావడం విశేషం. ఈ సినిమా యావరేజ్ టాక్ సొంతం చేసుకుంది. అయితే ప్రభాస్ ని మాస్ హీరోగా ఇండస్ట్రీకి ఈశ్వర్ పరిచయం చేసింది. తరువాత ప్రభాస్ కెరియర్ లో క్లాసిక్ మూవీగా అందరికి చేరువ అయిన చిత్రం పౌర్ణమి. ఈ మూవీ కథాంశం శివాలయం బ్యాక్ డ్రాప్ లోనే ఉంటుంది.

శివయ్య సన్నిధిలో ఛార్మితో డాన్స్ చేయించడం కోసం పౌర్ణమి మూవీలో ప్రభాస్ ప్రయాణం సాగుతుంది. సాంగ్స్ కూడా శివుని బ్యాక్ డ్రాప్ లో ఉంటాయి. డార్లింగ్ ప్రభాస్ ని పాన్ ఇండియా స్టార్ గా మార్చిన బాహుబలి సినిమాలో మహేంద్ర బాహుబలికి పెంచిన తల్లి అతనికి శివుడు అని పేరు పెడుతుంది. అలాగే ఎవ్వడంట ఎవ్వడంట నిన్ను ఎత్తుకుంది సాంగ్ ప్రభాస్ ఇమేజ్ ని ఆకాశం అంత ఎత్తుకి తీసుకెళ్లింది. శివుని నేపథ్యంలోనే ఈ సాంగ్ ఉండటం విశేషం.

మంచు విష్ణు కన్నప్ప సినిమాలో ప్రభాస్ ఏకంగా మహాశివుడి పాత్రలో కనిపించబోతున్నాడు. ఈ పాత్ర నిడివి తక్కువ అయిన కన్నప్ప స్టోరీని ఇంపాక్ట్ చేసేలా ఉంటుందనే ప్రచారం నడుస్తోంది. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ప్రభాస్ కల్కి2898 ఏడీ మూవీ చేస్తున్నాడు. ఈ సినిమా నుంచి మహా శివరాత్రి సందర్భంగా ఒక స్పెషల్ పోస్టర్ ని రిలీజ్ చేశారు.

ఇందులో కల్కి కాకుండా భైరవ అనే మరో క్యారెక్టర్ లో కూడా ప్రభాస్ కనిపించబోతున్నాడు అని పోస్టర్ తో కన్ఫర్మ్ చేశారు. భైరవలో కూడా శివుడి అర్థం ఉంది. ఫ్యూచర్ కాశీ వీధుల్లో సంచరించే శివయ్యగా అతని క్యారెక్టర్ ఉండబోతోందని తెలుస్తోంది. ఇలా కెరియర్ లో మొదటి సినిమా నుంచి ప్రస్తుతం చేస్తోన్న పాన్ వరల్డ్ మూవీ వరకు ప్రభాస్ ప్రయాణంలో మహాశివుడు ఏదో రకంగా కనెక్షన్ కలిగి ఉన్నాడు.

ప్రభాస్ ఇమేజ్ పెరగడానికి కూడా ఆ శివయ్య బ్యాక్ డ్రాప్ లో ప్రభాస్ ఆయా సినిమాలలో చేసిన సీక్వెన్స్ కారణంగా నిలవడం గమనార్హం. యాదృశ్చికంగా జరిగిన కూడా తెలియని ఇంటర్ లింక్ అయితే ప్రభాస్ కి మహాశివుడికి మధ్య నడుస్తుందని అభిమానులు నమ్ముతున్నారు.. భైరవ క్యారెక్టర్ రివీల్ చేయడంతో కచ్చితంగా కల్కి 2898 ఏడీ మూవీ కూడా సూపర్ హిట్ అయ్యి డార్లింగ్ ప్రభాస్ ఇమేజ్ ని వరల్డ్ వైడ్ గా ఎస్టాబ్లిష్ చేస్తుందని అభిమానులు భావిస్తున్నారు.

Tags:    

Similar News